For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘జామే’ కదా అని చిన్న చూపు చూడకండి..!!

|

Health Benefits of Guava
రోజు పెరటిలో దొరికే 'జామే' కదా అని చులకనగా చూడకండి. పోషక విలువలలో ఆపిల్ పండుతో సరితూగే జామను నిర్లక్ష్యం చేస్లే కష్టాల్లో పడిపోతారు. పీచు పదార్థాం అధికంగా ఉండే జామ పండులో విటమిన్ 'సీ' పుష్కలంగా ఉంటుంది. మనవశరీరానికి అవసరమైన బీటా కెరోటిన్లను జామ పండు సమృద్థిగా అందిస్తుంది.

జామ ఫలాలు తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న కండను కలిగి ఉండటమ మనం చూస్తూనే ఉంటాం. అయితే ఆరెంజ్ రంగు కండ కలిగిన జామ ఫలాలు కూడా లభిస్తుంటాయి. కండ భాగంలోని గింజలను పరిశీలిస్తే చిన్నవైనా ధృడంగ ఉంటాయి. తెల్ల గుజ్జు జామ పండులో కంటే ఎరుపు, ఆరెంజి రంగు గజ్జు కలిగి ఉన్న జామ పళ్లలో బీటాకారోటిన్, పాలిఫినాల్స్, కెరటి నాయిడ్స్ వంటి ఫోషకాలు పుష్కలంగా ఉంటాయి.

రోజు 3 జామాకులను నమిలితే దంతక్షయం పోతుంది. జామాకులను నీటిలో మరగించి ఆ మిశ్రమాన్ని సేవిస్తే దగ్గు, జలుబు ఇట్టే మటుమాయమవుతాయి. పండిన జామపండును రోజు ఆహారంలా తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా డైటింగ్ చేసేవారికి జామ పండు బలవర్థక ఆహారం.

వృక్షశాస్త్ర వర్గీకరణలో 'మిర్టేసి' కుటుంబానికి చెందిన జామను 'సీడీఎమ్ గావా'గా పిలుస్తారు. ఏ మాత్రం అవకాశమున్న జామచెట్లను మీ పెరటిలో పెంచి ఇంటిల్లిపాది ఆరోగ్యవంతంగా ఉండండి.

English summary

Health Benefits of Guava...!! | ‘జామే’ కదా అని చిన్న చూపు చూడకండి..!!

Guava is a tropical fruit that is like the shape of pear, with green rind and pinkish or white flesh and small seeds. Some people say Guava is better than orange because guava contain more Vitamin C than orange and guava is a lot cheaper than orange.
Story first published:Saturday, September 3, 2011, 13:11 [IST]
Desktop Bottom Promotion