For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అవొకాడోలోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

By Super
|

అవెకాడో - దీనిని అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పండుగా చెప్పవచ్చు. ఇది పియర్ ఆకారంలో లేదా గుండ్రని ఆకారంలో గ్రీనిష్ గోధుమ రంగులో ఉంటుంది. సాధారణంగా అవెకాడోను నేరుగా లేదా వంటలలో ఉపయోగిస్తారు. విజిటేరియన్ వంటలలో మాంసంనకు బదులుగా అవెకాడోను ఉపయోగిస్తారు. అంతేకాక మిల్క్ షేక్స్ మరియు ఐస్ క్రీం కోసం ఒక ఎడారి వస్తువుగా ఉపయోగించబడుతుంది.

అవెకాడోలో పోషకాలు సమృద్ధిగా మరియు A,B మరియు E వంటి విటమిన్లు అధిక కంటెంట్ లో ఉన్నాయి. అంతేకాక ఫైబర్స్ మరియు ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అవెకాడో అనేది చాలా కొవ్వు కలిగిన పండ్లలో ఒకటి అని చెప్పవచ్చు. అంతేకాక అధిక కేలరీలను కూడా కలిగి ఉంటుంది. కానీ కొవ్వు ఆరోగ్యకరమైనది మరియు స్వభావరీత్యా మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది.

అవెకాడోలో ప్రోటీన్లు,విటమిన్లు,ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్దిగా ఉండుటవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటిగా ఉంది. కొన్ని వ్యాధులు మరియు రుగ్మతలను నయం చేసే గుణాలను కూడా కలిగి ఉంది. అవెకాడో యొక్క ఆరోగ్య ప్రయోజనాలు కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి.

Avocado

1. బరువు పెరిగే వారి కోసం

అవెకాడోలో కేలరీలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉంటుంది. అందువలన బరువు పెరిగే వారి ప్రయోజనం కోసం చాలా మంచి పండుగా పరిగణిస్తారు. ఈ పండులో కొవ్వులు మరియు పిండి పదార్థాల మంచి మూలం ఉంది. 100 గ్రామూల అవెకాడో సుమారు 60-80 కేలరీలను కలిగి ఉంటుంది. అందువల్ల అదనపు బరువును పెంచడానికి ఖచ్చితంగా వారి ఆహార ప్రణాళికలో అవెకాడోను చేర్చాలి.

2. గుండెకు మంచిది

అవెకాడోలో గుండె వ్యాదులను నివారించటంలో సహాయపడే B6,ఫోలిక్ ఆమ్లం సమృద్దిగా ఉంటాయి. అందువలన అవెకాడో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదంతో బాధపడుతున్న వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. అధిక మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండుటవల్ల గుండె స్ట్రోక్స్ నిరోధించడానికి మంచిదని భావిస్తారు.

3. చర్మంనకు మంచిది

అవెకాడో పండు నూనె చర్మపు నిర్మాణం మరియు నాణ్యత మెరుగుపర్చడానికి ఉత్తమ నూనెలలో ఒకటిగా ఉంది.పొడి చర్మంపై నూనె మర్దనా కూడా కఠినమైన పాచెస్ ను మెరుగుపరుస్తుంది. అంతేకాక చర్మం మళ్ళీ అందంగా మరియు ప్రకాశవంతముగా తయారవుతుంది. అందువలన అవెకాడో నూనెను అనేక సౌందర్యసాధనాలలో ఉపయోగిస్తారు.

4. షుగర్ వ్యాదిగ్రస్తులకు

అవెకాడో రక్తంలో చక్కెర స్థాయిలను నిలబెట్టడానికి సహాయపడే మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాల కంటెంట్ ను కలిగి ఉంటుంది. ఈ కొవ్వులు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి స్థాయిని నియంత్రిస్తాయి.అందువలన అవెకాడో తక్కువ చక్కెర స్థాయి సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల కోసం ఉపయోగకరంగా ఉంటుంది.

5. ఆర్థరైటిస్ నొప్పి కొరకు

అవెకాడో పండును ఆర్థరైటిస్ నొప్పి నివారణ కొరకు ఉపయోగిస్తారు. ఇది యాంటీ శోథలక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల కీళ్లనొప్పి కారణంగా వచ్చే జాయింట్ మంట మరియు నొప్పి కొరకు ఉపయోగకరంగా ఉంటుంది. అవెకాడోలో కొవ్వులు,విటమిన్లు మరియు ఇనుము మరియు పొటాషియం వంటి ఖనిజాలు ఉండుటవల్ల నొప్పి స్వస్థత లక్షణాలు కలిగి ఉంటుంది. అవెకాడో నూనెను మసాజ్ చేయటం ద్వారా దీర్ఘకాలిక నొప్పి సమస్యలను తగ్గించవచ్చు.

ఈ అవెకాడో పండులో ఇంకా కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవెకాడోలో యాంటి ఏజింగ్ లక్షణాలు ఉండుటవల్ల చర్మం తాజాగా మరియు తక్కువ వయస్సు వారిగా కనపడేలా చేస్తుంది. క్యాన్సర్ నివారించేందుకు మరియు మధుమేహం నియంత్రణకు సహాయపడుతుందని చెబుతుంటారు. గుండె,చర్మం మరియు కండరములకు సంబంధించిన వ్యాధులకు గొప్ప నొప్పి నివారణిగా పరిగణిస్తారు.

పైన చెప్పినట్లుగా అవెకాడో చాలా ఆరోగ్యకరమైన మరియు ప్రయోజనకరమని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీ ఆహారంలో ఈ ఆరోగ్యకరమైన పండ్లను మర్చిపోకుండా ఉండేలా చూసుకోండి. రెగ్యులర్ గా ఈ పండును తీసుకోవడం వలన మీ బరువును నిర్వహించడానికి మరియు మీరు తక్కువ వయస్సు మరియు అందంగా కనిపించడానికి,మీ చర్మం మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. ఇది ఇంకా డయాబెటిస్ మరియు ఆర్థరైటిస్ వంటి వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే వైద్యుని అవసరం ఉండదని ఒక సామెత ఉంది. కానీ నేను దానికి బదులుగా ప్రతి రోజు ఒక అవెకాడో పండును తింటే వైద్యుని అవసరం ఉండదని ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఈ పండు యొక్క అన్ని ప్రయోజనాలను పొందడానికి దీన్ని ఇష్టపడతారని మేము ఆశిస్తున్నాము.

English summary

Amazing health benefits of avocado

Avocado is a Mediterrenean origin fruit that has been found to have a lot of health benefits. Avocado is a pear shaped or spherical shaped plant that is greenish brown in colour. Avocado is generally either consumed directly or is used in cooking.
Desktop Bottom Promotion