For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు ప్రకాశవంతంగా మెరవాలంటే ఈ నేచురల్ ఆయిల్సే బెస్ట్

|

జుట్టు అందంగా, ఆరోగ్యంగా మరియు మంచి షైనింగ్ తో మెరుస్తుండేందుకు ఖర్చుతో కూడిన హెయిర్ ట్రీట్మెంట్ ఎంత మంది చేసుకొని ఉంటారు? మనందరం కోరుకొనేది మన కేశాలు ఆరోగ్యంగా, మంచి షైనింగ్ తో నిగనిగలాడేలా ఉండాలని కోరుకుంటాం. అందుకోసం ఖరీదైన హెయిర్ ప్రోడక్ట్స్ మరియు హెయిర్ ట్రీట్మెంట్స్ ను ప్రయత్నించి ఉంటాం. కానీ మీరు, అందమైన మరియు ప్రకాశవంతమైన జుట్టు పొందడానికి నేచురల్ ఆయిల్స్ ను మీ జుట్టుకు అప్లై చేశారా? ఉపయోగించకపోతే, సహజ నూనెలు ఉపయోగించండి . మీ జుట్టుకు ఈ సహజ నూనెలను అప్లై చేయడం వల్ల మీ జుట్టుకు అద్భుతాలు జరగవచ్చు, మీరు ఖచ్చితంగా మీ జుట్టులో మార్పును గమనిస్తారు. పుష్కలమైనటువంటి జుట్టు పెరుగుదల కోసం, తగినంత పోషకాలను అందించేందుకు మరియు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి వివిధ రకాల సహజ నూనెలు ఉన్నాయి.

అందుకు మీకు అవసరం అయ్యే మరియు మీకు అందుబాటులో ఉండే సహజసిద్దమైన నూనెలను మీ జుట్టుకు ఉపయోగించాలి. మీ జుట్టును ప్రకాశవంతంగా చేయడానికి అనేక రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు: అవొకాడో ఆయిల్, కొబ్బరి నూనె, ఆముదం, బాదం ఆయిల్, లావెండర్ ఆయిల్, రోజ్మెరీ ఆయిల్ మొదలగు నూనెలన్నీ కూడా చాలా పాపుర్ హెయిర్ ఆయిల్స్. ఈ నేచురల్ ఆయిల్స్ అన్నీ మీ జుట్టు పెరుగుదలకు మాత్రమే కాదు, మీ జుట్టును చూసి ఎవరైనా సరే అసూయ పడేలా నునుపైన కేశ సౌందర్యాన్ని అందిస్తాయి.

ఈ నేచురల్ హెయిర్ ఆయిల్స్ ను వారానికొకసారి లేదా రెండు సార్లు తలకు మసాజ్ చేయాలి. లేదా ఈ నూనెలతో హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు. మరి మీరు ప్రకాశవంతమైన జుట్టు పొందడానికి ఉపయోగపడే నేచురల్ ఆయిల్స్ ఏంటో ఈ క్రింది విధంగా ఉన్నాయి. వాటిని పరిశీలించండి...

అవొకాడో ఆయిల్:

అవొకాడో ఆయిల్:

నేచురల్ గానే జుట్టు ప్రకాశవంతమైనదిగా పొందడానికి, ఇది ఒక గ్రేట్ నేచురల్ ఆయిల్. అవొకాడో-కొబ్బరినూనె-రోజ్మెరీ ఆయిల్ మాస్క్ ను వేసుకోవడం వల్ల కేశాలు ప్రకాశవంతంగా ఉంటాయి. అందుకు ఒక టేబుల్ స్పూన్ అవొకాడో ఆయిల్ మరియు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె , 10-20చుక్కల రోజ్మెరీ ఆయిల్ ను మిక్స్ చేసి మూడూ బాగా కలిసేలా కలగలిపి తలకు పట్టించి, అరగంట అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి.

క్యాస్ట్రోఆయిల్(ఆముదం):

క్యాస్ట్రోఆయిల్(ఆముదం):

ఆముదంను గోరువెచ్చగా వేడి చేసి, ఈ నూనెతో తలను మసాజ్ చేయాలి. తర్వాత వెచ్చని నీటిలో ముంచిన కాటన్ టవల్ ను తలకు 20నిముషాల పాటు చుట్టుకోవాలి. 20నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఆముదంను రెగ్యులర్ గా మీరు ఉపయోగించినట్లైతే తప్పకుండా మీరు మందపాటి, నునుపైన, ప్రకాశవంతమైన జుట్టును పొందుతారు .

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె పొడి జుట్టును, నిర్జీవమైన జుట్టును నిర్మూలించడానికి మరియు చుండ్రును నివారించడానికి, హెయిర్ డ్యామేజ్ అరికట్టడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి కొబ్బరి నూనెతో ప్రతి రోజూ తలకు మసాజ్ చేయాలి. దాంతో మీ కేశాలు మెరుస్తూ, ప్రకాశవంతంగా ఉంటాయి. మందపాటి కేశాలు, మెరిసేలా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలను రెగ్యులర్ గా పాటించండి. మరియు ఈ నూనె మీకు అందుబాటులో ఉండి, అతి సులభంగా దొరికే నూనె.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ (గాడ్ మదర్ ఆఫ్ హెయిర్' గా భావిస్తారు మరియు ఇది జుట్టు సంరక్షణలో అద్భుతాలను స్రుష్టిస్తుంది. ఇది జుట్టుకు అవసరం అయ్యే తేమను, పోషకాలను అధిస్తుంది మరియు లోతైన కండీషనర్ గాను ఉపయోగపడుతుంది. ఇంకా ఇది కేశాలకు బలాన్ని అధిస్తుంది మరియు చుండ్రును నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ కు కొద్దిగా తేనె మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి.

రోజ్మెరీ ఆయిల్ :

రోజ్మెరీ ఆయిల్ :

రోజ్మెరీ ఆయిల్లో ఐరన్, క్యాల్షియం మరియు విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి . ఇవి జుట్టు పొడవుగా మరియు బలంగా పెరిగేలా చేస్తాయి. ఇది హెయిర్ ఫోలిసెల్స్ ను ఉద్దీపన చేసి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మరియు గ్రే హెయిర్ ను నిరోధిస్తుంది. మరియు జుట్టు మంచి మెరుపును మరియు నునుపుదనాన్ని పొండానికి సహాయపడుతుంది.

బాదాం ఆయిల్:

బాదాం ఆయిల్:

జుట్టుకు బాదాం ఆయిల్ చాలా ఉపయోగకరమైన నూనె. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ మరియు మంచి కొవ్వులను కలిగి ఉన్నది. ఇది మీ జుట్టుకు కావల్సిన మెరుపును, నునుదనాన్ని మరియు ఆరోగ్యకరమైనవిగా చేస్తుంది. ఈ నూనె యొక్క గొప్పదనం ఈ నూనెను వేరే ఇతర నేచురల్ ఆయిల్స్ తో మిక్స్ చేసి, హెయిర్ మాస్క్ గా వేసుకోవచ్చు.

ల్యావెండర్ ఆయిల్:

ల్యావెండర్ ఆయిల్:

మీ జుట్టుకు చాలా అవసరం అయ్యే నూనె, ల్యావెండర్ ఆయిల్. ఇది మీ జుట్టుకు కండీషనర్ గా పనిచేస్తుంది మరియు జుట్టును ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది మరియు చుండ్రును నివారిస్తుంది. ఈ నూనెకు టీట్రీ ఆయిల్ మిక్స్ చేసి హోం మేడ్ హెయిర్ మాస్క్ గా వేసుకోవచ్చు. ఈనూనెను తలకు మసాజ్ చేసి ప్లాస్టిక్ కవర్ చుట్టుకోవాలి . అరగంట తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి.

పెప్పర్ మింట్ ఆయిల్:

పెప్పర్ మింట్ ఆయిల్:

జుట్టు పెరుగుదలకు మరియు జుట్టు ఆరోగ్యానికి ఈ నూనె చాలా అద్భుతమైనది. ఈ నూనె చుండ్రును నిరోధిస్తుంది జుట్టుకు మంచి మెరుపు తీసుకొస్తుంది. మీరు ఉపయోగించే షాంపులో కొద్దిగా ఈ నూనెను మిక్స్ చేయసి రెగ్యులర్ గా ఉపయోగించండి. దాంతో మీ కేశాలకు అందమైన మెరుపు సొంతం అవుతుంది.

English summary

Natural Oils To Get Shiny Hair

How many of you try expensive hair treatments to get shiny, bouncy and lustrous hair? All of us want shiny hair and try really expensive hair products and treatments to get it. Did you ever apply natural oils to get beautiful and lustrous hair? If not, consider using natural oils.
Story first published: Thursday, October 3, 2013, 12:35 [IST]
Desktop Bottom Promotion