For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోటి పూతను పోగొట్టే సులభమైన చిట్కాలు...

|

నోటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే నోరు మన మాట వినదు సరికదా. పైగా నోరే మనలోని జబ్బులను బయటపెడుతుంది. అది ఏమిటి అంటారా? చూడండి.... అపుడప్పుడు కొందరికీ నోటి పూత వస్తుంటుంది. నోటి పూత కారణంగా నాలుక నోటి లోపలి బుగ్గలు, పెదవులు, ఎర్రగా పూసినట్లు కనిపిస్తుంది. కారం తగిలితే మంట పుడుతుంది. నోటి వెంట లాలాజలం ఊరుతుంది. ఏమి తినాలన్నా నొప్పితో చాలా బాధపడాల్సి ఉంటుంది. నాలిక పైనఅంతా చిన్ని చిన్ని పుండ్లు కూడా వస్తాయి.

నోటి పూతకు కారణాలు: ముఖ్యంగా నోటి అపరిశుభ్రత. ధూమపానం, మద్యపానం అలవాటు. నోటి అపరిశుభ్రత. సరిగ్గా పోషక పదార్థాలు శరీరానికి అందకపోవడం. వ్యాధి నిరోధకశక్తి క్షీణించి నోట్లో వుండే సూక్ష్మక్రిములు బాగా అభివృద్ధి చెందినప్పుడు. కొన్ని దీర్ఘకాల వ్యాధులు. ఫంగల్‌, బ్యాక్టిరియల్‌, వైరల్‌ ఇన్‌ ఫెక్షన్‌ వల్ల. జీర్ణాశయ, పేగుల వ్యాధుల వల్ల. మరికొందరిలో మలబద్ధకం వల్ల. ఎక్కువ ఆందోళన చెందడం. ఆడవారిలో నెల సరి వచ్చే ముందు రోజుల్లో. మధుమేహం, హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌లలో ఎక్కువ కార్టిజోన్‌ మందులు వాడేవారిలో. జీర్ణవ్యవస్థ లోపం వల్ల బి-కాంప్లెక్స్‌ (నియాసిన్‌, రిబోఫ్లేవిన్‌ పోలిక్‌ యాసిడ్‌, బి-12 ఐరన్‌ జింకు) శరీరానికి సరిపాళ్ళలో అందకపోడం వల్ల ఈ నోటి పూత ఏర్పడుతాయి. కనుక ఎంతైనా మన నోరును మన జాగ్రత్తగా ఉంచుకోవాలి సుమా.

How to Get Rid of Mouth Ulcers...

తీసుకోవల్సిన జాగ్రత్తలు:
1. విటమిన్లు, పోషకపదార్థాలు సరిగ్గా లేక నీరసించి వున్నవాళ్ళు బి-కాంప్లెక్స్‌ (నియాసిన్‌, ఫోలిక్‌ ఆమ్లం, రిబోఫ్లేవిన్‌ బి12 జింకు, ఐరన్‌ కలిగిన) మాత్రలు వాడాలి.
2. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వుంటే మెట్రోనిడియోజాల్‌ 200 మిల్లీగ్రాములు రోజుకు మూడేసి, ఫంగస్‌ వుంటే నిస్టాంటిన్‌ లాజెంజెస్‌, క్యాడిడ్‌ లోషన్‌ లేక జెల్లి అంటించాలి.
3. నోటిని పరిశుభ్రతగా వుంచాలి. చిగుళ్ళ వ్యాధికి తగు చికిత్స చేయించాలి.
4. క్లోర్‌హెక్సిడిన్‌ మౌత్‌ పెయింటు వాడాలి.
5. ప్రతి రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. మలబద్దకం లేకుండా చూసుకోవాలి.
6. ఆందోళనను నియంత్రించుకొని ప్రశాంత జీవన శైలి అలవర్చుకోవాలి.
7. జీర్ణాశయప్రక్రియ సరిగ్గా వుండేట్టు చూసుకోవాలి.
8. ధూమపానం, మద్యపానం మానాలి. కిళ్లీ, జర్దా, పాన్‌ పరాగ్‌ వాడకం మానాలి.
9. అవసరాన్ని బట్టి హైడ్రోకార్టిజోన్‌ లాజెంజెస్‌ గాని, బిళ్లలుగాని డాక్టరు సలహా మేరకు కొద్ది రోజులే వాడాలి. కొన్ని వ్యాధులు (ఎయిడ్స్‌, మధుమేహం వంటివి) కొన్ని మందుల వల్ల కల్గితే, రక్తంలో దోషముంటే వాటికి తగిన చికిత్స చేయించాలి.
10. ప్రతి రోజు ఉదయం పరకడుపున ఉప్పు కలపిన నీటిని నోట్లో వేసుకుని పుక్కలించండి.
11. నల్ల నువ్వులను దంచి ఉండలా చేసుకుని నోట్లో పెట్టుకుని రసం పీల్చి పిప్పిని ఉమ్మేయండి.
12. బియ్యం కడిగిన నీటిలో చెంచా ఉసిరి రసం కలుపుకుని భోజనానికి ముందు సేవించండి. దీంతో మంచి ఫలితముంటుందంటున్నారు వైద్యులు.

English summary

How to Get Rid of Mouth Ulcers... | నోటి పూతకు చికిత్స ఇలా...

Mouth ulcers are difficult to prevent, because the exact cause is still unknown. A fact is that a low immune system and genetic hereditary cause mouth ulcers. There are some measures to reduce the risk of getting mouth ulcer(s). Above Below you can find tips how to prevent and reduce the risk of mouth ulcers forming.
Desktop Bottom Promotion