For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకలి మందగించి౦దనడానికి 9 హెచ్చరిక సంకేతాలు !!

By Super
|

ఆహారం తీసుకోవడానికి సంబంధించిన అనారోగ్యాల్లో సాధారణమైన ఆకలి మందగించడం అనేది తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేని సమస్య. అనోరెక్సియా నెర్వోసా (Anorexia Nervosa or AN) అనేది తినడానికి సంబంధించిన ఒక రుగ్మత, ఆరోగ్యకర శరీర బరువు పొందడానికి ఆహారాన్ని నిరాకరించడం మరియు వక్రీకృత స్వీయ చిత్రణ కారణంగా బరువు పెరుగుతామనే ఒక స్థిరమైన భయం వంటి లక్షణాలను ఈ రుగ్మతగా చెప్పుకోవచ్చు . తమ శరీరం, ఆహారం మరియు తినడం గురించి బాధిత వ్యక్తి వేసుకునే అంచనాలు మరియు చేసే ఆలోచనలను మార్చే వివిధ అభిజ్ఞా పక్షపాతాలు ద్వారా ఈ రోగం పోషించబడవచ్చు. AN ఒక తీవ్రమైన మానసిక రుగ్మత, మిగిలిన అన్ని మానసిక రోగాల కంటే దీనిలో అనారోగ్య స్థితి మరియు మరణాల రేట్లు ఎక్కువగా ఉన్నాయి.

కాబట్టి మీరు గాని, మీకు ప్రియులైన వారికి గాని ఈ ఆహారపు సమస్య వుంటే దానికి సంబంధించిన కొన్ని శారీరిక, ప్రవర్తనకు లేదా భావోద్వేగాలకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు మీకు ఉపయోగంగా ఉండడానికి ఈ క్రింద ఇచ్చాం.

ఆకలి లేదనడం :

ఈ సమస్య వున్న వారు బాగా ఆకలితో మాడిపోతున్నపుడు కూడా ఆకలి లేదని అంటూ వుంటారు. తినడానికి ఇష్టపడరు, భోజనం మానేస్తుంటారు.

ఆహారపు అలవాట్లలో ఆకస్మిక మార్పులు

ఒక వ్యక్తికీ ఆకస్మికంగా ఆహారపు అలవాట్లు మారితే, అది వారు ఆకలి మందగింపు తో బాధ పడుతున్నారనడానికి సంకేతం. అంటే భోజనం రహస్యంగా తినడం గానీ, లేదా కొన్ని ప్రత్యెక రకాల ఆహార పదార్ధాలు మాత్రమె తినడం గానీ లేదా పదార్ధాలను చాలా చిన్న భాగాలుగా చేసి తినడం లాంటివి చేయడం.

విపరీతంగా బరువు కోల్పోవడం

ఆకలి మందగిస్తే శరీరానికి అవసరమైన పోషకాలు అందడం లేదని అర్ధం. బహుశా ఇలాంటి పరిస్థితితో సర్వ సాధారణ లక్షణమైన బరువు విపరీతంగా తగ్గడం అనేది అశ్రద్ధ చేయకూడని విషయం.

వదులుగా ఉండేవి లేదా పొరలు వుండే బట్టలు ధరించడం

ఆకలి మందగింపు తో బాధ పడే వారు వదులుగా వుండే బట్టలు వేసుకుని కోల్పోయిన బరువును దాచే ప్రయత్నం చేస్తుంటారు.

శరీరం పై అధిక జుత్తు

బరువు అధికంగా కోల్పోతే శరీరంలో ఉష్ణోగ్రత పడిపోతుంది. దీన్ని ఎదుర్కోవడానికి ఆకలి మందగింపు వుండే వ్యక్తీ కాళ్ళు, చేతులు, మొహం మీద ఎక్కువగా జుత్తు వేలాడేసుకుని వుంటారు.

అస్తమానూ బరువు చూసుకోవడం

మీకు తెలిసిన వారు ఎవరైనా మాటిమాటికీ బరువు చూసుకుంటూ బరువు పెరుగుతానేమో అని భయపడుతుంటే వాళ్ళు ఆకలి మందగింపుకు గురౌతున్నట్టే.

చెడిపోయిన శరీరాకృతి

ఆకలి మందగింపు వున్న వారు అస్తమానూ వారి బరువు గురించి, శరీరం గురించి అసంతృప్తిగా వుంటారు. వాళ్ళు సన్నగా వున్నా సరే, చాలా లావుగానో ఎక్కువ బరువు గానో వున్నట్టు భావిస్తుంటారు.

రుతుక్రమంలో మార్పులు

యువతుల్లో లేదా టీనేజ్ వారిలో వరుసగా మూడు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు రుతుక్రమంలో మార్పులు వస్తే, అది ఆకలి మందగింపు లక్షణమే.

ప్రవర్తనలో మార్పులు

ఆకలి మందగించిన వారు మెల్లిగా ఒంటరి వారైపోయి అందరికీ దూరంగా వుంటారు. స్నేహితులు, కుటుంబంతో ఎక్కువ సమయం గడపరు, చాలా చాలా రహస్యంగా ఉండడానికి అలవాటు పడతారు.

English summary

9 Warning Signs of Anorexia | ఆకలి మందగిస్తే.. వచ్చే భయంకరమైన వ్యాధులు..


 One of the most common eating disorders, anorexia should not be taken lightly. If you are worried that you or someone you love might be suffering from this debilitating eating disorder, then here are some physical, behavioral, or emotional warning signs to help you out.
Desktop Bottom Promotion