Latest Updates
-
బాధ పెడుతున్నా వదిలిపెట్టలేకపోతున్నారా? మనస్తత్వ శాస్త్రం చెప్పే కారణం ఇది -
నోరూరించే రొయ్యల కొబ్బరి గ్రేవీ.. రెస్టారెంట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా! -
యుక్త వయసులోనే వేధిస్తున్న తెల్ల జుట్టు సమస్య.. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంతే.! -
ముఖానికి విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడుతున్నారా?.. ఈ స్కిన్ టోన్ ఉన్నవారు జాగ్రత్త.! -
దేవుడు మీకు సంకేతాలు ఇస్తున్నాడా? ఈ సూచనలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు -
ప్రేమ పేరిట జైలు జీవితం గడుపుతున్నారా? మీ భాగస్వామిలో ఈ లక్షణాలు ఉంటే అది విషపూరిత బంధమే! -
కొబ్బరి చేపల పులుసు ఇలా చేస్తే అద్భుతమైన రుచి..రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కోసం ఆ సీక్రెట్ రివీల్! -
జూన్ 1, 2026: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. కెరీర్లో తిరుగులేని విజయాలు మీ సొంతం! -
లో బీపీ ఉన్నప్పుడు ఉప్పు నీళ్లు తాగడం సరక్షితమేనా? సమ్మర్ లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం.. -
సోషల్ మీడియాలో రాజయోగం పేరుతో హడావుడి.. ఈ రాశుల వారికి నిజంగానే అదృష్టం ఉందా?
Winter Health: చలికాలంలో ఈ పండు తింటే, దేవతల అమృతం తిన్నట్టే.. రోగాలన్నీ పరార్!
చలికాలంలో సాధారణంగానే ఎక్కువగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే చలికాలంలో రోగ నిరోధక శక్తి వేగంగా తగ్గిపోతుంటుంది. పైగా అలవాటు లేని చల్లని వాతావరణంలో ఉండడంతో రోగాలు ఎక్కువగా వస్తుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతుంటాము. రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి.
అయితే చలికాలంలో బొప్పాయి తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఇది తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అలాగే ఈ బొప్పాయి తినడం వల్ల నీరసం తగ్గిపోతుంది. జీర్ణక్రియ కూడా మెరుగ్గా పని చేస్తుంది. అసలు చలికాలంలో బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి బలపడుతుంది
బొప్పాయి పండులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల చలికాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. అలాగే ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా మీ దరికి చేరవు.
జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది
బొప్పాయి పండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పని చేస్తుంది. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. బొప్పాయిలో పపైన్ ఎంజైమ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తిన్న ఆహరం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడతాయి. అలాగే మలబద్దకాన్ని నివారిస్తాయి.
బరువును నియంత్రిస్తుంది
ఈ పండులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అలాగే చాలా తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. దీని కారణంగా దీనిని తినడం వల్ల త్వరగా జీర్ణం కావడంతో పాటు, తిన్న ఆహరం కూడా తక్షణమే జీర్ణమై శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. తద్వారా ఎక్కువ ఆహరం తినకుండా ఉండొచ్చు. ఫలితంగా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
చర్మం తేమగా ఉండడం
సాధారణంగా చలికాలంలో నీరు తక్కువగా తాగుతుంటారు. దీని కారణంగా చర్మం వెంటనే పొడిబారుతుంది. అలాంటి సందర్భాల్లో బొప్పాయి పండు తినడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే బొప్పాయి తినడం వల్ల చర్మం తేమగా, ఆరోగ్యంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యం కోసం
బొప్పాయిలో యాంటీ యాక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే గుండె జబ్బులు తగ్గిపోతాయి.
షుగర్ ఉన్న వారికి అమృతం
షుగర్ పేషంట్స్‌కు అమృతం
బొప్పాయిలో చాలా తక్కువ స్థాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీనిని తినడం వల్ల రక్తంలో ఇన్సులిన్ పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో షుగర్ కూడా నియంత్రలో ఉంటుంది. అందుకే షుగర్ పేషెంట్లు ఈ పండును రోజూ తినొచ్చు. మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications