For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గొంతు నొప్పి నివారణకు తక్షణ ఉపశమనం ఇచ్చే ఆహారాలు...!

|

శీతాకాలంలో ఆరోగ్యం గురించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో పాటు గొంతునొప్పి కూడా వస్తుంది. ఈ సీజన్‌లో చాలా మంది గొంతునొప్పితో బాధ పడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్ష న్‌ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటం వలన గొంతునొప్పి (త్రోట్‌ పెయిన్‌) మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరి పడకపోవడం వల్ల, ఉపన్యాసాలు ఎక్కువగా ఇవ్వడం, విరామం లేకుండా పాటలు పాడటం వలన కొందరిలో గొంతునొప్పి వచ్చి వేధిస్తుంది. అయితే వీటిని నుండి అతి సులభంగా ఉపశమనం పొందాలంటే కొన్ని ఆహారాలను ప్రత్యేకంగా తీసుకోవాలి. ఆహారంతో గొంతునొప్పి మాయం అవుతుందా అంటే అవుననే చెప్పచ్చొ. మీ గొంతు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్లు మీకు తెలియగానే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం ప్రారంభించాలి. దాంతో గొంతు నొప్పి చెక్ పెట్టవచ్చు.

మనం సాధారణంగా ఇంట్లో వంటకు వినియోగించే కొన్ని వస్తువులు గొంతు నొప్పిని కూడా నివారిస్తాయి. ఉదాహరణకు టీ లిక్కర్ గొంతు నొప్పికి చాలా అద్భుతమైనటువంటిది. దీనికి కొంచెం అల్లం చేర్చితే చాలు. ఫలితం మెండుగా ఉంటుంది. అంతే కాదు గొంతు ఇన్ఫెక్షన్ కూడా నివారిస్తుంది. వేడి వేడి సూపులు.. మరికొన్నిఇతర ఆహారాలు కూడా గొంతు నొప్పిని చాలా సులభంగా తగ్గిస్తాయి. ఎక్కువగా గొంతు నొప్పితో బాధపడుతుంటే కనుక హాట్ చికెన్ సూప్ లేదా టమోటో సూప్ వంటివి చాలా అద్భుతంగా పనిచేసి గొంతునొప్పితో పాటు, ఇన్ఫెక్షన్ కూడా దూరం చేస్తుంది.

గొంతు మరీ ఎక్కువగా ఇన్ఫెక్షన్ కు గురియైంటే కనుక అందుకు తేనె మరియు నిమ్మరసం కూడా మంచి ఔషధాలుగా పనిచేస్తాయి. కొన్ని డైరీ ప్రొడక్ట్స్ కూడా కొంత వరకూ ఉపశమనాన్ని కలిగిస్తాయి. గడ్డ పెరుగు తినడం వల్ల గొంతులోపలి భాగానికి అంటుకొని కొంత వరకూ నొప్పిని తగ్గిస్తుంది. కొన్ని రకాల స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల గొంతులో కష్టంగా.. కారంగా ఉన్నా కూడా జలుబు, దగ్గును, గొంతునొప్పికి నివారిణులగా బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు మిరియాలను సూప్స్ లోనూ, టీ, కాఫీ లకు చేర్చి తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలనిస్తుంది. మీ గొంతు నొప్పిని పోగట్టడానికి అలాంటి మరికొన్ని ఆహారాలు మీ కోసం...

గొంతునొప్పికి తక్షణ ఉపశమనాన్నిచ్చే ఆహారాలు..!

హాట్ చికెన్ సూప్: మీకు జలుబు ఎక్కువగా ఉందా అయితే మీ డాక్టర్ మీకిచ్చే ప్రిస్ర్కిప్షన్ లో ఈ హాట్ చికెన్ సూప్ ను కూడా చేర్చుకోండి. ఈ హాట్ చికెన్ సూప్ గొంతు నొప్పికి, గొంతు ఇన్ఫెక్షన్ కు చాలా బాగా పనిచేస్తుంది.

గొంతునొప్పికి తక్షణ ఉపశమనాన్నిచ్చే ఆహారాలు..!

మసాలా ఛాయ్: టీ తయారు చేసే సమయంలో అందులో కొన్ని స్పైసీ(మసాలా)లను చేర్చి బాగా మరిగించి వేడి వేడిగా తాగాలి. మసాలాలు అంటే లవంగాలు, మిరియాలు, మరియు చెక్క గొంతు నొప్పిని, ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.

గొంతునొప్పికి తక్షణ ఉపశమనాన్నిచ్చే ఆహారాలు..!

