For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేగంగా 200 కాలరీల కొవ్వు కరిగించే 20 చిట్కాలు!

By Super
|

కాలరీలు తగ్గించుకోవటానికి ఒక మహా యజ్ఞంలాంటి శిక్షణ అవసరం లేదు లేదా జిమ్ము కెళ్ళి చెమట ఓడ్చక్కరలేదు. బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు ఒక క్రమశిక్షణతో కూడిన వివిధ భౌతిక కార్యకలాపాలు అవసరమనేది వాస్తవం. కాని ఈ కార్యకలాపాలన్నీ జిమ్ముకే పరిమితమని ఎవరు చెప్పారు?

మేము మీకు తమాషాగా మరియు సులభమైన పద్దతిలో 200 కాలరీలు తగ్గించుకునే మార్గాలను ఇస్తున్నాము, మీరు, వాటిలో నుండి ఇష్టపడి చేయగలిగే వాటిని ఎంచుకుని చేయండి మరియు మీరు సరిఅయిన పద్ధతిలో బరువు తగ్గటం చూస్తారు.

స్కిప్పింగ్:

మీ వార్డ్ రోబ్ లో మడిచి ఉంచిన స్కిప్పింగ్ త్రాడును గుర్తు తెచ్చుకోండి. దానిని ఉపయోగించవలసిన సమయం వొచ్చింది. మీ మెత్తని షూస్ వేసుకోండి మరియు ఎగరటం మొదలు పెట్టండి. స్కిప్పింగ్ గుండెకు మంచి వ్యాయామం.

10-15 నిముషాలు = 200 కాలరీలు తగ్గుతాయి

ప్లే హిట్

మేము మిమ్మలిని పరుపుపై కూర్చుని వీడియో గేమ్ రోజంతా ఆడమని చెప్పటంలేదు. దానివలన మీ కంటి క్రింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. మీ స్నేహితుడిని పిలవండి మరియు ఇద్దరు కలిసి గెంతటం మరియు చెమట పట్టేవరకు గన్నులతో మరియు PS3 వాన్డ్స్ తో థంబ్ వ్యాయామాన్ని చేయండి.

50 నిముషాలు = 200 కాలరీలు తగ్గుతాయి

ఆకుపచ్చని మార్గం:

చెట్లు గుబురుగా అందంగా లేవని మరియు మొక్కలు సరిఅయిన ఆకారంలో లేవని ఊరికే అనుకోవటం కాదు. తోటపని పనిముట్లని తీసుకొని పని మొదలుపెట్టండి. మీ చుట్టూరా మొక్కలు ఉండటం కూడా ఒత్తిడి తగ్గటానికి ఒక మార్గం.

40 నిముషాలు = 215 కాలరీలు తగ్గుతాయి

బడ్డితో వ్యాయామం:

మీ పెట్ ను తీసుకొని పార్క్ కు వెళ్ళండి లేదా తిన్నగా పరుగు తీయండి మరియు త్వరత్వరగా నడవండి. కొంతసేపు పరుగెత్తండి; మీ పెట్ తో ఆడుకోండి.

25 నిముషాలు = 190 కాలరీలు తగ్గుతాయి

కార్ కడగండి:

మీ కార్ ను లేదా బైక్ ను ఖరీదైన కార్ వాష్ ఎందుకు పంపాలి? మీరే చేసుకోగలరు. వదులుగా ఉన్న పైజామాను వేసుకోండి, ఒక బకెట్ ను తీసుకోండి, రుద్దండి, కడగండి మరియు శుభ్రం చేయండి.

40 నిముషాలు = 216 కాలరీలు తగ్గుతాయి

నెట్ ప్రాక్టీస్:

మీ బాడ్మింటన్ రాకెట్ తీసి మీ నైపుణ్యానికి పదును పెట్టి బాడ్మింటన్ ఆడండి. దీనివలన మీకు వంగటం, గెంతటం, కండరాలకు మంచి వ్యాయామం కలుగుతుంది.

25 నిముషాలు = 218 కాలరీలు తగ్గుతాయి

పనిచేయండి:

ఎప్పుడూ మీ పరుపు మీద కూర్చుని మీకు ఇష్టమైనవాటిని చూస్తూ వాటిపై కామెంట్ విసురుతూ, ఇంట్లో చిందరవందరగా ఉన్నా పట్టించుకోరు. మీ పక్కమీదనుండి దిగండి మరియు మీ ఇంట్లో దుమ్ము దులపటం, వస్తువులను సరిఅయిన స్థలాల్లో ఉంచటం, తోయటం వంటి పనులు చేయటం వలన మీరు కాలరీలు తగ్గించుకోవటంలో సహాయపడతాయి.

25 నిముషాలు = 210 కాలరీలు తగ్గుతాయి

మెట్లు ఎక్కండి:

మీరు షాపింగ్, ఆఫీసు లేదా స్కూల్ కు గాని లిఫ్టు ఉపయోగించకుండా మెట్లు ఎక్కుతూ, దిగుతూ వెళ్ళండి.

30 నిముషాలు = 216 కాలరీలు తగ్గుతాయి

కార్యాచరణ సమయం:

మీరు మీ గదిలోకి వెళ్లేముందు భోజనం చేయటం, TV చూడటం చేయటమొక్కటమే కాదు. ఏదైనా బోర్డ్ గేమ్ ఆడండి, ఏదైనా తమాషా కలిగించే పని చేయండి, ఏదైనా చదవండి లేదా కబుర్లలో మునగండి.

