For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక రక్తపోటు నివారణకు 10 హెర్బల్ రెమిడీస్

By Super
|

అధిక రక్త పోటు లేదా హైపర్టెన్షన్ అనేది ఒక అంటు వ్యాధిలా ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. మారుతున్న జీవన విధానం, ఫాస్ట్ ఫుడ్ పై ఆధారపడటం, సోడా మరియు ఒత్తిడి వంటివి భారత దేశం లో ని అధిక రక్తపోటు కి కారణాలు. ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరు అధిక రక్త పోటు సమస్య తో బాధపడుతున్నారు. దీని వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు మూత్ర పిండాల సమస్యలు వస్తాయి.

కేవలం ఔషదాల మీద ఆధార పడి అధిక రక్త పోటుని నియంత్రించాలనుకోవడం సాధ్యం కాదు. మార్కెట్ లో ఉన్న నిర్దేశిత ఔషదాల మీదే ఆధారపడకుండా ఆహారం లో కొన్ని జాగ్రత్తలతో ఈ వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు. సాంప్రదాయక ఔషదాల్లో ఈ అధిక రక్త పోటు సమస్యని నివారించడానికి ఎన్నో మూలికలు వాడతారు. అటువంటి మూలికల గురించి తెలుసుకుందాము.

హైపర్టెన్షన్ గురించి మూలికల ద్వారా నివారణలు

హై బిపికి అడ్డుకట్ట వేసే ఉల్లి-వెల్లుల్లి

వెల్లుల్లి - రక్త పోటు స్వల్పంగా పెరిగిన రోగులకి వెల్లుల్లి చక్కగా పని చేస్తుంది. వెల్లుల్లిలో ఉన్న అల్లిసిన్ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ధమనుల కండరాలు విశ్రాంతి పొందేందుకు తోడ్పడుతుంది. అందువల్ల, డయాస్టోలిక్ మరియు సిస్టోలిక్ రక్త పోటులని తగ్గిస్తుంది.

హై బిపికి అడ్డుకట్ట వేసే ఉల్లి-వెల్లుల్లి

కర్పూరవల్లి - కోలాస్ ఫొర్స్కొహ్లీ అనేది కర్పూరవల్లి మొక్క దక్షిణ భారత దేశంలోని ఎన్నో ఇళ్ళల్లో పెరడు మొక్కలాగ పెరిగేది. ధమనుల కండరాలను రిలాక్స్ చేసి తద్వార రక్త పోటుని తగ్గించేందుకు కర్పూవల్లి సహాయ పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. నాడీని తగ్గించి హార్ట్ బీట్ ని దృఢపరచడానికి కూడా ఉపయోగపడుతుంది.

హై బిపికి అడ్డుకట్ట వేసే ఉల్లి-వెల్లుల్లి

ములక్కాడ - హిందీ లో సాహజాన్ అని, తెలుగులో ములక్కాడలని పిలుస్తారు. అధికమైన పోషక విలువలు, విటమిన్లు, మినరల్స్ ములక్కాడ లో లభ్యమవుతాయి. సిస్టోలిక్ అలాగే డయాస్టోలిక్ రక్త పోటుని నియంత్రించడంలో మునగ ఆకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ లాభాన్ని పొందడానికి ములక్కాడలని కాయధాన్యాలతో గాని లేదా పప్పుతో గాని కలిపి వండాలి.

హై బిపికి అడ్డుకట్ట వేసే ఉల్లి-వెల్లుల్లి

ఉసిరి - ఉసిరిలోని ఉన్న గుణం రక్త పోటుని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఉసిరిలో ఉన్నసి విటమిన్ రక్త నాళాలని వెడల్పు చెయ్యడంలో తోడ్పడుతుంది. తద్వారా రక్త పోటుని తగ్గిస్తుండి. మార్కెట్ లో అందుబాటులో ఉన్న త్రిఫల కలయికలో ఒక భాగం ఉసిరి.

హై బిపికి అడ్డుకట్ట వేసే ఉల్లి-వెల్లుల్లి

ముల్లంగి - భారతీయ వంటశాలలో సాధారణంగా అందుబాటులో ఉండే కూరగాయ ముల్లంగి. రక్త పోటుకి వ్యతిరేకంగా పోరాడే శక్తి ముల్లంగికి ఉంది. ముల్లంగిలో అధికంగా ఉండే పొటాసియం అనే మినరలే దీనికి కారణం. సోడియం ఎక్కువున్న ఆహారం వల్ల కలిగే రక్త పోటుని నియంత్రించడంలో ముల్లంగి తోడ్పడుతుంది.

హై బిపికి అడ్డుకట్ట వేసే ఉల్లి-వెల్లుల్లి

నువ్వులు - బియ్యపు పొట్టు నూనెతో కలిపిన నువ్వుల నూనె అధిక రక్త పోటు కలిగిన రోగులకి రక్త పోటుని తగ్గించడంలో కేవలం యాంటి హైపర్టెన్షన్ ఔషదాల కంటే ఎక్కువగా సత్ఫలితాలు చూపెడతాయని ఇటీవలి అధ్యయనాలలో తేలింది.

హై బిపికి అడ్డుకట్ట వేసే ఉల్లి-వెల్లుల్లి

అవిసె గింజ లేదా అల్సి ఫ్లాక్ష్ సీడ్ లేదా లిన్సీడ్ లో ఒమేగా - 3 ఫాటీ ఆసిడ్స్ లో ఒకటైన ఆల్ఫా లినోలెనిక్ పుష్కలంగా ఉంటుంది. అధిక రక్త పోటుతో బాధ పడే రోగులు ఈ అవిసె గింజలను తమ ఆహారం లో భాగం గా చేసుకున్నప్పటినుండి వారి కొవ్వు శాతం తగ్గి మరియు రక్త పోటు తగ్గడం ప్రారంభమయిందని ఎన్నో అధ్యనాలలో తెలిసింది.

హై బిపికి అడ్డుకట్ట వేసే ఉల్లి-వెల్లుల్లి

యాలకులు - ఇండియన్ జర్నల్ ఆఫ్ బయో కెమిస్ట్రీ అండ్ బయో ఫిజిక్స్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, మౌలిక హైపర్ టెన్షన్ డయాగ్నోసిస్ లో భాగంగా, 20 మంది రోగులకి మూడు గ్రాముల ఏలకుల పొడి ని ఇచ్చారు. మూడు నెలల కాలపరిమితి తరువాత, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ రోగులందరూ సంతోషంగా ఉన్నట్టు తమ అనుభవాలని వ్యక్తపరిచారు. అంతే కాకుండా, వారిలో రక్త పోటు గణనీయంగా తగ్గినట్టు నిరూపితమైంది. బ్లడ్ లిపిడ్స్ ని అలాగే ఫిబ్రినోగెన్ స్థాయిలని మార్చకుండా రక్తం గడ్డ కట్టడాన్ని విడగొట్టడం లో యాంటి ఆక్సిడంట్ స్థాయిలని మెరుగుపరచడంలో ఏలకులు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

హై బిపికి అడ్డుకట్ట వేసే ఉల్లి-వెల్లుల్లి

ఉల్లిపాయలు - గుండె జబ్బులు, స్ట్రోక్ ని ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటి ఆక్సిడంట్ ఫ్లవొనల్ అరికట్టడం లో తోడ్పడుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

హై బిపికి అడ్డుకట్ట వేసే ఉల్లి-వెల్లుల్లి

దాల్చిన చెక్క - గుండె జబ్బుని అరికట్టడంలోనే కాదు, మధుమేహం వ్యాధిని నియంత్రించడంలో కూడా దాల్చిన చెక్క ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒహియో లో ఉన్న ది సెంటర్ ఫర్ అప్లైడ్ హెల్త్ సైన్సెస్ 22 సబ్జెక్ట్స్(రోగులు) పైన అధ్యయనం చేసారు. ఆ అధ్యయనంలో భాగంగా అందులో సగం మందికి ప్రతి రోజు నీటిలో కరిగిపోగల 250 ఎం జి ల దాల్చిన చెక్కని అందించగా మిగతా సగం మందికి ప్లసేబో(ప్రభావం లేని మందు) ని అందించారు. దాల్చిన చెక్కని సేవించిన వారిలో 13 నుండి 23 శాతం వరకు రక్త పోటుని నియంత్రించగలిగే యాంటి ఆక్సిడంట్లు పెరిగినట్టు గమనించారు.

English summary

10 Herbal remedies for High BP | హై బిపికి అడ్డుకట్ట వేసే ఉల్లి-వెల్లుల్లి

High blood pressure or hypertension is an epidemic that is currently sweeping across the world. The fast lifestyle of fast food, soda and stress is starting to catch up on the average India, so much so that an estimated one in every three Indians has high blood pressure.
Desktop Bottom Promotion