For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీనేజ్ బాలికల ఆరోగ్య చిట్కాలు!

By B N Sharma
|

Basic Teenage Health Tips For Girls
బాలికలకు టీనేజ్ సమస్యగా వుంటుంది. పెద్ద వారవుతూండటం వల్ల శారీరక మార్పులు వస్తాయి. హార్మోన్లు అధ్భుతంగా పెరుగుతూంటాయి. ఈ వయసులో మగ పిల్లల కంటే కూడా ఆడ పిల్లలలో ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. శరీరంలో వచ్చే మార్పులకు తోడు బయటి మార్పులు అంటే తినే అలవాట్ల వంటివి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి.

టీనేజ్ బాలికలకవసరమైన కొన్ని ప్రధాన ఆరోగ్య జాగ్రత్తలు పరిశీలించండి:
తినే తిండ్లను గమనించండి -
తినే పదార్ధాలు సరిలేకుంటే పిల్లలు లావుగా అవుతారు. నేటి రోజుల్లో ఈ సమస్య అధికమైంది. మగ పిల్లలు లావెక్కినా పరవాలేదు. కాని సమాజంలో ఆడపిల్లలు లావెక్కితే సమస్యలుంటాయి. కనుక జంక్ ఫుడ్ దొరికే ఫాస్ట్ ఫుడ్ జాయింట్స్ కు అతి తక్కువగా వెళ్ళండి.

ఎముకల ఆరోగ్యం - బాలికలు ఎదుగుతున్న కొలది వారి ఎముకలు కాల్షియం కోల్పోతాయన్నది తెలుసుకోండి. ఈ సమస్య వారి మెట్యూరిటీ నుండి మొదలై జీవితాంతం వుంటుంది. కనుక ప్రతిరోజూ ఒక గ్లాసెడు పాలు, ఒక అరటిపండు టీనేజ్ బాలికకు తప్పక తినిపించండి. ఇపుడు తినిపించకపోయినా పరవాలేదు. కాని దీని ప్రభావం వారి 40 సంవత్సరాల వయసు తర్వాత కనపడుతుంది.

రుతుక్రమం (పిరీయడ్స్), శుభ్రత - జననాంగ శుభ్రతలు, మూత్ర సంబంధిత ఇన్ ఫెక్షన్స్ రావచ్చు. కనుక పిరీయడ్స్ లో శుభ్రత అత్యవసరం. ఇది ప్రతి నెలా వచ్చే సమస్య కనుక దానిని సరిగా నిర్వహించడం నేర్చుకోండి.

రుతుక్రమ నొప్పులు, బలహీనత - నెలకు ఒక సారి వచ్చే రుతుక్రమం టీనేజ్ పిల్లల ఆరోగ్యాన్ని కొద్దిపాటిగా మెతక పడేయవచ్చు. దీనిని తప్పించే మార్గం లేదు. అయితే, పిల్ల పిరీయడ్స్ లో తినకూడని తిండి పదార్ధాలను మానివేయాలి. ద్రవ పదార్ధాలను అధికంగా తీసుకోవాలి.

పిరియడ్స్ రికార్డు చేయండి - రుతుక్రమం తేదీలు తప్పక రికార్డు చేయండి. సైకిల్ కనుక 28 నుండి 31 రోజుల మధ్య వుంటే అది సాధారణ రుతుక్రమమేనని గుర్తించండి.

పిరియడ్స్ సక్రమంగా లేకుంటే - నేటి రోజులలో ఇది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. కారణాలు... చెడు తిండి అలవాట్లనుండి జీవన విధానాలు సరిలేకపోవటం, పరీక్షల ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యతల వరకు వుంటాయి. ఏది ఏమైనప్పటికి సమస్యను సరి చేయటానకి సరి అయిన గైనకాలజిస్టును సత్వరమే సంప్రదించండి.

గర్భ నిరోధక సాధనాలు - వయసుకు అవసరంలేని ఆనందాలు పొందకండి. చాలామంది టీనేజ్ బాలికలు సరిగా లేని గర్భ నిరోధక మాత్రలు లేదా ఎమర్జెన్సీ సాధనాలుపయోగించి సమస్యల్లో పడతారు. వీటివలన ఇప్పటికే వారిలో పెరిగిన హార్మోన్ల స్ధాయి మరింత అధికమయ్యే ప్రమాదాలుకూడా వున్నాయి. కనుక సరి అయిన లైంగిక విద్యను నేర్చుకోండి. వయసు పెరగకుండానే పెద్దల ఆనందాలను ఆచరించకండి.

ఈ చిట్కాలు టీనేజ్ బాలికల ఆరోగ్య సమస్యల జాగ్రత్తలకు సహకరించగలవు.

English summary

Basic Teenage Health Tips For Girls | టీనేజ్ బాలికల ఆరోగ్య చిట్కాలు!

It is just about time that you know that many of the teenage health problems of girls occur from taking improper contraceptive pills or emergency contraceptives. All these tablets are basically hormone tablets that will mess up your already turbulent hormonal system. Take proper sex education and do not indulge in certain adult pleasure before your age permits.
Story first published:Monday, October 24, 2011, 14:52 [IST]
Desktop Bottom Promotion