Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
ఎంత బరువు ఉంటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా? మీ ఏజ్ ప్రకారం ఎంత వెయిట్ ఉండాలో చూడండి
ప్రస్తుతం చాలామంది ఆరోగ్యంపై ఎక్కవగా శ్రద్ద పెడుతున్నారు. ఈ క్రమంలో తమ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే శరీరానికి సరైన బరువు ఎంతో అవసరం. అయితే చాలామంది తమ బరువు గురించి ఆందోళన చెందుతుంటారు. కొందరేమో బక్కగా ఉన్నామంటూ దిగులు పడితే, మరికొందరేమో లావెక్కుతున్నామంటూ తెగ బాధపడిపోతుంటారు. సరైన బరువు మెయింటెయిన్ చేస్తే చాలా సీరియస్ రోగాలు వచ్చే ఛాన్స్ చాలా వరకు తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
మీ బరువు అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువగా ఉంటే అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ ఏజ్,హైట్ ప్రకారం మీ బరువు ఎంత ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ వయస్సుకి, మీ ఎత్తుకి తగ్గట్టుగా సరైన బరువు ఎంత ఉండాలో ఇప్పుడు చూద్దాం.

ఏ వయస్సు మహిళలు ఎంత బరువు ఉండాలి
12-14 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు 32-36 కిలోల మధ్యలో ఉండాలి.
15-20 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు 45-50 కిలోల మధ్యలో ఉండాలి.
21-30 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు 50-60 కిలోల మధ్యలో ఉండాలి.
31-40 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు 60-65 కిలోల మధ్యలో ఉండాలి.
41-60 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు 59-63 కిలోల మధ్యలో ఉండాలి.
ఏ వయస్సు పురుషులు ఎంత బరువు ఉండాలి
12-14 ఏళ్ల వయస్సు ఉన్న పురుషులు 32-38 కిలోల మధ్యలో ఉండాలి.
15-20 ఏళ్ల వయస్సు ఉన్న పురుషులు 40-50 కిలోల మధ్యలో ఉండాలి.
21-30 ఏళ్ల వయస్సు ఉన్న పురుషులు 60-70 కిలోల మధ్యలో ఉండాలి.
31-40 ఏళ్ల వయస్సు ఉన్న పురుషులు 59-75 కిలోల మధ్యలో ఉండాలి.
41-60 ఏళ్ల వయస్సు ఉన్న పురుషులు 58-7 కిలోల మధ్యలో ఉండాలి.
60 ఏళ్లు పైబడిన పురుషులు 55-68 కిలోల మధ్యలో ఉండాలి.
BMI (బాడీ మాస్ ఇండెక్స్) అంటే ఏంటి?
బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనేది మీ ఎత్తుకు మీ బరువు సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రామాణిక కొలమానం. దీనిని మీ బరువును మీ ఎత్తు యొక్క వర్గంతో భాగించడం ద్వారా లెక్కిస్తారు.
BMI ఆధారంగా బరువు
18.5 కంటే తక్కువ - తక్కువ బరువు (అండర్ వెయిట్)
18.5-24.9 - సాధారణ బరువు (ఆరోగ్యకరమైన శరీరం)
25.0-29.9 - ఎక్కువ బరువు (ఓవర్ వెయిట్)
30 కంటే ఎక్కువ - ఊబకాయం
మీ BMI 18.5 కంటే తక్కువగా ఉంటే, బలహీనత, రక్తహీనత, ఎముక సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అదే సమయంలో మీ BMI 25 కంటే ఎక్కువగా ఉంటే మీకు గుండె జబ్బులు, డయాబెటిస్, అధిక రక్తపోటు, కీళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
BMI అందరికీ తగినదేనా?
మీరు అథ్లెట్ లేదా గర్భిణీ స్త్రీ అయితే BMI మీ శరీర సరైన స్థితిని పూర్తిగా తెలియజేకపోవచ్చు. అప్పుడు డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేయడానికి ఏం చేయాలి?
సమతుల్య ఆహారం తీసుకోండి..ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి..ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి.
హైడ్రేటెడ్‌గా ఉండండి..ఇందుకోసం తగినంత నీరు త్రాగాలి.
తగినంత నిద్రపోండి..మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











