For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెడు శ్వాసను నివారించాలంటే....!

By B N Sharma
|

food
శ్వాస చెడు వాసన కొడుతూంటే నిజంగా చాలా అవమానకరంగా వుంటుంది. వ్యక్తిగతంగా, సామాజికంగా ఎంతో అసౌకర్యం భావిస్తాం. దీనికి కారణం నోటి ఆరోగ్యం సరిగా ఉంచుకోకపోవడమే. లేదా జీర్ణక్రియ సరిలేక గ్యాస్ సంబంధిత సమస్యలు. రోజూ రెండు సార్లు బ్రష్ చేయటమే కాక, మీరు ఈ సమస్యను నివారించుకోవాలంటే మంచి ఆహారం కూడా తీసుకోవాలి.

చెడు శ్వాసను నివారించాలంటే....
విటమిన్ సి అధికంగా వుండే పుల్లటి పండ్లు తినండి. చెర్రీలు, స్ట్రాబెర్రీలు, నిమ్మ, ఆరెంజస్ ఈ సమస్యను సహజంగా నివారిస్తాయి. కేరట్స్, ఆపిల్స్ కూడా తినవచ్చు.

నిమ్మ - నిమ్మచెక్క ప్రతి భోజనం తర్వాత నాకండి. పళ్ళపై కూడా నిమ్మ చెక్కను రాయవచ్చు. చెడు బాక్టీరియాను, వాసనలను ఇది వెంటనే తొలగిస్తుంది.

సుగంధ ద్రవ్యాలు - లవంగాలు, యాలుకులు, వాము మొదలైనవి తింటే సహజంగా నోటి వాసన దూరమవుతుంది. ప్రతి భోజనం తర్వాత వీటిని నోటిలో వేసుకొని నమలండి. కొత్తిమీర ఆకులు కూడా చక్కని వాసననిస్తాయి.

పెరుగు - రీసెర్చర్ల మేరకు పెరుగు నోటిలోని చెడు వాసనలను అరికడుతుంది. చెడు బాక్టీరియాను తొలగిస్తుంది. తక్కువ కొవ్వు, షుగర్ లేని పెరుగు మంచి ఫలితం ఇస్తుంది. తియ్యటి పెరుగు తినకండి అది నోటిలో బాక్టీరియా పెంచుతుంది.

English summary

Food To Cure Bad Breath!

Yogurt: According to researchers, yogurt reduces the growth of sulfite in the mouth which causes bad breath. It also kills bacteria in the mouth therefore, a natural cure for bad breath. Have low fat, sugar free yogurt for effective results. Avoid having sweet yogurt as it leads to bacterial growth in the mouth.
Story first published:Saturday, November 19, 2011, 9:08 [IST]
Desktop Bottom Promotion