జింజర్ ఎలా(అల్లం రసం): గొంతు నొప్పిని పోగొట్టుటలో అద్భుతంగా పనిచేసే ఔషదం అల్లం రసం. అల్లంను నీళ్ళతో కానీ లేదా ఆల్కహాల్ తోకానీ మరిగించడం వల్ల ‘జింజర్ ఎలా' అనే ఓ చిక్కటి ద్రవం తయారవుతుంది. ఇది తగిన మోతాదులో తీసుకోవడం వల్ల గొంతు నొప్పిని క్షణాల్లో పోగొడుతుంది.

గొంతునొప్పికి తక్షణ ఉపశమనాన్నిచ్చే ఆహారాలు..!

పెరుగు: సాధారణంగా పెరుగును చలువ పదార్థంగా భావిస్తుంటారు. అయితే ఇది నిజం కాదు పెరుగు కడుపును మాత్రమే చల్లబరుస్తుంది. ఈ పెరుగును గది టెంపరేచర్ లో తయారు చేసి తీసుకోవడం వల్ల గొంతు నొప్పికి ఓ మంచి ఔషదంగా పనిచేస్తుంది.

గొంతునొప్పికి తక్షణ ఉపశమనాన్నిచ్చే ఆహారాలు..!

తేనె మరియు నిమ్మరసం: సిట్రస్ పండ్లలో యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉంటాయి. అందువల్ల నిమ్మరసానికి కొంచెం తేనె చేర్చి గోరువెచ్చగా వేడి చేసి తాగాలి. దాంతో గొంతు నొప్పికి కొంత ఉపశమనం కలుగుతుంది.

గొంతునొప్పికి తక్షణ ఉపశమనాన్నిచ్చే ఆహారాలు..!

సేజ్: సేజ్ అనేది మూలిక ఇందులో జలుబు, దగ్గు, గొంతునొప్పిని నివారించే గుణాలు మెండుగా ఉన్నాయి. ఈ మూలికను సూప్, సలాడ్స్, ఇతరపానీయాలతో కలిపి తీసుకోవచ్చు.

గొంతునొప్పికి తక్షణ ఉపశమనాన్నిచ్చే ఆహారాలు..!

వెచ్చని ఓట్స్ మిశ్రమంతో పాటు బనానా: జలుబుగా ఉన్నప్పుడు ఓట్స్ ఉడికించి అందులో అరటిపండు వేసి బాగా మిక్స్ చేసి ఓ స్నాక్ లా తయారు చేసుకొని తింటే తప్పకుండా గొంతు స్వస్థపరుస్తుంది.

గొంతునొప్పికి తక్షణ ఉపశమనాన్నిచ్చే ఆహారాలు..!

లికోరైస్ వేరు: ఈ వేరును బొటానికల్ గా గ్లిసిరిజా గ్లాబ్ర అని పిలుస్తారు. ఇందులో వ్యాధినిరోధక లక్షణాలు కలిగి ఉండటం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ నయం చేయడానికి బాగా సహాయపడుతుంది.

గొంతునొప్పికి తక్షణ ఉపశమనాన్నిచ్చే ఆహారాలు..!

పెప్పర్(మిరియాలు): జలుబు చేసినప్పుడు కారంగా ఉండే నల్లని మిరియాలు తీసుకోవడం అంత అసౌకర్యంగా అనిపించకపోయినా.. ఇది ఖచ్చితంగా జలుబు, గొంతు నొప్పికి ఉత్తమ నివారిణిగా చెప్పవచ్చు.

గొంతునొప్పికి తక్షణ ఉపశమనాన్నిచ్చే ఆహారాలు..!

ఆపిల్ సైడర్ వెనిగర్: గొంతు నొప్పికి ఉపయోగించే ఇంటి చిట్కాల్లో ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. జలుబు, గొంతు నొప్పి ఉన్నప్పుడు ఈ ఆఫిల్ సైడర్ వెనిగర్ ను సలాడ్స్ మీద చల్లుకొని లేదా అలాగే నేరుగా ఒక చెంచా తీసుకోవడం వల్ల తప్పనిసరిగా ఉపశమనం పొందవచ్చు.

English summary

10 Foods That Can Cure Sore Throat | గొంతునొప్పికి తక్షణ ఉపశమనాన్నిచ్చే ఆహారాలు..!

Winter is here and if you have not been careful, then you are bound to be stuck with a sore throat. But we can help you cure your sore throat very easily by eating the right foods. Yes, your sore throat can be healed by eating certain foods. As soon as you start feeling an irritation in your throat, you must start eating some foods to heal your sore throat.
Story first published: Wednesday, December 19, 2012, 17:56 [IST]
Desktop Bottom Promotion