Latest Updates
-
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.! -
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే.. -
బీట్రూట్, అటుకులతో హాట్ అండ్ స్వీట్ హెల్తీ స్నాక్స్ -
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే.. -
అధిక మాసంలో ఈ 4 వస్తువులు ఇంట్లో ఉంటే చాలా డేంజర్.. వెంటనే తీసేయండి.! -
World cycle day 2026: ప్రపంచ సైకిల్ దినోత్సవం.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఇదే.! -
తిన్న వెంటనే కడుపు ఉబ్బిపోతోందా?..ఇలా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది!.. -
‘అద్దం’తో దంపతుల మధ్య తరచూ గొడవలు.. ఎందుకంటే.? -
ఆగ్రా ఫేమస్ పేఠా స్వీట్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.. -
కారం లేకుండానే ఘాటుఘాటు రుచితో వైట్ మటన్ పులావ్.. మసాలా నషాళానికి అంటాల్సిందే.!
ఈ హెయిర్ ఆయిల్ వాడితే.. జుట్టును ఎంత లాగినా ఊడదు.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన విధానం, కాలుష్యం కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైన సమస్య జుట్టు రాలడం. ఈ సమస్యను నివారించేందుకు చాలామంది ఎన్నో రకాల టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ ఉంటారు. ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు. అయినా ఫలితం మాత్రం పొందలేకపోతున్నారు. అయితే బృంగరాజ్ నూనెను జుట్టుకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా మారడంతో పాటు జుట్టు రాలే సమస్య తీరిపోతుంది.
ఈ నూనెను ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. అయితే దీనిని ఎలా చేసుకోవాలి, ఏ విధమైన పద్ధతులు వాడాలి, ఈ నూనెతో ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బృంగరాజ్ ఆయిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు
50 గ్రాముల బృంగరాజ్ ఆకులు
250 గ్రాముల కొబ్బరి నూనె
1 కప్పు నీళ్లు

బృంగరాజ్ ఆయిల్ తయారీ విధానం..
బృంగరాజ్ నూనె తయారీకి వినియోగించే బృంగరాజ్ ఆకులు తాజా ఉంటే మాత్రం ముందుగా వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఒకవేళ ఆ ఆకులు ఎండినవి అయితే నేరుగానే వినియోగించుకోవచ్చు.
ముందుగా బృంగరాజ్ ఆకులను మిక్సీలో వేసి బాగా ఒక పొడిలాగా రుబ్బుకోవాలి. అనంతరం ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళుపోసి, ఆ నీటిలో ఒక గ్లాస్‌లో పైన పేర్కొనబడిన మోతాదులో నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. అనంతరం వేడి అయిన ఆ నూనెలో ముందుగా చేసి పెట్టుకున్న పొడిని కలుపుకోవాలి.
ఆ పొడి రంగు మారేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత నూనె బృంగరాజ్ రంగులోకి మారేందుకు సన్నటి మంట మీద ఉడికించుకోవాలి. అనంతరం గ్యాస్ నుంచి కిందకు దించేసి, పూర్తిగా చల్లారినాక వడకట్టేసి ఒక గ్లాసులో నిల్వ చేసుకుంటే సరిపోతుంది. దానిని వినియోగించేందుకు అది సిద్ధమైనట్లే.
బృంగరాజ్ ఆయిల్‌ను ఎలా వాడాలి?
ఈ బృంగరాజ్ నూనెను మీరు పలు విధాలుగా వాడుకోవచ్చు. ఏ విధంగా వాడుకున్నా మంచి ఫలితాలే వస్తాయి. జుట్టుకు మేలు జరుగుతుంది. ఈ నూనెను రాత్రి పడుకునే ముందు జుట్టు కూతుర్లకు పట్టే విధంగా బాగా మసాజ్ చేసుకుంటూ తలకు రాసుకోవాలి. అలాంటప్పుడు ఈ ఆకులని ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని నివారించి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
అలాగే గుడ్డు సోన లేదా పెరుగులో ఈ నూనెను కలిపి జుట్టును హెయిర్ ప్యాక్‌లాగా వేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా జుట్టు మృదువుగా మారడంతో పాటు జుట్టుకు కావాల్సిన పోషకాలు అంది మరింత ఒత్తుగా, నిగనిగలాడేలా చేస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని నివారించి.. కొత్త వెంట్రుకలు మొలకెత్తేందుకు సహాయపడుతుంది. ఒకవేళ ఈపైన పేర్కొన్న రెండు పద్ధతులు మీకు నచ్చనట్టైతే మీ షాంపూలో కలిపి స్నానం చేసేటప్పుడు కూడా మీరు దీనిని వినియోగించుకోవచ్చు.
బృంగరాజ్ ఆయిల్ ప్రయోజనాలు..
ఈ బృంగరాజ్ ఆయిల్ ముఖ్యంగా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అలాగే జుట్టు నల్లగా మారడంతో పాటు బాగా స్ట్రాంగ్‌గా తయారవుతుంది. చుండ్రు సమస్యను నివారించి, జుట్టుకు అందాల్సిన పోషకాలను అందజేసే విధంగా చేస్తుంది. తెల్ల జుట్టును నివారించడంతో పాటు జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
గమనిక: ఈ కథనంలో మేము పేర్కొనబడిన విషయాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు మీరు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకోవాలి. అలాంటప్పుడే మీకు ఉత్తమైన ఫలితాలు వస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications