Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
Fat Burn Vegetables: పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా? ఈ కూరగాయలను తినండి చాలు
అధిక బరువుతో బాధపడుతున్నారా? పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోకుండా కేవలం కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా అద్భుతాలు జరుగుతాయని ఆశించడం సరికాదు. తీపి పదార్థాలు, వేయించినవి ఎక్కువగా తినడం, మద్యం సేవించడం, గంటల తరబడి కూర్చోవడం వంటి అలవాట్లను మార్చుకోకపోతే మీ శరీరంలోని అదనపు కొవ్వును తొలగించలేరు.
అయితే కొన్నిసార్లు ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నప్పటికీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడం కష్టమవుతుంది. అలాంటి సందర్భాలలో కొన్ని కూరగాయలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. వాటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడంలో కూడా తోడ్పడతాయి.

పొట్ట కొవ్వును తగ్గించే అద్భుతమైన కూరగాయలు
ఆకుకూరలు
ఆకుకూరలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి..కానీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును నిండుగా ఉంచి తక్కువ ఆహారం తినేలా చేస్తుంది. పాలకూర, మెంతి కూర వంటి ఆకుకూరలలో విటమిన్ A, C, K వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది.

క్రూసిఫెరస్ కూరగాయలు
బ్రోకలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రస్సెల్స్ మొలకలు వంటి క్రూసిఫెరస్ కూరగాయలు ఫైబర్, నీటి శాతం అధికంగా ఉంటాయి. ఇవి మీ కడుపును నింపి, జీవక్రియను వేగవంతం చేస్తాయి. మెరుగైన జీవక్రియ బరువు తగ్గడానికి చాలా కీలకం. ఈ కూరగాయలు శరీరంలోని చెడు కొవ్వును కరిగించి మంచి కొవ్వును పెంచడానికి కూడా సహాయపడతాయి.
అధిక నీటి శాతం ఉన్న కూరగాయలు
పొట్లకాయ, దోసకాయ, సొరకాయ, బీరకాయ, చిక్కుడుకాయ వంటి కూరగాయలలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిలో కేలరీలు అతి తక్కువగా ఉంటాయి. మీరు ఈ కూరగాయలను మీ రోజువారీ ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే మీ కడుపు నిండుగా ఉన్నప్పటికీ అదనపు కేలరీలు చేరవు. ఇది బరువు తగ్గడానికి చాలా సమర్థవంతమైన మార్గం. ముఖ్యంగా వేసవిలో శరీరానికి కావాల్సిన నీటిని అందించి డీహైడ్రేషన్ బారి నుండి కాపాడుతాయి.

క్యాప్సికమ్
క్యాప్సికమ్‌లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ C, క్యాప్సైసిన్ వంటి పోషకాలు ఉంటాయి. క్యాప్సైసిన్ శరీరంలోని జీవక్రియ రేటును పెంచుతుంది. ఫలితంగా శరీరం కొవ్వును మరింత సమర్థవంతంగా కరిగిస్తుంది..తద్వారా బరువు తగ్గడం సులభం అవుతుంది. క్యాప్సికమ్ ను సలాడ్ లు, కూరలు, సూప్ లలో ఉపయోగించవచ్చు.
పుట్టగొడుగులు
పుట్టగొడుగులలో కూడా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి ప్రొటీన్, ఫైబర్లకు అద్భుతమైన సోర్స్ . మాంసానికి బదులుగా పుట్టగొడుగులను తీసుకుంటే ఇవి మీ కడుపును నిండుగా ఉంచుతాయి, బరువు పెరగకుండా సహాయపడతాయి. పుట్టగొడుగులు జీర్ణక్రియను మెరుగుపరచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
