For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యానికి ‘గ్రీన్ టీ’ కంటే ‘బ్లాక్ టీ’ మంచిదా...?

|

ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన విధానం వల్ల ఒత్తిడి, అధిక బరువు, అధిక పొట్టతో చాలా మంది బాధపడుతున్నారు. అందుకు ఎన్నో రకాల ప్రయాత్నాలు చేసి ఇప్పుడు గ్రీటీ, బ్లాక్ టీ వెంట పడ్డారు. ఆఫీసుల్లో పనిచేసే వారికి గ్రీన్ టీ ఒక ఆరోగ్యం మంత్రంగా మారింది. ఎందుకంటే ఈ టీలల్లో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక. కాఫీ బ్రేక్ వచ్చిందంటే చాలు టీబ్యాగ్స్, కప్పులతోటి హ్యాపీగా గ్రీన్ టీ, బ్లాక్ టీ లు తాగేస్తుంటారు. గ్రీన్ టీ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఇండియాలోనే కాదు ప్రపంచ మొత్తంగా బ్లాక్ టీకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.

ఎందుకంటే తాజా అధ్యయనం ప్రకారం బ్లాక్ టీలో కాసింత వేడిపాలును కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు గుండె జబ్బులను దూరం చేస్తుందని టీ అడ్వైజరీ ప్యానెల్ తెలిపింది. గ్రీన్ హెల్త్ ప్రాపర్టీస్, బ్లాక్ టీ ప్రాపర్టీస్‌పై జరిగిన పరిశోధనలో గ్రీన్ కంటే బ్లాక్ టీ ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలో తేలింది. దీనిపై ఫ్రీలాన్స్ డైటీషియన్ డాక్టర్ క్యారీ రక్స్‌టన్ మాట్లాడుతూ.. గ్రీన్ టీ కంటే.. బ్లాక్ టీని సేవించడం వల్ల క్యాన్సర్, స్ట్రోక్, డయాబెటీస్, నోటి సమస్యలు వంటివి తగ్గుతాయన్నారు.

అయితే తమ అధ్యయనం రెండు రకాల టీలపై సాగినట్టు చెప్పారు. ఇందులో ఒకే తరహా ప్రతిఫలాలు ఉన్నట్టు తేలిందన్నారు. బ్లాక్ లేదా గ్రీన్ టీ తాగే వారిలో ఎక్కువగా గుండెపోటులు చాలా వరకు తగ్గినట్టు ఆయన తెలిపారు. ప్రతిరోజూ బ్లాక్ టీ తాగడం ద్వారా రక్తపోటుకు చెక్ పెట్టవచ్చునని తాజాగా నిర్వహించిన ఆస్ట్రేలియా అధ్యయనంలో తేలింది. మొత్తం 95 మంది ఆస్ట్రేలియన్లను రెండు గ్రూపులు తీసుకుని బ్లాక్ టీ, కాఫీ సేవింప చేశామని పరిశోధకులు జోనాథన్ హడ్గ్సన్ తెలిపారు. ఇందులో బ్లాక్ టీ తాగే గ్రూపుకు రక్తపోటు సమస్య చాలా మటుకు తగ్గిందని తేలింది. ఆరునెలల పాటు జరిగిన ఈ పరిశోధనలో బ్లాక్ టీ తాగే వారిలో రక్తపోటు తగ్గిందని, కాఫీ తాగిన వారిలో రక్తపోటు సమస్య పెరిగినట్లు తేలిందని జోనాథన్ వెల్లడించారు.

Is Black Tea

కాబట్టి బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ తాగాలని ఎవరైనా చెబితే ఏదో పిచ్చి చిట్కాలని కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు అందుకు శాస్త్రీయ ఆధారం లభించింది. ఆహారంలో బ్యాక్టీరియా కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లకు టీ ఒక చక్కటి విరుగుడు అని దక్షిణ భారత దేశంలో టీ మీద జరుగుతున్న జాతీయ సమావేశాల్లో శాస్త్రవేత్తలు చెప్పారు. టీ సర్వరోగ నివారిణి కాకపోయినా ఫ్లూ, ఆహార నాళం, పొట్ట కేన్సర్లను నయం చేసే గుణాలు టీలో ఉన్నాయి.

ఎందుకంటే టీలో ఉండే పాలీ ఫినాల్స్ అనే పదార్థాలు మనకు తెలిసిన యాంటీ ఆక్సిడెంట్లకంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయట. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడతాయని కూడా చెబుతున్నారు. అంతేనా.. ఈ పాలీ ఫినాల్స్ దంతాలకు కూడా మేలు చేస్తాయట. పాచి పట్టకుండా ఆపడమే కాక, పళ్ల మీది ఎనామిల్‌ను గట్టిపరుస్తాయి. జపాన్, చైనాల్లో భోజనం తరువాత ఒక కప్పు గ్రీన్ టీ తాగిన పిల్లల్లో ఈ లక్షణాలన్నింటినీ కనుగొన్న శాస్త్రజ్ఞులు వాటికి కారణం టీలోని పాలీ ఫినాల్సేనని తేల్చారు.

టీ తాగితే మన మెదడులో చురుకుదనం కూడా పెరుగుతుందట. 44 మంది యువకులపై జరిపిన అధ్యయనంలో టీలో ఉండే అమినో యాసిడ్ ఎల్-థియానైన్ మెదుడు చురుకుదనాన్ని పెంచిందని తేలింది. అలసటను కూడా తగ్గించిందట. మొత్తానికి బ్లాక్ టీ తాగితే ఆలోచనా సామర్థ్యం పెరుగుతుందని, గ్రీన్ టీ తాగితే మెదడు చురుగ్గా పని చేస్తుందని, మొత్తానికి క్రమం తప్పకుండా టీ తాగేవారిలో శారీరక ఆరోగ్యం బాగుంటుందని తేల్చారు.

English summary

Is Black Tea Healthier Than Green Tea? | ఆరోగ్యానికి గ్రీన్ టీ, బ్లాక్ టీ ఏది బెటర్...!?

Green tea has now become the mantra of good health among office goers. People flock to the cafeteria on tea breaks and drink freshly brewed green tea believing that it will cure all their health problems. Indeed, green tea does have several health benefits but it was never this popular in the world. The world and India in particular has always preferred the stronger black tea.
Desktop Bottom Promotion