For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పైల్స్ (మొలలు)నివారణకు ఈ సూపర్ ఫుడ్స్ తినండి, సమస్య నుండి తక్షణ ఉపశమనం

|

హెమరాయిడ్స్ లేదా పైల్స్ అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధరణమైన అనారోగ్యపు సమస్యగా మారింది. అందుకు కారణం ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు వల్ల అనేక రకాలైన అనారోగ్యాల భారీన పడుతున్నారు.

అధిక బరువు, తలనొప్పి, బ్యాక్ పెయిన్ వంటి సాధారణ సమస్యలతో పాటు మరొకటి పైల్స్. సాధారణంగా ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాదే అయినప్పటికి.. జీవన శైలిలో మార్పుల వల్ల పైల్స్ ఏర్పడుతున్నాయి.

10 Home Remedies To Cure Piles

హెమరాయిడ్స్‌ని సామాన్య పరిభాషలో పైల్స్ అంటారు. మనం తెలుగులో వీటిని మొలలు అని అంటాం. ఇది సర్వసాధారణమైన సమస్య. కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారికి తరచుగా వచ్చే సమప్య పైల్స్‌. అందుకు కారణం సరియైనా ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి వాటితోనే ఈ సమస్య ఏర్పడుతుంది. నీరు తక్కువగా త్రాగడం, మద్యం అతిగా సేవించుటం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు అతిగా తినడం, మాంసాహరం తరుచుగా తినటం- వీటన్నింటి వలన పైల్స్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

లక్షణాలు: మల విసర్జన సాఫీగా జరుగదు. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, మంట వుంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతుంది. మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి మంట రెండు గంటల వరకు ఉంటుంది. విరోచనం కాకపోవడం వీరికి బాధ కలిగిస్తుంది. సుఖ విరోచనం కాకపోవడంతో చిరాకుగా కోపంగా ఉంటారు. మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్‌) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి. ఒకసారి వస్తే చాలాకాలంపాటు వేధించే సమస్య ఇది. ముఖ్యంగా జీవనశైలి, ఆహారం, కూర్చుని చేసే ఉద్యోగం- ఈ వ్యాధికి కారణం అవుతాయి. మనుషులు చురుకుగా ఉండలేరు. ఎక్కడికంటే అక్కడికి ప్రయాణాలు చేయలేరు. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.

పైల్స్/మొలలునివారణకు 10 పవర్ ఫుడ్స్...

ముల్లంగి రసం : పైల్స్ కు ఒక గ్లాసు ముల్లంగి రసం చాలా అద్భుతంగా చేస్తుంది. ముందుగా 1/4కప్పుతో ప్రారంభించి, రోజు రోజుకూ అరకప్పు రసంను పెంచుకుంటూ పోవాలి.

పైల్స్/మొలలునివారణకు 10 పవర్ ఫుడ్స్...

దానిమ్మ: హెమరాయిడ్స్ కు మరో చక్కటి హోరెమడీ ఎర్రని పండ్ల తొక్క బాగా సహాయపడుతుంది. కొన్ని నీళ్ళలో దానిమ్మ తొక్కను వేసి బాగా ఉడికించి, వడగట్టి రోజుకు ఒకటి రెండు సార్లు తాగుతుండాలి.

పైల్స్/మొలలునివారణకు 10 పవర్ ఫుడ్స్...

అల్లం -నిమ్మరసం జ్యూస్: పైల్స్ కు డీహైడ్రేషన్ కూడా ఒక ప్రధానకారణం. అందువల్ల అల్లం, నిమ్మరసం, తేనె కలిపిన జ్యూస్ ను ప్రతి రోజూ రెండు సార్లు తాగాలి.

పైల్స్/మొలలునివారణకు 10 పవర్ ఫుడ్స్...

ఫిగ్(అంజీర పండు): అంజీర పండు రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే మలబద్ధకం పోయి పైల్స్ వ్యాధి నయమైపోతుంది. ఆ నీటిని సగభాగం ఉదయం, సగభాగం సాయంత్రం తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

పైల్స్/మొలలునివారణకు 10 పవర్ ఫుడ్స్...

పచ్చి ఉల్లిపాయ: పైల్స్, మలంలో రక్తం పడటం వంటి సమస్యలను నివారించడానికి పచ్చి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల రక్తం పడటాన్ని తగ్గించి అనల్ పెయిన్ ను తగ్గిస్తుంది.

పైల్స్/మొలలునివారణకు 10 పవర్ ఫుడ్స్...

టాయిలెట్ పొజిషన్: టాయిలెట్ పొజిషన్ సరిగ్గా ఉండాలి. కూర్చొనే విధానం కరెక్ట్ గా ఉన్నప్పుడు. ఇబ్బంది పడనవసరం లేదు. టాయిలెట్ స్టెప్ మీద కరెక్ట్ గా కాలు(పాదాలు)పెట్టి కూర్చొని ముందుగా వంగడం వల్ల రెక్టమ్ మీద ప్రెజర్ తగ్గుతుంది.

పైల్స్/మొలలునివారణకు 10 పవర్ ఫుడ్స్...

వ్యాయామం: మలబద్దకం నివారించడానికి మరియు శరరంలో క్రమంగా రక్త ప్రసరణ జరగడానికి రెగ్యులర్ వ్యాయామం బాగా సహాయపడుతుంది. అతిగా వ్యాయామం చేయడం లేదా ఎక్కువ బరువులను మోయడం వల్ల కూడా హెమరాయిడ్స్ అధికంగా కావచ్చు. కాబట్టి సాధారణ వ్యాయమం మరియు వాకింగ్ వంటివి అలవాటు చేసుకోండి.

పైల్స్/మొలలునివారణకు 10 పవర్ ఫుడ్స్...

పసుపు: పసుపుల అనేక వైద్య లక్షణాలు కలిగి ఉంది. మీరు సహజంగా పైల్స్ ను నివారించాలనుకుంటే పసుపుకొమ్మ లేదా పసుపును నీటిలో వేసి ఆ నీటిని బాగా తాగాలి.

పైల్స్/మొలలునివారణకు 10 పవర్ ఫుడ్స్...

అరటి పండు అరటి పండు: అరటిపండు తింటే మలబద్ధకం నివారిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా ప్రతి భోజనం తర్వాత అరటిపండు తినండి.

పైల్స్/మొలలునివారణకు 10 పవర్ ఫుడ్స్...

సోయా బీన్స్ సోయా బీన్స్: బఠాణీ జాతి అయిన బీన్స్, కిడ్నీ బీన్స్, సోయా బీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా వుండే కాయ ధాన్యాలు పైల్స్ రోగులకు మంచివి. ఇవి తేలికగా జీర్ణమై పేగులు శుభ్రపడేలా చేస్తాయి.

జాగ్రత్తలు : పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4నుండి 5లీటర్లు). ప్రతిరోజు వ్యాయామం చేయాలి. రోజూ మల విసర్జన సాఫీగా జరుగునట్లుగా చూసుకోవాలి. మద్యం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు, మాంసాహరం, చిరుతిళ్లు మానేయాలి. మానసిక ఒత్తిడి నివారణకు బాగా వివ్రాంతి తీసుకోవడం, నిత్యం యోగా, మెడిటేషన్‌ చేయాలి.

ఫైల్స్ సమస్య నుండి బయట పడాలంటే చాలా పద్దతులే ఉన్నాయి. అయితే అవి వారి వారి ఆరోగ్య స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి డాక్టర్ ను సంప్రధించి మెడిసిన్ తీసుకోవల్సి ఉంటుంది. అంతే కాకుండా కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా సహజ పద్దతుల్లో పైల్స్ ను నివారించుకోవచ్చు. ఉదాహరణకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణం అయ్యి, పాసేజ్ ను సులభతరం చేస్తుంది. అందుకు ఫైబర్ అధికంగా ఉండే లెగ్యూమ్, అరటి, సిట్రస్ మరియు ఫింగ్ వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. దాంతో పైల్స్ ను నివారించవచ్చు. పైల్స్ ను నివారించే ఆహారాలు తినడంతో పాటు మరికొన్ని హోం రెమడీస్ పైల్స్ సమస్య నుండి బయటపడేలా చేస్తుంది మరి అవేంటో చూద్దాం.....

English summary

Best Home Remedies To Cure Piles in Telugu

Haemorrhoids or piles is a very common health problem these days. Haemorrhoids are the swollen and inflamed veins inside or outside the lower portion of the anus. Haemorrhoids basically comprises of anal pain (during and after passing stool), anal itching and anal bleeding.
Desktop Bottom Promotion