For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారిలో సంతానోత్పత్తిని పెంచే 15 సూపర్ పవర్ ఫుడ్స్..!

|

సాధారణంగా కొందరిలో పిల్లలు కలగక పోవడానికి దోషం ఎవరిలో ఉంది? ఒకప్పుడయితే స్త్రీ గర్భం ధరించలేకపోతే దోషం ఆమెదని, ఆమె గొడ్రాలని, ముద్ర వేసేవారు. మగవాడు పరిపూర్ణుడనే అపోహ ఉండేది. అయితే దంపతుల మధ్య నిస్సారతకు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కారణం కావచ్చు, లేదా ఇద్దరూ కారణం కావచ్చు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. దంపతులలో సంతానం కలగకపోవటానికి భార్యాభర్త లిరువురిలోనూ లోపాలుండవచ్చు, వైద్య పరిభాషలో సంతానం కలగకపోవటానికి 40% వరకు ఆడవరిలో లోపాలుండవచ్చు, లేదా 30% వరకు మగవారిలో లోపాలుండవచ్చు, లేదా 20% వరకు ఇద్దరిలో లోపాలుండవచ్చు, లేదా 10% వరకు దంపతులిద్దరిలోనూ చెప్పలేని లేదా కొన్ని తెలియని కారణాలవల్ల కూడా సంతానం కలగకపోవచ్చు.

పూర్వం చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేవారు. అలాగే సంతానం కూడా యుక్త వయసులోనే ఉన్నప్పుడే పొందేవారు. వాళ్లు వృద్ధాప్యంలోకి అడుగు పెట్టకముందే పిల్లలు సెటిల్ అయ్యేటట్లు ప్రణాళికలు ఏర్పాటు చేసుకునేవారు. ప్రస్తుతం సెటిలయ్యాకే పెళ్లి అంటూ లేటు వయసొచ్చే వరకు వివాహానికి ‘నో' చెబుతున్నారు. స్త్రీ, పురుషుల్లో ఇదే వాదన నెలకొంది. కానీ, లేటు వయసులో సంతానం పొందడం, వారి పెంపకం పెద్ద సమస్యేనని పెద్దలు అంటున్నారు. ఇదేదీ నేటి యువత పట్టించుకోవడం లేదు. పైగా, మారిన జీవన విధానమే భార్యాభర్తల బంధంలో ఆగాదాన్ని సృష్టిస్తోంది. కానీ, ఉరుకుల పరుగుల జీవితంలో ఆలిని తృప్తి పర్చడంలో మగాడు విఫలమయ్యే అవకాశాలు కలుగుతున్నాయి. ప్రకృతి సిద్ధంగా లభించిన ఆ సామర్థ్యాన్ని కాలుష్య వాతావరణం నిర్వీర్యం చేస్తోంది. పెళ్లయి భార్యాభర్తలు కలిసి జీవిస్తూ ఏ విధమైన సంతాన నిరోధకాలు వాడకుండా ఉన్నా మొదటి సంవత్సరంలోపు సంతానం కలగనట్లయితే వెంటనే సంతాన సాఫల్యతా నిపుణులను సంప్రదించడం చాలా అవసరం. READ MORE: పిల్లలు కలగాలంటే ఈ ఆహారాలు తప్పక తినాలి

వెల్లులి : ఇది ఆడవారిలో మరియు మగవారిలో ఫెర్టిలిటీ నీ పెంచే సూపర్ ఫుడ్. దీనిలో విటమిన్ బీ 6 ఎక్కువగా ఉంటుంది.

దానిమ్మ : దానిమ్మ గింజలు, రసం స్పెర్ము కౌంట్ ను, వాటి కదలికలను వాటి నాణ్యతను బాగా పెంచుతాయి.

అరటి : మంచి స్పెర్ము పెరగటానికి అపారమైన అన్ని కారకాలు మనం తీనే అరటిలో ఉన్నాయి. దీనిలో బీ 1 ,సి విటమిన్లు ప్రోటీన్ లు లబిస్తాయి. అరటిలో ఉండే బ్రోమోలేయిన్ శక్తి వంతమైన సెక్స్ హర్మోనేగా పనిచేస్తది.

ఆయిల్ ఫిష్: ఓమేగా3 మరియు ఓమేగా6 ఆయిల్ ఫిష్ లో అధికంగా ఉంటాయి. అందుకోసం షెల్ ఫిష్, సాల్మన్, మాక్ రెలే, మరియు సార్డినెస్ వంటివి పురుషుల్లో స్పెర్మె కౌంట్ ను అద్భుతంగా పెంచుతుంది.

పాలకూర : ఫోలిక్ఆసిడ్ ఉంటుంది . ఇది మంచి వీర్య వృదికీ సహకరిస్తాది. పాలకురలో విటమిన్ సి, ఐరన్ కూడా లబిస్తాయి.

మిరపకాయ : చాల మందికి మిరపకాయ గురించి తెలిదు కానీ ఇది ఒక సూపర్ ఫుడ్ అని ఇది మేల్ ఫెర్తిలిటిని పెంచడంలో బాగా సహకరిస్తాది. రోజు గనక మిరపని ఆహారంలో తీంటే ఎన్దోర్ఫిన్లను ఎక్కువ చేస్తాయి. దీని వలన మెదడు బాగా విశ్రాంతి తీసుకుంటది. మిరపలో సి, బీ , ఈ.. విటమిన్లు సమ్రుదిగా లబిస్తాయి.

