Latest Updates
-
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
రోజూ తింటే 10 ఏళ్లు చిన్నవారిగా కనిపించే 5 ఫుడ్ ఐటమ్స్ ఇవే!
ఏజ్ పెరుగుతున్నా శరీరం, మొఖం మాత్రం యవ్వనంగా,కాంతివంతంగా ఉండాలని కోరుకోని వారు ఎవరుంటారు? ఇందుకోసం చాలామంది ఖరీదైన క్రీములు, లోషన్లు వాడుతుంటారు.అయితే బాహ్య సౌందర్యం కంటే అంతర్గత ఆరోగ్యం ముఖ్యం. మనం తీసుకునే ఆహారమే మన చర్మ సౌందర్యాన్ని నిర్ణయిస్తుంది.
మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే 10 ఏళ్లు చిన్నవారిగా కనిపించడం సాధ్యమేనని తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సన్ రైజ్ చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ గౌతమ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో తెలిపారు. చర్మ సౌందర్యాన్ని పెంచే 5 అద్భుతమైన ఆహార పదార్థాలను ఆయన సూచించారు. అవేంటో ఇక్కడ చూడండి.

ఉసిరికాయ
ఆయుర్వేదంలో ఉసిరికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా చర్మం సాగకుండా గట్టిగా ఉంటుంది. ముఖంపై ముడతలు రాకుండా కాపాడుతుంది. రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు దరిచేరవు.
బాదం
బాదంలో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి ఒక మంచి ఆహారంలా పనిచేస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచడమే కాకుండా సూర్యరశ్మి వల్ల కలిగే నష్టం నుండి కాపాడుతుంది. రోజూ నానబెట్టిన బాదం తినడం వల్ల చర్మానికి నేచురల్ గ్లో వస్తుంది.
పాలకూర
ఆకుకూరల్లో రారాజు పాలకూర. దీనిలో ఐరన్, ఫోలేట్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మానికి సరిపడా ఆక్సిజన్ అందడం వల్ల ముఖం కళకళలాడుతూ కనిపిస్తుంది.
బ్లూ బెర్రీ
వీటిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వాతావరణ కాలుష్యం, ఒత్తిడి వల్ల చర్మ కణాలకు జరిగే నష్టాన్ని అరికడతాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
దానిమ్మ
దానిమ్మ పండులో విటమిన్ C తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, చర్మంపై ఉండే మచ్చలను తగ్గించి, చర్మాన్ని ఆరోగ్యంగా, ఎర్రగా నిగనిగలాడేలా చేస్తాయి.
డాక్టర్ సలహా
ఈ 5 ఆహార పదార్థాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, ఇవన్నీ రోజూ తినడం కష్టమనిపించవచ్చు. అందుకే డాక్టర్ గౌతమ్ గారు ఒక సులభమైన సూచన చేశారు. ఈ ఐదింటిలో ఏవైనా రెండు ఆహార పదార్థాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే సరిపోతుంది అని ఆయన తన వీడియోలో పేర్కొన్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications