For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

DRDO Drug 2-DG: కోవిద్-19 కట్టడికి కొత్త మందు వచ్చేసింది.. దీన్ని ఎలా వాడాలంటే...

కోవిద్-19 కట్టడికి కొత్త టాబ్లెట్ వచ్చేసింది.. దాన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

కోవిద్-19 కట్టడికి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అనేక రకాల వ్యాక్సిన్లు వచ్చినప్పటికీ.. ఎక్కడా ఇంతవరకూ ట్యాబ్లెట్లు రాలేదు. ఇప్పటివరకు అనుమతి పొందిన టీకాలు ఏవీ పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు.

2-Dg All You Need to Know About the New Oral COVID Drug Cleared by DCGI

మన దేశంలో టీకాల కొరత తీవ్రస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు Defence Research and Development Organisation(DRDO), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి కొత్త మందును కనిపెట్టింది. అయితే ఇది టీకా కాదు.

2-Dg All You Need to Know About the New Oral COVID Drug Cleared by DCGI

ఇది పూర్తిగా 2 డీ ఆక్సీ-డి గ్లూకోజ్(2DG) పొడి రూపంలో ఉంటుంది. దీనికి ఇటీవల డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI)కూడా అనుమతి ఇచ్చేసింది.

ఇది అతి త్వరలో మనకు అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా DRDO 2-DG డ్రగ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం...

Alert:కరోనా నుండి కోలుకున్నాక టూత్ బ్రష్ మార్చడాన్ని మరచిపోకండి... లేదంటే కరోనా నుండి తప్పించుకోవడం కష్టమే...Alert:కరోనా నుండి కోలుకున్నాక టూత్ బ్రష్ మార్చడాన్ని మరచిపోకండి... లేదంటే కరోనా నుండి తప్పించుకోవడం కష్టమే...

కరోనా కట్టడికి..

కరోనా కట్టడికి..

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు DRDO, రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి ఓ కొత్త మందును కనిపెట్టింది. ఈ డ్రగన్ ను అత్యవసర వినియోగం చేసుకోవచ్చని తాజాగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ట్రయల్స్ గతేడాది ప్రారంభమవ్వగా.. ఈ ఏడాదిలో విజయవంతంగా పూర్తయ్యాయి. అందుకే ఈ మందుకు 2 డీ ఆక్సి-డి గ్లూకోజ్( 2-DG) పేరు పెట్టారు.

పొడి రూపంలో..

పొడి రూపంలో..

ఈ మందు పూర్తిగా పొడి రూపంలో లభిస్తుందట. దీన్ని నీటిలో కరిగించి తాగాలట. కరోనా లక్షణాలు తక్కువ మరియు తీవ్రంగా ఉండే రోగులకు ఈ మందు విజయవంతంగా పని చేస్తోందని తమ ప్రయోగాల్లో తేలిందని DRDO ఛైర్మెన్ సతీష్ రెడ్డి వివరించారు. దీన్ని తీసుకున్న అనంతరం వైరస్ వ్యాప్తిని తగ్గించే అవకాశం ఎక్కువగా ఉందని DRDO వర్గాలు తెలిపాయి.

రెండ్రోజులు ముందే..

రెండ్రోజులు ముందే..

సాధారణ రోగులతో పోలిస్తే ఈ మందు తీసుకున్న కోవిద్ రోగులు రెండున్నర రోజుల ముందే కోలుకున్నట్టు తమ ప్రయోగాల్లో తేలింది. రెండు విడతలుగా నిర్వహించిన ఈ ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయని DRDO వర్గాలు తెలిపాయి.

కోవిడ్తో పోరాడటానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఆయుర్వేద స్వీయ సంరక్షణ చిట్కాలు...కోవిడ్తో పోరాడటానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఆయుర్వేద స్వీయ సంరక్షణ చిట్కాలు...

ఎమర్జెన్సీ సమయంలో..

ఎమర్జెన్సీ సమయంలో..

భారత రక్షణ పరిశోధన సంస్థ (DRDO) తయారు చేసిన ఈ మందును కరోనా రోగులు అత్యవసర సమయంలో వాడొచ్చని వివరించింది. ఈ మందు మెడికల్ ఆక్సీజన్ పై ఆధారపడే సమయాన్ని కూడా తగ్గిస్తోంది. అంతేకాదు మంచి ఫలితాలు కూడా వస్తోన్నాయి.

ప్రత్యేకమైన మందు..

ప్రత్యేకమైన మందు..

ఇది అన్ని మందుల లాంటిది కాదు. దీన్ని తయారు చేసిన విధానం చాలా ప్రత్యేకమట. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ పొడి కరోనా రోగుల బాడీలో కోవిద్ కారణంగా దెబ్బతిన్న కణాలను గుర్తించి.. అక్కడ వైరస్ కి బలం రాకుండా అడ్డుకుంటుంది. అందువల్ల వైరస్ బలహీనపడిపోతుంది. దీని వల్ల వైరస్ బలపడే అవకాశం తగ్గిపోతుంది. దీంతో కణాలు తిరిగి బలం పుంజుకుని.. కరోనా నుండి వేగంగా కోలుకోవచ్చు.

రెండే టీకాలు..

రెండే టీకాలు..

మన దేశంలో ఇప్పటిదాకా కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో రష్యా టీకా స్పుత్నిక్, అమెరికా టీకాలు కూడా రానున్నాయి. అయితే అంతకంటే ముందే భారత ఔషధ నియంత్రణ సంస్థ DRDO చేసిన మొదటి, రెండో ట్రయల్స్ లో వచ్చిన ఫలితాలతో ఈ మందుకు అత్యవసర అనుమతులు ఇచ్చేసింది. ఇది గనుక మూడో దశలో విజయవంతంగా పూర్తయితే.. ఆ డ్రగ్ ఇంకెంత బాగా పని చేస్తుందో తెలుస్తుంది.

వైరస్ ని చంపదు..

వైరస్ ని చంపదు..

ఈ మందు ప్రస్తుతం వాడుతున్న యాంటీ వైరల్ డ్రగ్స్, యాంటీ బయోటిక్స్ వంటివి. ఇది మన శరీరంలో పాడైన కణాలనే కాక..ఇతర కణాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అయితే దీని వల్ల ప్రతికూలతల కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉంటున్నాయి. 2-DGని యాంటీ వైరల్ డ్రగ్ అని చెప్పలేం. ఎందుకంటే ఇది వైరస్ ని చంపదు. కానీ అది బలహీనంగా మారేలా చేస్తుందంతే..

ఇది వాడిన వారికి..

ఇది వాడిన వారికి..

ప్రస్తుతానికి ఈ కొత్త మందు ట్యాబ్లెట్ రూపంలో కాకుండా పొడి రూపంలో అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఒక ప్యాకెట్లో ఇస్తున్నారు. దీన్ని నీటిలో కలుపుకుని తాగిన వారికి RT-PCR టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది. అందుకే దీనికి DCGI అనుమతి ఇచ్చింది. మూడో దశ ట్రయల్స్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే.. దీన్ని ట్యాబెట్ల్ గా తయారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

English summary

2-Dg All You Need to Know About the New Oral COVID Drug Cleared by DCGI

Here we are talking about the 2-Dg All You Need to Know About the New Oral COVID Drug Cleared by Dcgi. Read on
Story first published:Monday, May 10, 2021, 0:30 [IST]
Desktop Bottom Promotion