For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవి ఎనర్జీతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలందించే దోసకాయ

By Super
|

కస్తూరి దోసకాయలో దాదాపు 95% నీరు ఉంటుంది,మరియు దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి కస్తూరి దోసకాయ వలన మన ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు చేకురతాయి. ఈ దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండుటవల్ల చల్లని మరియు ఉపసమన భావన కలుగుతుంది. కాబట్టి ఇది గుండెల్లో మంట నుంచి ఉపశమనం మరియు జీవక్రియ యొక్క అవశేషాలు నుండి మూత్రపిండాల శుద్దిని చేస్తుంది.

ఈ పండులో చక్కెర లేదా కెలోరీలు ఎక్కువగా లేకపోవుట వల్ల బరువు తగ్గి ఆరోగ్యకరమైన శరీరం కొరకు ప్రయత్నిస్తున్న వారందరికీ మంచి అల్పాహారంగా ఉంటుంది. కస్తూరి దోసకాయలో విటమిన్ c పుష్కలంగా ఉండి యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అంతే కాకుండా గుండె వ్యాధులు మరియు క్యాన్సర్ నివారించడానికి సహాయం చేస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం నిర్వహణలో ఉపయోగపడే విటమిన్ A కూడా ఉంటుంది.

క్యాన్సర్ నివారణ

క్యాన్సర్ నివారణ

కస్తూరి దోసకాయలో అధిక కెరోటినాయిడ్ కలిగి ఉండుట వల్ల క్యాన్సర్ ను నిరోధిస్తుంది మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మన శరీరం మీద దాడి చేసే క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.

స్ట్రోక్ మరియు గుండె జబ్బుల నివారణ

స్ట్రోక్ మరియు గుండె జబ్బుల నివారణ

స్ట్రోక్ లేదా గుండె వ్యాధులకు దారితీసే రక్త కణాలకు సంబంధించిన గడ్డ కట్టడం ఆపడానికి ఉపయోగపడే అదేనోసైన్ ఈ కస్తూరి దోసకాయలోఉంటుంది. కాబట్టి శరీరంలో రక్తం మృదుత్వం కలిగి ఉండుట కొరకు సహాయం చేస్తుంది. అందువల్ల స్ట్రోక్ లేదా గుండె వ్యాధుల చిన్న చిన్న ప్రమాదాలను తగ్గిస్తుంది.

మంచి జీర్ణక్రియ కోసం

మంచి జీర్ణక్రియ కోసం

జీర్ణ సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో కస్తూరి దోసకాయను తింటే అప్పుడు సులభంగా మృదువైన ప్రేగు కదలిక ఉంటుంది.దోసకాయలో ఉన్న నీటి శాతం జీర్ణక్రియకు చాలా మంచిది. శరీరం యొక్క ఆమ్లత్వం ప్రత్యేకించి పొట్టఅవయవాలలో జీర్ణశక్తికి అంతరాయం కలగకుండా చేసే సామర్థ్యం దోసకాయలో ఉన్న ఖనిజాలకు ఉంది.

ఆరోగ్యవంతమైన చర్మం నిర్వహణ

ఆరోగ్యవంతమైన చర్మం నిర్వహణ

దోసకాయ కొల్లాజెన్ ,చర్మం అన్ని కనెక్టివ్ కణజాలమ్లో కణ నిర్మాణం యొక్క సరళతను ప్రభావితం చేసే ప్రోటీన్ కాంపౌండ్స్ ను కలిగి ఉంది. కొల్లాజెన్ తంతువులు వల్ల గాయం త్వరగా నయం అవుతుంది. మీరు తరచుగా దోసకాయ తింటే మీ చర్మం గరుకు మరియు డ్రై గా ఉండదు.

మూత్రపిండ వ్యాధి మరియు తామరను నయం చేయటంలో సహాయం

మూత్రపిండ వ్యాధి మరియు తామరను నయం చేయటంలో సహాయం

మూత్రపిండ వ్యాధి మరియు తీవ్రమైన వ్యాధులు,తీవ్రమైన తామరను నివారణ చేయటం,మలబద్ధక నివారణకు మంచి సహాయకారిగా ఉంటుంది.దోసకాయ రసం ,నిమ్మకాయ రసంను కలిపి కీళ్లవాతంను నయం చేయవచ్చు.

శక్తి ని పెంచుతుంది

శక్తి ని పెంచుతుంది

దోసకాయ B విటమిన్లు కలిగి ఉంటుంది.B విటమిన్లు మీ శరీరం యొక్క శక్తి ఉత్పత్తికి(ఇవి చక్కెరలు మరియు పిండి పదార్థాలు ప్రాసెస్ చేయడానికి శరీరంనకు అవసరం)చాలా బాధ్యత వహిస్తాయి.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

దోసకాయలో సోడియం తక్కువగా ఉండుట వల్ల బరువు తగ్గాలని అనుకొనే వారికీ అనువైన ఆహారంగా ఉంది. దీనిలో కొవ్వు రహిత, కొలెస్ట్రాల్ ఫ్రీ మరియు కెలోరీలు (దోసకాయ ఒక కప్పులో 48 కేలరీలు మాత్రమే ఉంటాయి) తక్కువగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండుట వల్ల దోసకాయ ని తిన్నప్పుడు పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. సహజంగా తీయగాను,అధిక శక్తి ప్రమాణము కలిగి ఉంటుంది.

కంటి ఆరోగ్యం

కంటి ఆరోగ్యం

మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ A చాల అవసరము. దోసకాయ బీటా కెరోటిన్ రూపంలో B విటమిన్ ను అందిస్తుంది.ఈ విధమైన అధికంగా బీటా కెరోటిన్ ఉన్న పండ్లను రోజుకు మూడు లేదా ఎక్కువ సార్లు తీసుకుంటే 36 శాతం దృష్టి లోపము ప్రమాదంను తగ్గిస్తుంది. ఈ కంటి సమస్యలు వయసు సంబంధిత పరిస్థితి,దృష్టి నష్టానికి దారితీస్తాయి.

ఒత్తిడి నుండి ఉపశమనం

ఒత్తిడి నుండి ఉపశమనం

మీ శరీరం ఒత్తిడికి గురి అయినప్పుడు దోసకాయ లోని పొటాషియం సహాయపడుతుంది. దోసకాయ రసంలో ఉన్న పొటాషియం మెదడుకు తగినంత ఆక్సిజన్ ను సరపరా చేస్తుంది. అందువలన ఇది మీ హృదయ స్పందనకు సహాయం చేస్తుంది.

మధుమేహ వ్యాధి

మధుమేహ వ్యాధి

డయాబెటిస్ రోగులు తరచుగా తక్కువ చక్కెర మరియు తక్కువ శక్తి ఆహారంలో ఉందని ఫిర్యాదు చేస్తారు. అందువలన దోసకాయ రసం అలాంటి రోగులకు మంచి సప్లిమెంట్ గా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. నిపుణులు గట్టిగా మధుమేహం రోగులకు చేదు దోసకాయ రసంను సిఫార్సు చేస్తున్నారు.

English summary

కస్తూరి దోసకాయల వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు

Muskmelons Melon fruit contains about 95% of water and is also rich in vitamins and minerals, so it has many benefits on our health. From the side of water content, melons can give sense of cool and soothing effect, so it can relieve heartburn and cleanse the kidneys from the remnants of metabolism.
Desktop Bottom Promotion