For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోకాళ్ళ నొప్పులు రాకుండా చేసే ఆహారపు అలవాట్లు...!

|

What Type of Food can Aggravate Knee Pain..?
మారుతున్న జీవనవిధానం, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులను తెచ్చిపెడుతున్నాయి. ఆరవై ఏళ్ల వయసులో వచ్చే మోకాళ్ల నొప్పులు ఇప్పుడు నలభైఐదేళ్లకే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో మోకాళ్ల నొప్పుల సమస్య తీవ్రంగా ఉంటోంది. ఆరోగ్యంపై శ్రద్ధ కొరవడటం, కాల్షియం లోపం, వ్యాయామం చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. స్త్రీలలో రుతుస్రావం ఆగిపోయిన తరువాత కాల్షియం లోపం ఇంకా ఎక్కువవుతుంది. పాలు, ఆకుకూరలు తగినంత తీసుకోకపోవడం వల్ల శరీరంలో కాల్షియం పరిమాణం తగ్గిపోతుంది.

నేటి ఆధునిక జీవనశైలి కారణంగా వ్యాయామానికి అస్సలు చోటు లేకుండా పోయింది. కూర్చున్న చోటు నుండి లేవకుండా అదేపనిగా 12 గంటలకు పైగా పనిచేయటం మామూలైపోయింది. ఇలా ఎక్కువ సేపు సీట్లో కూర్చుని అటూఇటూ కదలకుండా పనిచేయటం వల్ల స్థూలకాయంతో పాటు మోకాళ్ళ నొప్పులు మొదలవుతాయి. ప్రధానంగా మోకాళ్ళ జాయింట్‌ మధ్యలో వున్న మృధులాస్తి, సైనోవియల్‌ ఫ్లూయిడ్‌ లో వచ్చే మార్పుల వల్ల మోకాలి ఎముకల అరుగుదల చోటు చేసుకోవడంతో నొప్పులు మొదలవుతాయి. అధిక బరువు కూడా దీనికి తోడవడంతో మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉంటాయి. మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాళ్ళు బాగా నొప్పి పెడుతాయి. అదే విధంగా కూర్చొనిపైకి లేచేటప్పుడు మోకాళ్ళు పట్టుకు పోతాయి. ఉదయం పూట వగానే నడిచేందుకు మోకాళ్ళు సహకరించ కుండా వుంటాయి. నడుస్తున్నప్పుడు మోకాళ్ళ వద్ద చిన్న చిన్న శబ్దాలు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇటువంటి లక్షణాలుంటే ఇక అశ్రద్ధ చేయ కూడదు.

పనిచేసేవారు కనీసం గంటకో సారైనా ఓ పది నిముషాలు అలా అటూ ఇటూ నడవడం చేయాలి. ఇక స్థూలకాయం ఉన్నవారు తమ బరువును తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలి. ఇక ఆహార పదార్ధాల విషయా నికి వస్తే. ఉప్పు, వంటలలో నూనె మోతాదులను తగ్గించు కోవటం మంచిది. మాంసాహారం, మద్యం, పొగతాగడం వంటి అలవాట్లున్న వారు వెంటనే వాటికి దూరంగా వుండాలి. క్యాల్షియం పుష్కలంగా వున్నటువంటి పాలు, గుడ్డు, పెరుగు వంటివి తీసు కోవాలి. మంచి నీళ్ళు సరిపడినన్ని తాగుతుండాలి. కొంతమంది పనిలో పడితే గొంతు పిడచకట్టుకు పోతున్నా తలతిప్పరు. ఆ అలవాటును మానుకుని ఆరోగ్యం పైనా శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యంగా లేకపోతే పనిని కూడా సమర్థవంతంగా చేయలేరు. నాణ్యత తగ్గుతుంది. ఇక అన్ని జబ్బులకు మంచి మందు వ్యాయామం. నడక వల్ల అధిక బరువు సమస్య దరిచేరదు. తద్వారా మోకాళ్ళ నొప్పులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

English summary

What Type of Food can Aggravate Knee Pain..? | కాస్త ఒంటికి పని చెప్పండి.. లేదంటే నొప్పులే నొప్పులు

Looking for a natural way to relieve knee pain? You may want to tweak your diet. A growing body of research suggests that small dietary changes can add up to big benefits for knee health. “A number of foods have powerful anti-inflammatory and pain-relieving properties that may be as effective as some prescription medicines for arthritis and other types of knee pain
Story first published:Tuesday, August 7, 2012, 8:43 [IST]
Desktop Bottom Promotion