Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
గుడ్లను కడిగి వండుతున్నారా? లేదంటే ప్రమాదమే! నిపుణుల హెచ్చరిక
గుడ్డు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని డాక్టర్లు, పెద్దలు, నిపుణులు తరచూ చెబుతుంటారు. రోజుకి ఒక గుడ్డు అయినా తినాలని సూచిస్తుంటారు. అయితే గుడ్లు వండేటప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. అసలు గుడ్లను కడిగి వండాలా? లేక నేరుగా పగలగొట్టి వాడేయాలా?
చాలా మందికి ఈ విషయంలో స్పష్టత లేక, మార్కెట్ నుంచి తెచ్చిన గుడ్లను నేరుగా పెనం మీద వేసేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గుడ్డు పెంకుపై దాగి ఉన్న అసలు ప్రమాదం
మనం తినే గుడ్లు ఎక్కడి నుండి వస్తాయి? కోడి శరీరం నుండే కదా. గుడ్డు బయటకు వచ్చే మార్గంలోనే కోడి విసర్జక పదార్థాలు కూడా బయటకు వస్తాయి. అందుకే సహజంగానే గుడ్డు పెంకుపై పక్షి ఈకలు, ఎండిన రెట్టలు, దుమ్ము, ధూళి అంటుకుని ఉండటం చాలా సాధారణం.
కేవలం కంటికి కనిపించే మురికి మాత్రమే కాదు కంటికి కనిపించని ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా గుడ్డు పెంకుపై తిష్ట వేసి ఉంటుంది. ముఖ్యంగా సాల్మొనెల్లా, కాంపిలోబాక్టర్ వంటి హానికరమైన బ్యాక్టీరియాలు గుడ్డు పెంకుపై ఉంటాయి. రవాణా సమయంలో లేదా అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచడం వల్ల ఈ బ్యాక్టీరియా మరింత పెరిగే అవకాశం ఉంది.
వంటకు ముందు ఎందుకు కడగాలి?
గుడ్డు పెంకు గట్టిగా ఉంటుంది కదా లోపలికి బ్యాక్టీరియా ఎలా వెళ్తుంది? అని మీకు సందేహం రావచ్చు. కానీ వాస్తవానికి గుడ్డు పెంకు గట్టిగా ఉన్నప్పటికీ దాని ఉపరితలంపై కంటికి కనిపించని అతి చిన్న రంధ్రాలు ఉంటాయి.
మనం గుడ్డును కడగకుండా పగలగొట్టినప్పుడు పెంకుపై ఉన్న ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఆ పగుళ్ళ ద్వారా లేదా రంధ్రాల ద్వారా గుడ్డులోని సొన లేదా తెల్లసొనతో కలిసిపోతుంది. అలాగే ఆ గుడ్లను తాకిన మన చేతుల ద్వారా వంట పాత్రలకు కూడా వ్యాపిస్తుంది.
ఈ బ్యాక్టీరియా కడుపులోకి చేరితే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే వంట చేయడానికి ముందు గుడ్లను శుభ్రం చేయడం చాలా ముఖ్యం.
కడిగేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
గుడ్లను కడగమన్నారు కదా అని సబ్బు పెట్టి రుద్దకూడదు. వంట చేయడానికి ముందు గోరువెచ్చని నీటిలో లేదా సాదా నీటిలో సున్నితంగా కడగాలి. ఇలా చేయడం వల్ల పెంకుపై ఉండే సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా తొలగిపోతుంది. కడిగిన వెంటనే వంటలో ఉపయోగించాలి.
తడిగా ఉన్న గుడ్లను ఫ్రిజ్ లో నిల్వ చేయకూడదు, ఎందుకంటే తేమ బ్యాక్టీరియా పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి ఇకపై ఆమ్లెట్ వేసే ముందో, గుడ్డు ఉడకబెట్టే ముందో అవి ఎక్కడి నుండి వచ్చాయో గమనించి, ఒక్కసారి నీటితో శుభ్రం చేయడం మర్చిపోకండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications