Latest Updates
-
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
Life Secret: 100 ఏళ్లు బతకాలంటే అదొక్కటి చాలు..ఫుడ్,నిద్ర,ఒత్తిడి ఇవేవీ కాదు..101 ఏళ్ల డాక్టర్ చెప్పిన రహస్యం
ఈ భూమ్మీద పుట్టిన ఏ మనిషికి అయినా 100 ఏళ్లు ఖచ్చితంగా బతకాలని ఉంటుంది. అది కూడా ఎలాంటి అనారోగ్యాలు లేకుండా నూరేళ్లు హాయిగా జీవించాలని కలలు కంటుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి 75 ఏళ్లు బతకడమే మహా గొప్ప అన్నట్లు అయిపోయిందని తరుచూ చాలామంది అంటుంటారు. అయితే 100 ఏళ్లు బతకాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తినాలని, ఒత్తిడిని తగ్గించుకోవాలని, మంచి నిద్ర ఉండాలని తరుచుగా నిపుణులు చెబుతుంటారు. అయితే నిజంగా వీటి వల్లే మనిషి ఎక్కువ కాలం జీవిస్తాడా?
ఆరోగ్యకరమైన ఆాహారం, తక్కువ ఒత్తిడి, తగినంత నిద్ర వంటి వాటిని దీర్ఘాయువుకి ముఖ్యమైనవిగా పరిగణించరని..100 ఏళ్లు బతకాలంటే కావాల్సిందే ఒకే ఒక్కటి అని..అదే చురుకుదనం లేదా యాక్టివ్ గా ఉంటం అని అమెరికాకు చెందిన 101 ఏళ్ల డాక్టర్ జాన్ షార్ఫెన్ బర్గ్ చెబుతున్నారు. యూట్యూబ్ స్టార్ కూడా అయిన షార్ఫెన్ బర్గ్.. 101 ఏళ్ల వయస్సులో కూడా తాను ఆరోగ్యంగా,ఉండటానికి గల కారణాలు వంటి,తన సుదీర్ఘ జీవితానుభవం నుంచి గ్రహంచిన విషయాలను,తాను స్వయంగా అనుసరించే హెల్దీ లైఫ్ స్టైయిల్ టిప్స్ ని ప్రజలతో పంచుకుంటారు. సరళమైన జీవనశైలి మార్పులతో ఎక్కువ కాలం జీవించడం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తుంటాడు.

డాక్టర్ జాన్ షార్ఫెన్ బర్గ్ ప్రకారం దీర్ఘాయువు నిజమైన రహస్యం వ్యాయామమే. శరీరం అలసిపోయేలా ఏదో ఒక శారీరక శ్రమ చేయాలని..ఎక్సర్ సైజ్ మినహా మిగిలిన ఆరోగ్య సూత్రాలన్నీ తక్కువ ప్రాముఖ్యత కలిగినవేనని ఆయన తేల్చి చెప్పారు. అయితే వ్యాయమం అంటే జిమ్ కు వెళ్లి గంటలు గంటు గడపనక్కర్లేదు. ప్రతి రోజూ వాకింగ్, రన్నింగ్, పుషప్స్, జాగింగ్ వంటివి చేస్తూ మీ శరీరాన్ని చలనంలో ఉంచాలి. ఊబకాయంతో బాధపడుతూ కూడా రోజూ వ్యాయమం చేసే వ్యక్తి..సన్నగా ఉండి వ్యాయామం చేయని వ్యక్తి కంటే ఎక్కువ కాలం జీవిస్తాడని డాక్టర్ షార్ఫెన్ బర్గ్ చెబుతున్నారు.
ఒక వ్యక్తికి అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, సిగరెట్లు తాగే అలవాటు ఉన్నప్పటికీ అతను రోజూ వ్యాయమం చేస్తే..ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండి వ్యాయామం చేయని వ్యక్తి కంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందట. ఒక వ్యక్తికి ఎలాంటి ఆరోగ్యసమస్యలు లేకున్నా అతను శారీరకంగా చురుకుగా లేకుంటే అతని జీవితకాలం ఎక్కువ ఉండకపోవచ్చని ఆయన తెలిపారు.
వాస్తవానికి ఈ రోజుల్లో చాలామంది తమ రోజులో ఎక్కువ భాగం కుర్చీలు,సోఫాలకే అతుక్కుపోతున్నారు. ఫలితంగా శారీరక శ్రమ తగ్గిపోయి అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నారు. అయితే డాక్టర్ జాన్ షార్ఫెన్ బర్గ్ మాటలు ఒక హెచ్చరికలాంటివిగా భావించాలి. మనం శరీరానికి తగినంత శ్రమ ఇవ్వకుంటే దీర్ఘాయువు అనేది ఒక కలగానే మిగిలిపోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications