Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బరువు తగ్గిన తరువాత బిగుతైన చర్మం కోసం 15 మార్గాలు..
అందమైన శరీర ఆకృతి పొందాలనే తపన ఆడవాళ్ళలో అధికం. అదనపు కొవ్వుని తగ్గించుకుని తద్వారా బరువు తగ్గడం అందమైన శరీర ఆకృతి పొందడానికి మొదటి అడుగు. అంత కష్టపడి బరువు తగ్గిన తరువాత సాగిపోయిన చర్మం ఇబ్బంది పెడుతుంది. ఈ క్రింది విధానాలని పాటించడం ద్వారా అందమైన బిగుతైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

వదులుగా ఉండే చర్మాన్ని స్క్రబ్ చెయ్యండి. ఈ పద్దతి ఏంతో ఉపయోగకరం. స్క్రబ్బింగ్ వల్ల చర్మం లో రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన, బిగుతైన చర్మం కలుగుతుంది. అందువల్ల రోజుకి రెండు లేదా మూడు సార్లు మీ చర్మానికి స్క్రబ్ ని వాడండి.

మసాజ్: బిగుతైన చర్మం కోసం చక్కటి మస్సాజ్ నియమావళిని పాటించాలి.

స్పా: స్పాకి వెళ్లి వాళ్ళు అందించే సర్వీసు ల ని గమనించండి. వ్రాప్స్, మాస్క్స్, కష్టమైజేడ్ బాత్స్ వంటి ప్రత్యేకమైన చికిత్సలు ద్వారా చర్మం బిగుతుగా ఏర్పడుతుంది.

కొన్ని ప్రత్యేకమైన క్రీములని ప్రయత్నించండి: చర్మం బిగుతవ్వడం కోసం కొన్ని క్రీములు మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. మీ డెర్మటాలజిస్ట్ ని కలిసి మీకు ఎటువంటి క్రీం సరిపోతుందో తెలుసుకుని వాడండి.

నీళ్ళు అధికంగా తీసుకోండి: చర్మంలోని తేమ శాతాన్ని పొందుపరచి చర్మం బిగుతుగా ఉండేందుకు నీళ్ళు ఉపయోగపడతాయి.

పళ్ళు, కూరగాయలు అధికంగా తీసుకోండి: రోజుకి 4 లేదా 5 సార్లు ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. త్వరగా మీ చర్మం ఇదివరకటి మెరుపుని సంతరించుకుంటుంది.

సూర్యుడి నుండి దూరం గా ఉండండి: సంస్క్రీన్స్ వాడండి. ఎండ నుండి రక్షణ పొందండి.

సోప్స్, షాంపూలు, బాడీ వాష్ మొదలగు వాటిలో సల్ఫేట్లు లేనివి ఎంచుకోండి: సల్ఫేట్స్ వల్ల చర్మం పొడిగా తయారవుతుంది. బిగుతైన చర్మం కోసం ప్రయత్నించేవారు సల్ఫేట్లు కలిగిన ఉత్పత్తులకి దూరం గా ఉండాలి. మార్కెట్ లో సల్ఫేట్ లేని ఉత్పత్తులు ఎన్నో అందుబాటులో ఉంటాయి. అవి వాడండి.

వేడి వేడి నీళ్ళతో స్నానానికి గుడ్ బాయ్ చెప్పండి: వేడి నీళ్ళతో స్నానం చర్మాన్ని పొడిగా మారుస్తుంది. వేడి నీళ్ళకి బదులు గోరు వెచ్చటి నీటిని వాడండి. గోరు వెచ్చటి నీటితో స్నానం మీ చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు బిగుతైన చర్మం సంతరించడానికి ఉపయోగపడుతుంది.

క్లోరినేటెడ్ వాటర్: మీకు నీళ్ళంటే ప్రాణమా? ఈత కొట్టకుండా ఉండలేరా? అయితే మీరు క్లోరిన్ లేని నీళ్ళలో నే ఈత కొట్టాలి. నీళ్ళలో క్లోరిన్ మీ చర్మాన్ని పొడిగా మారుస్తుంది. స్విమ్మింగ్ పూల్ నుండి బయటికి వచ్చిన వెంటనే స్నానం చెయ్యండి.

యోగా: కొన్ని యోగాసనాలు ప్రత్యేకించి పొత్తి కడుపుకి అలాగే ఉపిరికి సంబంధించినవి చెయ్యడం ద్వారా మీ పొట్ట వద్ద నున్న వదులు చర్మాన్నిబిగుతుగా మారుస్తాయి.

వ్యాయామం: ఆరోగ్యకరమైన చర్మం కోసం తరచూ వ్యాయామం చెయ్యండి. ఏరోబిక్స్ ఇంకా కార్డియో వ్యాయామాలు ఆరోగ్యకరమైన చర్మానికి మార్గాలు.

జిమ్: మీ వ్యక్తిగత జిమ్ కన్సల్ టెంట్ ని సంప్రదించి మీరు ఎటువంటి వ్యాయామాలు చేస్తే మీ చర్మం మళ్ళీ పూర్వపు అందాన్ని సంతరించుకుంటుందో తెలుసుకోండి.

పోషకాహారం: మంచి నాణ్యత కలిగిన పోషకాలనే ప్రత్యేకించి లీన్ ప్రోటీన్స్ ని తినండి. ఇవి మీ చర్మానికి కావలిసిన ఎలాస్టిసిటీని అందిస్తాయి. తద్వారా మీ చర్మం బిగుతుని సంతరించుకుంటుంది.

ట్రీట్మెంట్: ఒక వేళ ఇవేవీ మీకు ఉపయోగపడనట్టయితే మీ డాక్టర్ ని కలిసి సర్జెరీ గురించి ఆలోచించండి. కానీ సర్జరీకి సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు అందులో ఉండే అన్ని విషయాలు జాగ్రత్తగా తెలుసుకొని ముందుకు సాగండి.



Click it and Unblock the Notifications