Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీరు శాఖాహారులా..? ఐతే ఈ కూరగాయల్లో ఎక్కవ ప్రొటీన్ వుంటుంది..!
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్లు చాలా అవసరం. ప్రొటీన్లు లేకపోతే శరీరం ఎదుగుదల ఆగిపోతుంది. ప్రొటీన్ల కోసం మాంసం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. శాఖాహారులు మాంసం తినకపోవడం వల్ల ప్రొటీన్ తీసుకోవాలంటే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏ కూరగాయల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయ్.. ఏ పళ్ల ద్వారా ప్రొటీన్లు అందుతాయనే విషయంపైన స్పష్టత ఉండదు. ఆ సమస్యను పరిష్కరించడానికి, ముఖ్యంగా శాఖాహారులకు సహాయకారంగా ఉండటానికి శాఖాహారానికి సంబంధించిన ప్రొటీన్ కంటెంట్ ఉన్న వాటి సమాచారాన్ని మీకు అందిస్తున్నాము.
బచ్చలికూర
బచ్చలి కూరలో ప్రొటీన్ శాతం ఎక్కువగా వుంటుంది. వీటిని కూరలుగా వండుకొని రైస్‌తో కలిపి తినవచ్చు. ఇందులో ప్రొటీన్లు మాత్రమే కాకుండా వైటమిన్ ఏ, వైటమిన్ సి కూడా ఉంటాయ్. బచ్చలి కూర కంటిచూపుకు కూడా చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. బచ్చలి కూరను తినేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. మార్కెట్లో కూడా తక్కువగానే అమ్ముతుంటారు.

మొలకెత్తిన పెసర్లు
పెసర్లు నానబెట్టుకొని వాటిని బట్టలో చుట్టి పెడితే మొలకలు వస్తాయ్. వీటిని పరిగడపున తినడం వల్ల ప్రొటీన్లు సంమృద్ధిగా అందుతాయ్. మాంసం గుడ్లు తిన్నంత శక్తి ఈ మొలకెత్తిన పెసర్లలో ఉంటుంది. తిన్న కొన్ని గంటల్లోనే చురుకుదనం వచ్చేస్తుంది. తక్కవగా తిని ఎక్కువ పోషకాలను వీటి ద్వారా అందుకోవచ్చు.
స్వీట్ కార్న్
రోడ్లపై తోపుడు బళ్లపై అమ్మే స్వీట్ కార్న్‌లో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా వుంటుంది. ఈ స్వీట్ కార్న్‌ను బయట కొని తినకుండా, పచ్చివాటిని కొని వాటిని ఇంట్లోనే ఉడకబెట్టుకొని తినాలి. రుచికోసం చెక్కర లేదా ఉప్పును వేసుకోవచ్చు. స్వీట్ కార్న్‌తో టైం పాస్ మాత్రమే కాదు శరీరానికి చాలా ప్రొటీన్ అందుతుంది.
బ్రోకలీ
బ్రోకలీలో కూడా ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయ్. కొన్ని కూరగాయలు మార్కెట్లో దొరకడం చాలా కష్టం. వాటిల్లో పోషకాలు ఎక్కువగా ఉన్నా కూడా డిమాండ్ తక్కువగా ఉండడం వల్ల లభించవు. అయినా గానీ బ్రోకలీని కొనుక్కొని వండుకొని తినాలి. వీటిలో కొవ్వ పదార్ధం కూడా తక్కువగా ఉంటుంది. ప్రొటీన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయ్. కాబట్టి బ్రెకలీని వారంలో కనీసం ఒకటి రెండు సార్లు తినడానికి అలవాటు చేసుకోవాలి.
గ్రీన్ పీస్
పచ్చ బఠానీలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ప్రొటీన్లతో పాటు ఇతర పోషకాలు మెండుగా వుంటాయ్. మెగ్నీషియం, ఐరన్, జింక్, ఫోలేట్, ఫాస్పరస్, కాపర్ పోషకాలు పుష్కలంగా వుంటాయ్. ఈ బఠానీలను కూరగా వండుకోవచ్చు లేదా అలాగే ఉడకబెట్టుకొని తినవచ్చు. భోజనం తరువాతో లేక మీ ఖాలీ సమయాల్లో జేబులో వేసుకొనైనా ఈ బఠానీలను రోజూ కొన్ని తిని మీ శరీరంలో జరిగే ఆరోగ్యకరమైన మార్పులను చూడండి.
క్యాలీఫ్లవర్
క్యాలీఫ్లవర్‌లో కూడా ప్రొటీన్లు సంమృద్ధిగా ఉంటాయ్. వీటితో చేసిన కూరలు చాలా రుచిగా ఉంటాయ్. కూరలా తినడం ఇష్టం లేకపోతే అప్పడప్పుడూ పకోడీలుగా చేసుకొని తినండి. శాఖాహారులకు మంచి ప్రొటీన్ ఇచ్చే కూరగాయల్లో క్యాలీఫ్లవర్‌ను అస్సలు మిస్ కావద్దు.
గుడ్లు శాఖాహారమే
గుడ్లలో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా వుంటుంది. గుడ్డు లోపల వుండు పచ్చని పదార్ధంలో కొంత ప్రొటీన్‌తో పాటు కొవ్వు పదార్ధం కూడా వుంటుంది. మీరు రోజూ వ్యయామం చేసే వారైతే రోజుకు రెండు నుంచి మూడు గుడ్లు తింటే మంచి ప్రొటీన్ అందుతుంది. వ్యయామం చేయకపోతే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. కాబట్టి కొవ్వు తక్కువగా వుండి ప్రొటీన్లు కూడా బాగా అందే పై కూరగాయలను తినండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications