Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
చికెన్ తింటే ఆరోగ్యానికి ఒకటి కాదు-రెండుకాదు 11 లాభాలు!
సాధారణంగా శాకాహారులు, నాన్ వెజిటేరియన్ వంటలను రుచి చూడాలంటే మొదటి చికెన్ తో మొదలు పెడుతారు. చికెన్ మొదటి సారి రుచిచూసేవారికి సురక్షితం మాత్రమే కాదు, చికెన్ తినడం వల్ల ఆరోగ్యం కూడా. చికెన్ వండే విధానం మీదే కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆధారపడి ఉంది. ఫ్రైడ్ చికెన్ లో కంటే ఉడికించిన చికెన్ లో చాలా రకలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
చికెన్ తయారు చేయడమే కాదు, దాన్ని తీసుకురావడంలో కూడా జాగ్రత్తలు వహించాలి. తాజా చికెన్ మాత్రమే కొనుగోలు చేయాలి. అప్పుడే ఆరోగ్యానికి మంచిది. నిల్వ చేసిన చికెన్ ఘనీభవించి ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే తాజా చికెన్ లో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు నిల్వ ఉంటాయి. మరి మాంసాహారంతో కూడా మంచి ఆరోగ్యాన్ని పొందడానికి చికెన్ నుండి లభ్యం అయ్యే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి కొన్ని తెలుసుకుందాం....

కండర పుష్టి కోసం: కండర పుష్టి పొందడానికి ఉడికించిన చికెన్ ను తమ ఆహారంలో చేర్చుకోవాలి. అందులోనూ గ్రిల్డ్ చికెన్ లేదా ఉడికించిన చికెన్ ను తీసుకోవాలి. చికెన్ లో ఉండే ప్రోటీనులు తగినంత శక్తినిచ్చి, శరీరంలోని నొప్పుల నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది.

ఆకలిని పెంచుతుంది: ఒక్కో సందర్భలో ఆకలి వేస్తుంది. మరో సందర్భంలో ఆకలి ఉండదు ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. చికెన్ తింటే జీర్ణక్రియను పెంచి ఆకలిని పెంచుతుంది.

ఎముకల బలానికి: చికెన్ లో ఉండే క్యాల్షియం, పాస్పరస్ వంటివి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది చాలా సన్నగా, పీలగ ఉన్న వారికి తగినంత బలాన్ని చేకూర్చుతుంది. కాబట్టి అటువంటి వారు చికెన్ సూప్ ప్రతి రోజూ తీసుకోవచ్చు.

గుండె ఆరోగ్యానికి: చికెన్ కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. అయినా కూడా దాంట్లో నియాసిన్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవల్ ను తగ్గిస్తుంది. కాబట్టి చికెన్ ఆయిల్ వేయకుండా వండి తినడం వల్ల గుండెకు కూడా ఆరోగ్యకరం.

రోగనిరోధకశక్తి పెంచుతుంది: చికెన్ లో చాలా రకాల పోషకాంశాలు ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. పెప్పర్ సూప్ లో ఉడికించిన చికెన్ ను తీసుకోవడం వల్ల జలుబుకు తక్షణ ఉపశమనమిస్తుంది.

పిల్లల పెరుగుదలకు: పెరిగే పిల్లలకు చికెన్ బూస్ట్ వంటింది. చికెన్ లో అధికమైన అమినోఆసిడ్స్ పిల్లలు పొడవుగా మరియు శక్తివంతంగా పెరగడానికి బాగా సహాయపడుతుంది.

కీళ్ళ నొప్పుల నివారణకు: చికెన్ లో మినిరల్స్ గా పిలుచుకొనే ఒక పోషకాంశం సెలీనియం అధికంగా ఉండటం వల్ల కీళ్ళనొప్పులను రాకుండా అడ్డుకుంటుంది.

ఒత్తిడి నుండి ఉపశమనం: చికెన్ లో విటమిన్ బి5 లేదా పాంటోథెనిక్ ఆమ్లం వంటివి ఒత్తిడిని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. అందుకే మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఓ మంచి గ్రిల్డ్ చికెన్ లాగించేయండి.

గుండె సంబంధిత సమస్యలు: చికెన్ గుండెనొప్పి, గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ హోమోసిస్టీన్ స్థాయిలు తగ్గిస్తుంది. మీకు హోమోసిస్టీన్ ఉంటే గుండె నొప్పికి కారణమవుతుంది.

రుతుక్రమ సమస్యలు మరియు మానసిక ఒత్తిడి: రుతుక్రమ సమస్యలు మరియు మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. రుతుక్రమ సమయంలో చికెన్ తింటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

టెస్టోస్టెరాన్: చికెన్ వల్ల పురుషులకు ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే చికెన్ లో జింక్ అధికంగా ఉండటం వల్ల టెస్టోస్టెరాన్(పురుష హార్మోన్)స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications