For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రయాణాలెన్నో..... కాని పొట్ట గడబిడ!

By B N Sharma
|

Travel Stomach Problems
ప్రపంచంలో ప్రయాణాలు చేసే వారిలో కనీసం పది మందికిపైగా ఎల్లపుడూ వయసుతో నిమిత్తం లేకుండా పొట్టసమస్యలకు గురవుతున్నారట. పొట్ట గడబిడ అవటమనేది చాలా కారణాలుగా వుంటుంది. ఆహారంలో మార్పు, శుభ్రతలు లేని తిండ్లు, లేదా నీరు, కొడలపైకి ప్రయాణాలు మొదలైనవెన్నో. ఈ ప్రయాణంలో పొట్ట గడబిడలను నివారణా మార్గాలను పరిశీలిద్దాం. సరిఅయిన ఆహారాన్ని ఎంచుకోండి!

1. ఒక శానిటైజర్ ను మీ హేండ్ బేగ్ లో వేసుకోండి. ఆహారం తినే ప్రతిసారి దీనిని ఉపయోగించండి. దీనికి నీరు కూడా అవసరం లేదు.
2. ప్యాక్ చేసిన ఆహారం, పండ్ల రసాలు తీసుకోండి. లేదా అరటిపండు, రేగిపండు, ఆపిల్, లేదా ఇతర పుల్లటి పండ్లను తింటానికి ఎంపిక చేయండి. వీటిని తినే ముందు పొడిబట్టతో తుడవండి. కట్ చేసిన పండ్లు తినవద్దు.
3. వీలైనంత వరకు వేడి నీరు మాత్రమే తాగండి.
4. ఐస్ క్యూబులు, రెడీమెడ్ సలాడ్లు, సగం ఉడికించిన ఆహారం, గుడ్లు, ఐస్ క్రీములు తినకండి.
5. ఏవైనా తిండిపదార్ధాలు కొంటున్నారా? ప్యాక్ పై తయారీ తేదీని తప్పక చూడండి. తాజా ప్యాకెట్లు మాత్రమే కొనాలి.
6. నూనెలో వేయించిన లేదా ఇతర వేపుడు తిండ్లు పూర్తిగా వదిలేయండి. ఇవి పొట్టకు సమస్య తెచ్చిపెడతాయి.

ముందస్తు జాగ్రత్తలు -
1. ప్రయాణానికి రెండు గంటల ముందు ఆహారం తీసుకోండి.
2. ఘాట్ సెక్షన్ లో ప్రయాణించేటపుడు ఏదో ఒక రీతిగా మైండ్ కు పనికల్పించి ప్రయాణంనుంచి దృష్టి మరల్చండి. మానసిక కారణంగా పొట్ట గడబిడ చేయవచ్చు.
3. జల్ జీరా లేదా ఆమ్ చూర్, లేదా ఆమ్ల లాంటివి వాడి జీర్ణక్రియ సవ్యంగా వుండేలా చూడండి.
4. పాటలు మైండ్ ను హాయిగా వుంచుతాయి. మ్యూజిక్ లేదా పాటలు వినండి.
5. నీరు అధికంగా తాగండి. అది జీర్ణక్రియను మెరుగుపరచటమే కాదు పొట్టను శుభ్రపరుస్తుంది కూడాను.

English summary

Travel Stomach Problems & Quick Cure | ప్రయాణాలెన్నో..... కాని పొట్ట గడబిడ!

Drink jal jeera or aamchur, salted dry amla that quicken digestion (cures gastritis). Singing relaxes mind so listening to music while traveling keep divert your attention from the discomfort.
Story first published:Tuesday, August 30, 2011, 13:04 [IST]
Desktop Bottom Promotion