టమాటో : అత్యంత సాదారణంగా వాడె ఈ కూరగాయలో కెరొటినోయిడ్స్(carotinoids),లైకోపాన్‌(Licopan) చక్కని వీర్య శక్తి , మంచి ఆరోగ్యం ఇస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో ఎదో విదంగా దీనిని బాగం చేసుకోవాలి.

పుచ్చకాయ : దేనిలో సమ్రుదిగా ఉండే లీకోపాస్, నీటి శాతం మగవారి ఫెర్టిలిటీ(male fertility) ని మెరుగుపరుస్తాయి. మంచి స్పెర్ము కౌంట్ ను పెంచుతాయి. మగవారికి తమ శరీరం మంచి గ హైడ్రేషన్‌(hydration) ఉంచుకోవటం కోసం బాగా సహకరిస్తుంది.

సిట్రస్ పండ్లు(విటమిన్ సి) : మేల్ ఫెర్టిలిటీ మెరుగుదలకు ఇది అత్యంత అవసరం. వీర్యంలో DNA ను ఇది కాపాడుతుంది. ఫెర్టిలిటీ విషయంలో వీర్యాని కాపాడుతుంది. కాకపోతే పొగత్రాగడం వలన శరీరం లోని'సి' విటమిన్ హరిస్తుంది. కాబటి పిల్లలు కావాలి అనుకునే వారు పొగత్రాగటం మానివేయాలి.

ఆపిల్ : దీనిలోగల ఎన్నో ప్రయోజనాలు మనకు తెలుసు కానీ మేల్ ఫెర్టిలిటీ నీ పెంచడం గురించి ఎవరికీ తెలిదు. స్పెర్ం కౌంట్ నీ గణనీయంగా పెంచుతుంది.

జీడిపప్పు : బోజనాల్లో జీడిపప్పు తీనడం వలన కడుపు నిండి, బరువును కంట్రోల్ లో ఉంచడమే కాకా జింక్ శాతం పెంచుతుంది జింక్ ఫెర్టిలిటీ నీ మెరుగుపరుస్తాయి.

చేపలు: చేపలు: సీ ఫిష్ లో సాల్మన్, తున మరియు క్యాట్ ఫిష్ వీటిలో విటమిన్ డి మాత్రమే కాదు ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా లభ్యం అవుతాయి.

గుమ్మడి గింజలు: గుమ్మడి గింజల్లో పురుషుల్లోని టెస్టోస్టిరోన్ పెంచడానికి కావల్సినంత జింక్ లభ్యం అవుతుంది. ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి.

ఓస్ట్రెస్: సీఫుడ్స్ లో చేపలు, రొయ్యలు, పీతలే కాకుండా ఇది కూడా ఒక సీ ఫుడ్. ఇందులో అధిక శాతంలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఫెర్టిలిటి స్థాయి పెరుగుతుంది. అంతే కాదు వీటిలో జింక్, సెలీనియం, మ్యాంగనీస్, మరియు కాపర్ అధిక శాతంలో ఉంటుంది.

అవొకాడో: అవొకాడోలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. పెర్టిలిటీని పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్ స్పెర్మ్ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

మగవారిలో సంతాన లేమికి కారణాలు:1. జంక్ ఫుడ్ కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

2. పొగాకు, గుట్కాల్లోని నికోటిన్ వీర్య కణాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తోంది.

3. నైట్ షిఫ్టులు కూడా ఓ కారణమే.

4.అధికంగా సెల్‌ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ కారణంగా నష్టాన్ని చవిచూడాల్సిందే.

5. విలాసవంతమైన జీవితమే మగాడిని తండ్రిని కాకుండా చేస్తోంది.

6. భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవడం, అవకాశం ఉండీ.. సెక్స్‌లో పాల్గొనకపోవడం కూడా పొరపాటే.

7. వాతావరణ కాలుష్యంతోనూ..

8. ఆధునిక యుగం, పాశ్చాత్య నాగరికత పేరుతో ప్లాస్టిక్ వాడకం తీవ్రమైంది. దీని ప్రభావం మనిషిపై అంతా ఇంతా కాదు.

సంతాన లేమికి మగవారిలో ఉండే కారణాలు

9. వీర్యంలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండుటం, వీర్యం ఉత్పత్తిలో లోపం, వీర్యం పని చేయకపోవడం. వీర్యకణాల అండాన్ని ఫలదీకరించే శక్తి తక్కువగా ఉండేందుకు ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు.

10. వీర్య కణాల కదలిక, సారూప్యంలో అధికముగా తేడాలుండుట. వీర్యంలో వీర్య కణాలు లేకపోవటం. వీర్య కణాలు ప్రయాణించే నాళం మూసుకుపోవటం. వీర్యం ఉత్పత్తిలో లేదా పనితీరులో చోటు చేసుకునే అసాధరణత్వాలు.

పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు...!

ఆహారాలు : చక్కని పాపాయి పుట్టాలంటే ఆడవారితో పాటు మగవారు కూడా మంచి ఆహారాలు తీసుకోవాలి. ఆడవారిలో ఫెర్టిలిటీ పెంచే ఆహారాలు ఎలాగైతే ఉన్నాయో మగవారిలో స్పెర్ము కౌంట్ పెంచే ఆహారాలు కూడా ఉన్నాయి.

English summary

15 Super Foods to Improve Male Fertility | పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచే 15 పవర్ ఫుడ్స్...!

Fertility has always been a matter of concern for one and many. To those who shun away from discussing their problems, a word of advice – fertility problems should not be considered a disease. To aid in fertility, people usually resort to medical methods and techniques. What could be better if you can get all your remedies in the food that you eat?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more