Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీ వీర్యం ఆరోగ్యంగా ఉందా? పురుషులు ఖచ్చితంగా గమనించాల్సిన సంకేతాలు!
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం కెరీర్, డబ్బు, కుటుంబ బాధ్యతలు అంటూ నిత్యం ఒత్తిడితో గడుపుతూ, మన ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాం. చివరకు ఏదో ఒక పెద్ద ఆరోగ్య సమస్య తలుపు తట్టినప్పుడు గానీ మనకు ఆరోగ్యం విలువ తెలియడం లేదు. ముఖ్యంగా నేటి ఆధునిక జీవనశైలి పురుషుల ఆరోగ్యంపై, అందులోనూ వారి పునరుత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్స్ తినడం, గంటల తరబడి ఒకే చోట కూర్చుని చేసే ఉద్యోగాలు, విపరీతమైన పని ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం, దీనికి తోడు ధూమపానం, మద్యపానం.. ఇవన్నీ కలిసి పురుషుల ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్నాయి. గత 40 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పురుషుల స్పెర్మ్ కౌంట్ ఏకంగా 50 శాతానికి పైగా పడిపోయింది అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం చాలామంది దంపతులు పిల్లలు కలగక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇందులో ఒకవైపు స్త్రీలు PCOD, PCOS వంటి సమస్యలతో బాధపడుతుంటే, మరోవైపు పురుషులు నాణ్యత లేని వీర్యం లేదా తక్కువ స్పెర్మ్ కౌంట్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి మీ వీర్యం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? శరీరం మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని గమనిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు.
ప్రతి పురుషుడు గమనించాల్సిన 5 హెచ్చరిక సంకేతాలు
వీర్యం రంగులో మార్పు
సాధారణంగా వీర్యం రంగులో మార్పు వస్తే తేలికగా తీసుకోకండి. వీర్యం పసుపు రంగులో ఉంటే మీకు కామెర్లు ఉండే అవకాశం ఉంది లేదా మీరు ఆల్కహాల్, సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటున్నారని అర్థం. ఒకవేళ ఆకుపచ్చ-పసుపు రంగులో కనిపిస్తే అది ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు సంకేతం కావచ్చు.
వీర్యంలో రక్తం
మీ వీర్యంలో రక్తం చుక్కలు కనిపిస్తే అది క్లామిడియా వంటి లైంగిక సంక్రమణ వ్యాధులు లేదా తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కు సంకేతం కావచ్చు. ప్రోస్టేట్ సమస్యలు లేదా మూత్రనాళానికి గాయాలైనప్పుడు కూడా ఇలా జరుగుతుంది.
వృషణాల వాపు లేదా నొప్పి
పురుషులు తమ వృషణాల్లో అసాధారణమైన నొప్పిని లేదా వాపును గమనిస్తే సిగ్గుపడి దాచిపెట్టకూడదు. ఇది ఎపిడిడైమిటిస్, హైడ్రోసెల్ లేదా ఇతర తీవ్రమైన ఇన్ ఫెక్షన్లకు దారితీయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే శాశ్వత సమస్యలు వస్తాయి.
తక్కువ మోతాదులో స్కలనం
వీర్యం చాలా తక్కువ పరిమాణంలో వస్తుంటే వీర్యం ప్రయాణించే నాళాల్లో అడ్డంకులు ఉన్నాయని అనుమానించాలి. దీనివల్ల వీర్య కణాలు గర్భాశయం వరకు చేరుకోలేవు, ఫలితంగా పిల్లలు కలగడం కష్టమవుతుంది.
నీళ్లలా ఉండే వీర్యం
ఆరోగ్యకరమైన వీర్యం కాస్త చిక్కగా ఉంటుంది. కానీ మీ వీర్యం మరీ నీళ్లలా పలచగా ఉంటే, అందులో స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇది సంతానోత్పత్తి సామర్థ్యాన్ని నేరుగా దెబ్బతీస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications