Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Summer Dry Lips: వేసవిలో పెదాలు పొడిబారి పగులుతున్నాయా? ఈ చిట్కాలు మీకోసమే
వేసవి కాలంలో గాలిలోని తేమ పోయి పొడిగా మారుతుంది. పొడి గాలి వల్ల అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి. చర్మం పొడిబారి నిస్తేజంగా మారుతుంది. వేడి వాతావరణం అందమైన పెదవుల ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తుంది. వేసవి ప్రభావం సున్నితమైన పెదాలపై ఎక్కువగా ఉంటుంది. వేసవిలో పెదాలు పొడిబరి, పగిలి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.
ఎండాకాలంలో పెదాలను కాపాడుకునేందుకు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో పెదాలను మృదువుగా, ఆరోగ్యంగా ఉంచడానికి పలు మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హైడ్రేటెడ్ గా ఉండాలి:
పొడి పెదాలు బాధిస్తుంటే ముందుగా చేయాల్సిన అతి ముఖ్యమైన పని నీరు ఎక్కువగా తాగడం. రోజంతా పుష్కలంగా నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల పెదాలు పొడిబారకుండా, పగిలిపోకుండా ఉంటాయి. పుచ్చకాయ, దోసయా, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా కూడా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవచ్చు.
ఎస్.పి.ఎఫ్ ఉన్న లిప్ బామ్ వాడాలి:
వేసవిలో సూర్య కిరణాలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అతినీలలోహిత కిరణాలు చర్మంపై పడితే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. సూర్య కిరణాలు పెదాలపై పడినప్పుడు పెదాలు పొడిగా మారుతాయి. పగుళ్లు రావొచ్చు. అలాగే రంగు కూడా మారతాయి. సూర్య కిరణాల నుండి పెదాలను రక్షించుకోవడానికి ఎస్పీఎఫ్(సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్) ఉన్న లిప్ బామ్ ఉపయోగించడం ముఖ్యం. కనీసం ఎస్పీఎఫ్ 15 ఉన్న లిప్ బామ్ వాడటం మంచిది. ఈ లిప్ బామ్ ను రోజంతా అప్లై చేసుకోవాలి.
పెదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయాలి:
పెదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల చనిపోయిన చర్మ కణాలు తొలగిపోయి, కొత్త ఆరోగ్యకరమైన చర్మాన్ని వృద్ధి చెందుతాయి. చక్కెర, కొబ్బరి నూనెను మిక్స్ చేసి, పెదాలపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ మిశ్రమంలో పెదాలపై మర్దనా చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. తర్వాత మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. ఈ ఎక్స్‌ఫోలియేట్ వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
పెదాలను నాలుకతో తడి చేయవద్దు:
పెదాలు పొడిబారి పగిలిపోతే చాలా చికాకుగా ఉంటుంది. పెదాలు పగిలిన చాలా మంది నాలుకతో వాటిని తడి చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల పెదాలు మరింతగా పొడిబారిపోతాయి. లాలాజలంలో ఉండే ఎంజైమ్ లు పెదవులపై సున్నితమైన చర్మాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. దీని వల్ల మరింత పొడిగా మారి చికాకును కలిగిస్తుంది. పెదాలపై ఉపశమనం కలిగించడానికి హైడ్రేటింగ్ లిప్ బామ్‌ను ఉపయోగించడం మంచిది.
కొత్తవి వాడే ముందు పరీక్షించండి:
కొన్ని ఉత్పత్తులు, పదార్థాలు పెదవులను చికాకు పెడతాయి. పెదాలు పొడిబారడానికి, పగిలిపోవడానికి దారితీస్తాయి. ఆల్కహాల్, సువాసన లేదా మెంథాల్ కలిగి ఉన్న ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోవాలి. వీటి వల్ల పెదాలు మరింతగా పొడిబారతాయి.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications