For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఆరోగ్యకరమైన ఆహారాలు, అనారోగ్యం పొందడానికా?

By Super
|

ఆహారం తీసుకొనే విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ద తీసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో బిజీ షెడ్యుల్ తో ప్రీప్యాకేజ్డ్(ముందుగా ప్యాక్ చేసిన) మరియు ప్రాసెస్ చేసిన ఆహారాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. కానీ, ప్రస్తుతానికి మీరు సౌకర్యవంతంగా భావించి సంత్రుప్తి పడ్డా, వాటివల్ల కలిగే ఆరోగ్య లాభాలు, నష్టాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటి వల్ల మీరు పొందే న్యూట్రీషియన్ విలువలను ఎంత వరకూ శరీరానికి అందుతున్నాయో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇటువంటి ప్రీప్యాకేజ్డ్ మరియు ప్రాసెస్డ్ ఆహారాలకు దూరంగా ఉండటం మరియు సురక్షితంగా ఉండటానికి భైతికంగా మరియు ఆర్థికంగా ఇది ఒక మంచి సమయం. కాబట్టిక అటువంటి 12 ఆహారాలు మీ గ్రాసరీ లిస్ట్ నుండి తప్పకుండా మినహాయించాల్సినవి ఉన్నాయి.

మల్టీ గ్రెయిన్ అట్లా(Multigrain atta):

మల్టీ గ్రెయిన్ అట్లా(Multigrain atta):

మల్టీ గ్రెయిన్ (వివిధ రకాల ధాన్యాలతో)తయారు చేసి పిండి మార్కెట్లో రకరకాల ప్యాక్ లలో అందుబాటులో ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యానికి గోధుమ జాబితాలో మొదటిది మరియు ప్రధాన అంశంగా ప్యాకెట్ మీద ప్రింట్ చేసి పదార్థాలను లిస్ట్ ను చదవాలి. లేకపోతే, సాధారణ గోధుమ పిండికి ఏవో కొన్ని సాధరాణ పిండిని మిక్స్ చేసినవి తెచ్చుకొన్నకా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇటువంటి మల్టీ గ్రెయిన్ ఆహారాలను మార్కెట్లో కొని తెచ్చుకోవడం కంటే ఇంట్లో స్వంతంగా తయారు చేసుకోవడం సులభం మరియు చాలా తక్కువ ఖర్చుకూడా. దాంతో మీరు నాణ్యమైన పదార్థాలను తీసుకొగలుగుతున్నారన్న హామీ మీకు ఉంటుంది.

సోయా పాలు మరియు సోయా ప్రత్యామ్నాయాలు:

సోయా పాలు మరియు సోయా ప్రత్యామ్నాయాలు:

సోయా పాలు లేదా సోయా ఉత్పత్తులను నాన్ ఆర్గానిక్ పదార్థాలని చాలా మందికి తెలియవు. మరియు వీటిని జన్యుపరంగా మార్పు చేసినవి అనికూడా తెలియదు. ఇంకా సోయా ఉత్పత్తులకు అలవాటు పడ్డవారు కెమికల్స్ తో ప్రొసెస్ చేయబడని టాక్సిక్ వీటిని హెక్సేన్ అనే రసాయనం ఉపయోగించి ప్రొసెస్ చేయబడ్డాయని తెలియదు. వీటి వల్ల పునరుత్పత్తి సమస్యలు మరియు పుట్టుకలతో లోపాలు దారితీస్తుంది. మీరు ఆరోగ్యకరమైన డైరీ ప్రొడక్ట్స్ ను కానీ పాల ఎంపిక కోసం చూస్తున్నట్లైతే ఇంట్లో బాగా కాచి వెన్నతీసిన పాలు ఉత్తమం.

కృత్రిమ స్వీటెనర్స్:

కృత్రిమ స్వీటెనర్స్:

కృత్రిమ స్వీటెనర్లు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలుసుకున్నాయి మీరు నిర్ఘాంతి చెందుతారు. ఎందుకంటే పంచదారకు ప్రత్యామ్నాయంగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హానీ జరగదని అనుకుంటారు. కానీ, ఆర్టిఫిషియల్ స్వీట్స్ లో చెక్కరకు ప్రత్యామ్నాయంగా అస్పర్టమే లేదా sucralose ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి హాని తలపెడుతుంది. కాబట్టి, పంచదారను పూర్తి నివారించడం ఉత్తమమైన మార్గం. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ నరాల నష్టంను మరియు జీర్ణాశయాంతర మరియు ఎండోక్రెన్ సరిగా పనిచేయకుండా చేస్తుంది.

ఐస్ టీ మిక్స్:

ఐస్ టీ మిక్స్:

పౌడర్ ఐస్ మిక్స్ ఇది ఆరోగ్యానికి అనారోగ్యకరమైనది. కోలాలో కంటే ఇందులో ఎక్కువగా పంచదారతో నిండి ఉంటుంది. ఈ మిశ్రమంలో శరీరానికి ఏవి మంచివి కావో, అవి అధిక ఫ్రక్టోస్ కలిగిన కార్న్ సిరప్, ప్రొసెస్డ్ షుగర్ మరియు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ను కలిగి ఉంటుంది. కాబట్టి, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, డబ్బు ఖర్చుపెట్టడం కంటే ఫ్రెష్ జ్యూస్ ను ఇంట్లో తయారు చేసుకోవడం మంచిది. షుగర్ వేసి లేదా షుగర్ వేయకుండా రిఫ్రిజరేటర్ లో పెట్టుకోవడం ఒక మంచి మార్గం.

వెన్న:

వెన్న:

మీరు వెన్నను వినియోగిస్తున్నట్లైతే, ఇది ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. వెన్నలో హైడ్రోజెనేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్ ఆయిల్, ఏదైనా కానీ ఇది మీ శరీరానికి ఆరోగ్యకరమైనది . ఇది కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది మరియు మీ శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థ యొక్క ప్రతిస్పందన తగ్గిస్తుంది. కాబట్టి ప్రొసెస్ చేసిన ఆహారాలను నివారించండి.

సీజన్ కానీ పండ్లు మరియు కూరగాయలు:

సీజన్ కానీ పండ్లు మరియు కూరగాయలు:

నాన్ సీజనల్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ చూస్తే మనకు వెంటనే ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి సమయంలో వెంటనే మీ మనస్సులో నాన్ సీజనల్ ప్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ఆరోగ్యకరమా? అని అనిపిస్తుంది. వాటిని కృత్రిమంగా పండించి ఉంటారు లేదా జన్యుపరంగా సాంకేతికమైనవి. అందువల్ల, మీరు ఎంపిక చేసుకొనే నాన్ సీజనల్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ మీద సురక్షితమైన ఎంపిక అవసరం.

క్యాన్డ్ ఫుడ్స్:

క్యాన్డ్ ఫుడ్స్:

డబ్బాలలో నిల్వ చేసిన ఆహారాల్లో హార్మోన్ అంతరాయం కలిగించే హై లెవల్ బిస్పినాల్ ఏ(బిపిఏ) కలిగి ఉంది. హై లెవల్ బిపిఏ ఆహారాలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పునరుత్పత్తి సమస్యలు, మరియు రొమ్ముక్యాన్సర్, మొదలగు అనారోగ్యాలతో కూడా కారణం అవుతుంది. కనుక అన్ని రకాల ఆహార ఉత్పత్తులు, డబ్బాల్లో నివ్వ చేసిన వాటిని నివారించడం ఉత్తమం.

మైక్రో వోవెన్ లో తయారు చేసిన పాప్ కార్న్:

మైక్రో వోవెన్ లో తయారు చేసిన పాప్ కార్న్:

మైక్రోవోవెన్ లో పాప్ కార్న్ తయారు చేస్తున్నప్పుడు చిటపట శబ్దాలు చూడటానికి అందంగా ఉంటుంది.కానీ మైక్రోవోవెన్ సైడ్ లో అక్కడక్కడ పడిపోతాయి. ఇవి మిక్కిలి జన్యుపరమైనవి. ప్రొసెస్డ్ సాల్ట్ మరియు వివిధ రకాల ఫ్లేవర్స్ తో నింపిన ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. మైక్రోవోవెన్ పాప్ కార్న్ లో అధిక సోడియం మరియు డీఅసిటైల్ ఉండి ఆరోగ్యానికి హాని తలపెడుతాయి.

టెట్రా ప్యాక్ లో పళ్ళ రసాలు:

టెట్రా ప్యాక్ లో పళ్ళ రసాలు:

టెట్రా ప్యాక్ లో పళ్ళ రసాలు అధనపు రుచికికోసం అధిక షుగర్ మరియు ప్రిజర్వేటివ్స్ అధనంగా కలపబడుతుంది. ఇటువంటి ప్రిజర్వేటివ్ లేస్డ్ జ్యూస్ తాగడం కంటే, తాజా పండ్లతో తాయరు చేసి జ్యూసులకు అధిక ప్రధాన్యం ఇవ్వడం మంచిది. అందువల్ల మీరు మీ శరీరానికి కావల్సిన ఫైబర్ ను పొందగలుగుతారు.

ఫ్రోజెన్ మీట్ కొనుగోలు:

ఫ్రోజెన్ మీట్ కొనుగోలు:

ఘనీభవించిన బర్గెర్ పట్టీస్ లేదా మీట్ బాల్స్ మీ కిచెన్ వర్క్ ను తగ్గించవచ్చు. కానీ అవి మీ శరీరంలో మరికొంత అదనపు క్యాలరీలు, ఫ్యాట్ ను పెంచవచ్చు. వీటిని తయారు చేసే వారు ఫ్రోజెన్ మీల్స్ ను హైడ్రోజెనేటెడ్ ఆయిల్స్, ప్రిజర్వేటివ్స్ మరియు ఇతర ఆర్టిఫిషియల్ పదార్థాలతో తయారు చేస్తారు. కాబట్టి తాజా మాంసాహారానికి ఎక్కువ ప్రాధన్యత ఎందుకు ఇవ్వకూడదు. తాజా మాంసాహారాన్ని తీసుకొని రిఫ్రిజరేటర్ లో నిల్వ చేసుకోవచ్చు.

ఎనర్జీ డ్రింక్స్:

ఎనర్జీ డ్రింక్స్:

ఎనర్జీ డ్రింక్స్ లో ఎక్కువగా కెఫిన్ మిక్స్ చేసి ఉంటుంది. మరియు మీ శరీరానికి హాని తలపెట్టే షుగర్ స్థాయిలను ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఉదయం మీరు ఒక కప్పు కాఫీ తాజాగా ఇంట్లో తయారు చేసుకొనే వాటిని తాగడం మంచిది. ఇది షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా చెక్కర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.

ప్యాక్ చేసిన డ్రింకింగ్ వాటర్:

ప్యాక్ చేసిన డ్రింకింగ్ వాటర్:

తాగడానికి కొనుగోలు చేసే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యంగా కనిపించడానికి బాటిల్ ను ఉపయోగిస్తారు. ఈ బాటిల్ తయారు చేయడానికి కొన్ని రసాయనాలు (బిపిఏ మరియు ఫాతలేట్స్)ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి హానికరంగా ఉన్నాయి. వీటి వల్ల ఊబకాయం, మెదడుడ్యామేజ్ హైపరాక్టివిటి మరియు పునరుత్పత్తి సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి మీరు నెక్ట్స్ టైమ్ బాటిల్ వాటర్ ను కొనే ముందు పరిస్థితులను బట్టి, ఆరోగ్యానికి నష్టం కలగకుండా విధంగా తెలుసుకొని మీర కొనాలి.

English summary

12 Health Foods that You Should Never Eat Again

In the age of quick fix meals, we have become increasingly dependent on pre-packaged and processed foods. While you may feel settled with the convenience and health benefits such foods offer, what you fail to evaluate is their overall nutritive value. It is high time you say no to these foods and stay safe, both physically and financially.
Desktop Bottom Promotion