60 నిముషాలు = 200 కాలరీలు తగ్గుతాయి

గల్లీ క్రికెట్

మధ్యాహ్నాలు కూర్చుని TV చూడకుండా మీ స్నేహితులను పిలిచి, గ్రౌండ్ కు వెళ్లి, మీలో ఉన్న టెండూల్కర్ ను బయటకు తెండి. మీ క్రికెట్ కిట్ తీసుకెళ్లండి మరియు స్టంప్స్ మరియు గ్లోవ్స్ కూడా. ఇది చాలా మంచి వ్యాయామం.

50 నిముషాలు = 210 కాలరీలు తగ్గుతాయి

ఒక మునక వేయండి:

మీ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోండి మరియు ఈతకు వెళ్ళండి. స్విమ్మింగ్ మంచి వ్యాయామం మరియు మీ శరీరం ఉత్తేజితమవుతుంది.

30 నిముషాలు = 215 కాలరీలు తగ్గుతాయి

సైకిల్ :

ఉదయం మరియు సాయంకాలాలు సైకిల్ ను తొక్కడం వలన అనేక అద్భుతాలను సృష్టించవొచ్చు. సాధారణంగా అందరు 10-12 mph వేగంతో తొక్కుతారు, కాని మీరు ఇంకా ఎక్కువ వేగంతో పైకి మరియు క్రిందకి తొక్కి, ఎక్కువ కాలరీలను తగ్గించుకోవొచ్చు.

30 నిముషాలు = 210 కాలరీలు తగ్గుతాయి

శుభ్రపరచండి మరియు నిర్వహించండి:

మీ గారేజ్ లేదా వార్డ్ రోబ్ ను శుభ్రంగా ఉంచుకోండి. ఇలా శుభ్రపరచుకోవటం వలన మీలో ఉన్న కాలరీలను తగ్గించుకోవొచ్చు. మీకు అవసరం అనుకున్నవాటిని మాత్రమే ఉంచుకోండి, మిగతావి తీసేయండి.

25 నిముషాలు = 210 కాలరీలు తగ్గుతాయి

మాసాజ్ తో ఒత్తిడిని తగ్గించుకోండి:

రోజంతా అనుభవించిన ఒత్తిడిని మీ శరీరానికి మసాజ్ ద్వారా తగ్గించుకోవొచ్చు. దీనివలన మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండవొచ్చు. మీ పార్టనర్ కు ఇష్టమైన నూనెతో మాసాజ్ చేసుకోండి.

42 నిముషాలు = 200 కాలరీలు తగ్గుతాయి

బిరం నిర్వహించండి :

మీ సొంతంగా శిబిరాలను నిర్వహించండి. దూకటం, వెనక్కు ముందుకు వెళ్లటం, చతికలబడటం, జాక్ దూకడం మరియు కవాతు వంటివి చేయండి. ఇందులో ప్రతిది 2-3 నిముషాలు చొప్పున చేయండి మరియు వాటినే తిరిగి చేయండి.

30 నిముషాలు = 200 కాలరీలు తగ్గుతాయి

గోడలకు రంగు వేయండి:

మీ కాలరీలను తగ్గించుకోవటానికి మీకు ఇష్టమైన గదికి ఫ్రెష్ గా రంగు వేయండి.

40 నిముషాలు = 208 కాలరీలు తగ్గుతాయి

డాన్స్:

మీ జుట్టును క్రిందకి కట్టేసుకోండి మీ పిల్లలను మరియు పార్టనర్ ను గదిలో ఉంచండి. మీ చేతులను గాలిలో విసిరేస్తూ కదలండి, గెంతండి, ఊగండి మరియు మీరు చేయతగినవి అన్నిటిని చేయండి. ఒక్కటి గుర్తుంచుకోండి సున్నితమైన ఫర్నిచేర్ ను దూరంగా ఉంచండి.

40 నిముషాలు = 216 కాలరీలు తగ్గించుకోండి

ఫుట్ బాల్:

స్నేహితులను కేఫ్ దగ్గర కలుసుకోవటం పాత పధ్ధతి, మీకు దగ్గరలో ఉన్న గ్రౌండ్ లో అందరు కలిసి ఫుట్ బాల్ ఆడండి. దీనివలన మీ మధ్య మంచి సంబంధాలు పెరుగుతాయి.

20 నిముషాలు = 192 కాలరీలు తగ్గుతాయి

చారిత్రాత్మక ట్రెడ్మిల్

మీరు మీ అసహజమైన స్నేహితునితో గడిపిన తరువాత మీరు ఏనుగులాగా శరీరాన్ని పెంచుతారు(ట్రెడ్మిల్ చదవండి). మీరు వేగంగా జాగింగ్ చేయవలసిన సమయం ( 5 mph వేగంతో దానిని నిర్వహించండి).

20 నిముషాలు = 192 కాలరీలు తగ్గుతాయి

వాక్యుం చేయండి:

ఈ పని ఎప్పటికి పూర్తి కాదు, ఇంటిని వాక్యుం చేయటం అన్నది ఎప్పుడూ ఉండేదే! మీకిష్టమైన సంగీతం పెట్టుకోండి, బందనను ధరించండి, మీకు సౌకర్యంగా ఉండే దుస్తులను ధరించండి మరియు పని చేయటం మొదలుపెట్టండి. సాధ్యమైనంత వేగంగా పని చేయటం వలన మీ గుండె కూడా వేగంగా పని చేస్తుంది.

40 నిముషాలు = 216 కాలరీలు తగ్గుతాయి

English summary

20 ways to burn 200 calories

Burning calories need not be an intensive training ritual or sweating out in the gym every day. It is true that weight loss requires healthy eating practices and a disciplined routine that comprises of various physical activities.