Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
అధిక బరువు ఉన్న పురుషులు జాగ్రత్త! పెరుగుతున్న కొద్దీ అది తగ్గుతుందంటున్న వైద్యులు
ఈ మధ్యకాలంలో చాలా మంది పురుషులు సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది స్మెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, నాణ్యమైన స్పెర్మ్ లేకపోవడం వల్ల పిల్లలు కనలేకపోతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా తర్వాత పురుషుల్లో ఊబకాయం సమస్య గణనీయంగా పెరిగినట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ రెండింటికి మధ్య సంబంధం ఉందని అంటున్నాయి అధ్యయనాలు.
బరువు పెరిగేకొద్దీ పురుషుల్లో స్పెర్మ్ కౌంట తగ్గిపోతున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. వీర్య కణాల సంఖ్య తగ్గడంతో పాటు వాటి నాణ్యత కూడా తగ్గుతున్నట్లు వెల్లడైంది.

ఊబకాయం సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది
శరీరంలో కొవ్వు అధికంగా, అసాధారణంగా పేరుకుపోయినప్పుడు ఊబకాయం ఏర్పడుతుంది. ఇది ఆరోగ్యాన్ని జీవన కాలపు అంచనాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అనేక రకాల వ్యాధులకు కారణం అవుతుంది. అధిక కేలరీల ఆహారాలు, తక్కువ ఫైబర్ కలిగిన జంక్ ఫుడ్స్ మొదలైన వాటి వినియోగం, వ్యాయామం చేయకపోవడం, కదలిక లేని జీవన శైలి అలవాట్లతో ఊబకాయం విపరీతంగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబతున్నాయి. ఊబకాయం పరంగా ప్రపంచంలోని మొదటి 5 దేశాల్లో భారతదేశం ఒకటి.
శరీరంలో కొవ్వు పరిమాణం పెరిగే కొద్దీ ఆడ హార్మోన్ అయిన ఈస్ట్రోజెన్ స్థాయి కూడా పెరుగుతుంది. పారిస్ లోని పర్ హాస్పిటల్ 2012లో జరిపిన ఒక అధ్యయనంలో సాధారణ సంతానోత్పత్తి ఉన్న 10 వేల మంది పురుషుల్లో 24 శాతం మంది మాత్రమే తక్కువ స్పెర్మ్ కౌంట్ ను కలిగి ఉన్నారని తేలింది. అలాగే, ఈ పురుషులలో 2.6% మందికి స్పెర్మ్ ఉనికి లేదని పరిశోధకులు గుర్తించార. ఊబకాయం ఉన్న పురుషుల్లో 32.4 శాతం తక్కువ స్మెర్మ్ కౌంట్, 6.9 పురుషుల్లో వీర్యకణాలు లేకపోవడం తేలింది.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఊబకాయానికి వంధ్యత్వానికి మధ్య సంబంధం ఉంది. ఎందుకంటే కొవ్వు కణాలు టెస్టోస్టెరాన్ వంటి మగ హార్మోన్లను ఆడ హార్మోన్ ఈస్ట్రోజెన్‌గా మారుస్తాయి. అందువల్ల, కొవ్వు కణాలు పెరిగేకొద్దీ పురుషులలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి.
అధిక కొవ్వు ప్రైవేట్ భాగాలను వేడి చేస్తుంది
ఊబకాయం ఉన్న వారి శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ప్రైవేట్ పార్ట్స్ లలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తిని, సంఖ్యను, నాణ్యతను గణనీయంగా ప్రబావితం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఊబకాయం కూడా స్క్రోటమ్ కు కారణం అవుతుంది. ఊబకాయం వల్ల వచ్చే అధిక రక్తపోటు కూడా వృషణఆలకు రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. ఇది వృషణాల వాపుకు కారణం అవుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, కెఫిన్ వినియోగాన్ని తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలను తినడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications