For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘కాఫీ’... !...ఇంత గొప్ప పానీయమా?

By B N Sharma
|

Coffee Can Help Prevent Womb Cancer!
మహిళలకు శుభవార్త! ప్రతిరోజూ నాలుగు కప్పులు కాఫీ తాగితే గర్భాశయ కేన్సర్ నివారించవచ్చని ఒక కొత్త అధ్యయనం తెలుపుతోంది. స్త్రీలలో సహజంగా వచ్చేది ఎండోమెట్రియల్ కేన్సర్. ఈ వ్యాధికి ప్రతిరోజూ తీసుకునే కాఫీకి మధ్య సంబంధం వుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చర్లు కనిపెట్టారు.

రీసెర్చర్లు 26 సంవత్సరాలపాటు 70 వేలమంది మహిళలపై తమ స్టడీ నిర్వహించారు. ప్రతిరోజూ నాలుగు కప్పులు కాఫీ తాగే మహిలలకు గర్భాశయ కేన్సర్ వచ్చే అవకాశాలు 25 శాతం తక్కువని వెల్లడించారు. కేన్సర్ కారక హార్మోన్ల స్ధాయిని రోజూ తాగే కాఫీ తగ్గిస్తుంది. శరీరం సాధారణ బరువులో వుంచుకొని కొద్దిపాటి వ్యాయామాలు చేస్తే చాలు. అయితే, కాఫీలో కలిపే క్రీమ్ మరియు షుగర్ కాఫీ ప్రభావాన్ని తగ్గిస్తాయని కూడా వీరు తెలిపినట్లు 'డైలీ మెయిల్' వార్తా పత్రిక తెలిపింది.

కాఫీ అధికబరువు, ఇన్సులిన్, ఈస్ట్రోజన్ ప్రభావిత కారణాలుగా వచ్చే కేన్సర్ లకు కూడా జవాబు కాగలదట. వెజిటబుల్స్, పండ్లు వంటి వాటిలో కంటే కూడా కాఫీలో అధిక స్ధాయి యాంటీ ఆక్సిడెంట్లు వున్నాయని రీసెర్చి టీము ప్రధాన సైంటిస్టు ఎడ్వర్డ్ జియావానుక్కి వెల్లడించారు.

English summary

Coffee Can Help Prevent Womb Cancer! | గర్భాశయ కేన్సర్ నివారించే కాఫీ!

Lead researcher Edward Giovannucci said coffee could help against cancers associated with obesity, insulin and oestrogen, and it was shown to improve insulin resistance. Laboratory testing has found that coffee has much more antioxidants than most vegetables and fruits.
Story first published:Thursday, November 24, 2011, 9:31 [IST]
Desktop Bottom Promotion