Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇప్పుడు వున్న సంతానలేమి సమస్యలన్నీ జీన్స్ వల్లే..! జీన్స్ ఇంకా వేసుకుందామా..?
జీన్స్ ధరించడం వల్ల మగవారిలో స్పెర్మ్ కణాల నాణ్యత తగ్గుతుందా అనే దానిపై శాస్త్రీయ ఆధారాలు స్పష్టంగా లేవు. కొన్ని అధ్యయనాలు జీన్స్ ధరించడం వల్ల వృషణాల ఉష్ణోగ్రత పెరుగుతుందని, స్పెర్మ్ కణాల నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని సూచించాయి, మరికొన్ని అధ్యయనాలు ఈ సంబంధం లేదని కనుగొన్నాయి.
జీన్స్ ఫిట్‌గా వుంటే
చాలా బిగుతుగా ఉండే జీన్స్ వృషణాలను వేడి చేయవచ్చు, స్పెర్మ్ కణాల ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. జీన్స్ ఫిట్‌గా వుండకుండా జాగ్రత్త పడాలి. ఫార్మల్ ప్యాంట్లను ధరించాలి. ఒక వేల తప్పని పరిస్థితిలో జీన్స్ వేసుకోవాల్సి వస్తే లూజ్ జీన్స్‌లను మాత్రమే ధరించాలి.

జీన్స్ యొక్క పదార్థం
జీన్స్ తయారు చేసే పదార్ధాల వల్ల కూడా వేడిబాగా పెరుగుతుంది. శరీరంలో వుండే వీడిని లోపలే ఈ జీన్స్ బంధించివేస్తుంది. శరీంరంలోంచి వేడి బయటకు పోకుండా చేస్తుంది. కాబట్టి జీన్స్‌ను నియంత్రించాలి.
ఎండాకాలంలో మరింత ప్రమాదకరం
జీన్స్ వేడిని పెంచడం, అదే జీన్స్‌ను ఎండాకాలంలో ధరించడం వల్ల ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. స్పర్మ్ కౌంట్ తగ్గిపోయి సంతానలేమి సమస్యలు పెరిగే అవకాశం వుంది.
టైట్ జీన్స్
టైట్ జీన్స్ ధరించడం వల్ల నరాల పై ఒత్తిడి పెరగడమే కాకుండా రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరగదు. దీనిపై ప్రత్యేకంగా ఒక సర్వేను చేపట్టారు. జీన్స్ తరుచుగా వేసుకునే 1100ల మంది అమ్మాయిలపై ఒక సర్వేను చేపట్టారు. ఆ సర్వేలో 70 శాతం మందికి జీన్స్ వల్లే నడుము నొప్పి వచ్చిందని తేలింది.
చర్మ సంబంధిత సమస్యలు
జీన్స్ వేసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం వుంది. టైట్ జీన్స్ వల్ల గజ్జా, తామర వంటా వ్యాధులు కూడా వస్తున్నాయని అంటున్నారు.
జీర్ణ సమస్య
దాదాపు అన్ని జీన్సులు టైట్‌గానే వుంటాయ్. ఇలా కడుపు, నడుము దగ్గర జీన్స్ టైట్‌గా వుండడం వల్ల తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు కూడా దారితీస్తుందని అంటున్నారు.
పురుషుల్లోనే కాదు మహిళల్లో జీన్స్ వేసుకోవడం వల్ల గర్భాశయ సమస్యలు వచ్చే అవకాశం వుందని అంటున్నారు.

జీన్స్‌కు ప్రత్యామ్నాయంగా
సరైన ఫిట్‌తో సౌకర్యవంతమైన జీన్స్‌ను ఎంచుకోండి. స్పెర్మ్ ఉత్పత్తికి అనుకూలమైన వదులుగా ఉండే దుస్తులు ధరించండి. వేడి వాతావరణంలో జీన్స్‌ను ధరించడం నివారించాలి. వృషణాలను చల్లగా వుండడానికి స్క్రోటల్ సపోర్ట్‌ను ధిరంచాలి. పొగతాగే అలవాటు వున్నవారు మానుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేయాలి.
జీన్స్ వద్దన్నా కూడా ధరిస్తున్న యువత
జీన్స్ వేసుకోవద్దని యువతకు ఎన్ని సలహాలు ఇచ్చినప్పటికి కూడా జీన్స్‌ను అలాగే వేసుకుంటున్నారు. గతంలో ఎప్పడూ లేనంతగా పురుషుల్లో, స్త్రీల్లో సంతానలేమి సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఈ జీన్స్ అన్న విషయం తెలిసిందే. జీన్స్‌ను కేవలం ఫ్యాషన్‌గా మాత్రమే చూస్తున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నా సరే చాలా మంది యువతులు తమకు జీన్సే కంఫర్ట్‌గా వుంటోందని బల్ల గుద్ది చెబుతున్నారు. దీంతో నిపుణులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురౌతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications