Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
నార్మల్ టీకి బదులు ఈ టీ తాగితే గుండె సమస్యలు రావు.. ఎలా తయారు చేసుకోవాలంటే?
సీజన్‌తో సంబంధం లేకుండా దానిమ్మపండు విరివిగా దొరుకుతూ ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ దానిమ్మ పండును తింటే గుండెకు మేలు జరగడంతో పాటు క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. కేవలం దానిమ్మపండు తినడమే కాదు, ఆ పండు తొక్కతో టీ చేసుకొని తాగితే చాలా లాభాలున్నాయట. ఆ టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఆ టీని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా దానిమ్మ టీతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..
దానిమ్మ పండుతో పాటు దానిమ్మ తొక్కలో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. దానిమ్మ తొక్కలతో చేసే టీతో చాలా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్‌లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించి, క్యాన్సర్‌పై పోరాడేలా చేస్తుంది.

జీర్ణ సమస్యలు దూరం..
ఈ దానిమ్మ తొక్కల టీలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి సాధారణ మనిషికి ఉండే జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. మలబద్దకాన్ని నివారిస్తుంది. వికారం, వాంతులు, కడుపునొప్పి వంటి ఇతర సమస్యలు కూడా ఈ టీ తాగితే దూరం అవుతాయి. మళ్ళీ అలాంటి సమస్యలు రాకుండా చెక్ పెట్టేయొచ్చు. తరచుగా ఈ దానిమ్మ తొక్కల టీ తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు మళ్ళీ రమ్మన్నా రావు.
ఈ దానిమ్మ తొక్కలో ఫైబర్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ తొక్కలతో చేసిన టీ తాగితే తిన్న ఆహరం తొందరగా జీర్ణం అవడంతో పాటు గ్యాస్, అసిడిటీ, అజీర్తి వాంతి సమస్యలు దూరం అవుతాయి. ఆకలి నివారించి బరువు తగ్గేందుకు కూడా ఈ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
గుండెకు చాలా మంచిది..
దానిమ్మ తొక్కలతో చేసిన టీలో యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొవ్వుతో పాటు రక్తంలోని షుగర్ శాతాన్ని తగ్గిస్తాయి. తద్వారా గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. గుండెపోటు, గుండెలో రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యల బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది.
షుగర్ ఉన్న వారికీ చాలా మంచిది..
దానిమ్మ తొక్కలతో చేసిన టీ తాగితే షుగర్ ఉన్న వారు తాగితే చాలా మంచి ప్రయోజనాలు పొందొచ్చు. ఈ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొవ్వును, షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి. ఇవి మన బాడీ బరువును తగ్గిస్తాయి. అందుకే షుగర్ ఉన్న వ్యక్తులు ఈ దానిమ్మ తొక్కలతో చేసిన టీ తాగితే మంచి ఫలితాలను పొందొచ్చు.
ఎలా తయారు చేసుకోవాలంటే?
ఈ దానిమ్మ తొక్కల టీని తయారు చేసుకోవడం చాలా సులభం. ఇందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పది గ్రాముల దానిమ్మ తొక్కల పొడిని వేసుకోవాలి. అనంతరం వాటిలో ఒక కప్పు నీరు పోసుకొని, అయిదు నిమిషాల నుంచి పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. అనంతరం ఆ టీని వడగట్టుకొని కప్పులో వేసుకొని తాగితే సరిపోతుంది. ఈ టీని రెండేళ్లలోపు ఉన్న చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, కడుపులో అల్సర్ ఉన్న వ్యక్తులు, దానిమ్మ పండుతో అలర్జీ ఉన్న వారు.. ఈ టీ తాగకపోతే మంచిది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. వీటిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications