For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వృద్ధాప్యం ఎదుర్కొనే టాప్ 10 యాంటీ ఏజింగ్ డైట్ టిప్స్

|

ఏజింగ్ అనేది మనం ఎప్పటికీ ఆహ్వానధించదగ్గది. మీరు దీన్ని ఎప్పటికీ నివారించలేరు మరియు వయస్సు పెరగడానికి కంట్రోల్ చేయలేరు. అయితే మీరు వృద్ధాప్యలక్షణాలు కనబడనియ్యకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. అందంగా ఎప్పటికి యవ్వనంతో చిన్నవారిగా వుండాలని ప్రతివారికి వుంటుంది. మరి అందానికి, శారీరక ధారుఢ్యానికి మద్య సంబంధం ఉంది. ప్రతి ఒక్కొరూ యవ్వనంగా ఉండటానికి చాలా ఇష్టపడుతుంటారు. కానీ, 30ఏళ్ళు లేదా 30 దాటిన తర్వాత మీ చర్మం కూడా 20సంవత్సరంలో ఉన్నట్లు ఉండదు. ఎందుకంటే ఒత్తిడితో కూడిన జీవన శైలితో చిన్నవయస్సులోనే పెద్దవారిలా కనిపించే లక్షణాలు(ప్రీమెచ్యుర్ ఏజింగ్)పెద్ద సవాల్ వంటిది. మీరు 30ఏళ్ళ సమయానికి, మీరు చర్మంలో ముడుతలు ప్రారంభం అవ్వడాన్ని గమనించవచ్చు. 30లో అలా జరగనప్పుడు, కనీసం 35ఏళ్ళ వయస్సులోనైనా కనబడుతాయి. వయస్సు మీరే లక్షణాలు మీ ముఖంలో ఖచ్చితంగా కనిపిస్తాయి.

వయసు పైబడే కొద్ది ఇంకా చిన్నవారుగానే కనపడాలనే కొరిక పెరగటం, మార్కెట్ లో దొరికే వివిధ క్రీములు చర్మానికి రాసి సంరక్షించుకోడం జరుగుతుంది. అయితే వీటికంటే కూడా సహజంగా మీ చర్మాన్ని వయసు బారినుండి రక్షించే మార్గాలేమిటో చూద్దాం! వయసు పైబడటం అనేది పూర్తిగా నిలిపివేయలేము. కాని దానిని కొంతమేరకు సహజ పోషణతో తాత్కాలికంగా వాయిదా వేయవచ్చు.

అసలు వయసు పైబడటానికి కారణాలేమిటి? చర్మ కణాల పునరుజ్జీవన ప్రక్రియ నిదానించటమే వయసు పై బడటమంటే అని చెప్పవచ్చు. కనుక ఎవరైనా ఎప్పటికి యువకులుగా వుండాలంటే చర్మ కణాల పునరుజ్జీవాన్ని వేగవంతం చేయాలి. దీనికిగాను కొన్ని పోషక విలువలుకల ఆహారాన్ని తీసుకుంటూండాలి. బయటనుండి వివిధ క్రీములు రాసి చర్మాన్ని రక్షించేకంటే లోపలినుండి చక్కని ఆహారాన్ని సమకూర్చి చర్మ కణాల పునరుజ్జీవానికి ప్రయత్నించవచ్చు. మీ వయసు తెలియరాదనుకునేటంత పటిష్టంగా మీ శరీరం వుండాలంటే దిగువ ఆహారాలు తినండి.

తాజా పండ్లు మరియు కూరగాయలు:

తాజా పండ్లు మరియు కూరగాయలు:

ఒక ప్రభావవంతమైన యాంటీఏజింగ్ చిట్కా. గ్రీన్ లీఫీ వెజిటేబుల్ డైట్ తో మెరుగుపరుచుకోవాలి. గ్రీన్ వెజిటేబుల్స్ ఆకుకూరలు లేదా బీన్స్ వంటివి చర్మంలోని ముడుతలను మరియు ఏజింగ్ లక్షణాలను రానియ్యకుండా కాపాడుతుంది. రీన్ లీఫీ వెజిటేబుల్స్, బ్రొకోలి, మరియు ఆకుకూరలు వంటివి చర్మానికి చాలా మంచిది. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ వెజిటేబుల్స్ లోని యాంటీఆక్సిడెంట్స్ రెండు రకాలుగా పనిచేస్తాయి. ఒకటి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తే, మరొకటి వయస్సును మీద పడనియ్యకుండా రక్షణ కల్పిస్తాయి. పండ్ల తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. ఇవి తింటే వయసు కనపడకుండా చేస్తాయి. ఆపిల్, ఆరెంజ్, రేగుపండు, చెర్రీలు మొ. తొక్కలతో తినవచ్చు. ఇవి అధికంగా వుండేలా ఆహారాన్ని తీసుకోండి.

లీన్ ప్రోటీన్స్:

లీన్ ప్రోటీన్స్:

ప్రోటీన్ కంటెంట్ లో కొల్లాజెన్ ఉంటుంది. ఇది చర్మాన్ని సాఫ్ట్ గా మరియు తేమగా ఉంచుతుంది. అందుకు మీ రెగ్యులర్ డైట్ లో గుడ్డు, స్కిన్ లెస్ చికెన్ , చేపలు చేర్చుకోవాలి . వీటిని అద్భుతమైన లీన్ ప్రోటీనులు ఉంటాయి.

డైరీ ప్రొడక్ట్స్:

డైరీ ప్రొడక్ట్స్:

చీజ్, బట్టర్, పాలలో అధికంగా ఉండే క్యాల్షియం మాత్రమే కాదు,అందులో ఉండే విటమిన్ ఎ మరియు కెరోటినాయిడ్స్ అధికంగా ఉండటం వల్ల , ఈ యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ను ఖచ్చితంగా మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇవి వయస్సు మీద పడనియ్యకుండా చేసి యవ్వనంగా కనబడేలా చేస్తాయి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

చర్మలో పాడైపోయిన లేదా డెడ్ స్కిన్ సెల్స్ తిరిగి పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్స్ గ్రీన్ టీలో పుష్కలంగా ఉన్నాయి. గ్రీన్ టీ తాగడం వల్ల మీ చర్మం ముందు కంటే మెరుగ్గా తక్కువ వయస్సు ఉన్న వారుగా కనబడుతారు మరియు చర్మ టైట్ గా కనిపిస్తుంది. గ్రీన్ టీ ముడుతలతో వ్యతిరేకంగా పనిచేస్తుంది మరియు మీ చర్మ మీద ఉన్న డార్క్ పాచెస్ ను మీ చర్మం నుండి అదృశ్యం చేయవచ్చు.

ఫిష్: సాల్మన్ చేపలు:

ఫిష్: సాల్మన్ చేపలు:

చేపల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ప్రత్యేకంగా సాల్మన్ చేపల్లోని ఒమెగా 3-ఫ్యాటీ యాసిడ్స్‌తో చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ను అందిస్తుంది. అలర్జీలను, గాయాలను మాన్పుతుంది.

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్:

ఏజింగ్ స్కిన్ చూపించడంలో మీరు తీసుకొనే ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఆహారాలు ఉదా: బెర్రీస్, బ్రొకోలీ మరియు బెల్ పెప్పర్ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి చర్మంలో తాజాగా కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతాయి.

7. నిమ్మరసం:

7. నిమ్మరసం:

కొన్ని సందర్భాల్లో డిటాక్స్ డైట్ లో ఫాలో అవ్వాలి. ప్రొసెస్డ్ ఫుడ్స్, కెఫిన్ నివారించి, వ్యర్థాలను తొలగించే ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మ మరియు తేనె చాలా ఉత్తమ డిటాక్స్ఫైర్ గా భావిస్తారు.

8. ఆలివ్ ఆయిల్:

8. ఆలివ్ ఆయిల్:

శరీరంలో రక్త ప్రసరణ తగ్గడం వల్ల కూడా ఇలా వయస్సు మళ్ళినవారిలా కనబడేలా చేస్తుంది. కాబట్టి శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరగాలంటే, రెగ్యులర్ హెడ్ మసాజ్ లేదా బాడీ మసాజ్ చేసుకోడం ఉత్తం. ఇది పురుషుల్లో నేచురల్ యాంటీఏజింగ్ చిట్కాగా సూచించవచ్చు.

9. సిట్రస్ మంచి ఆహారాలు:

9. సిట్రస్ మంచి ఆహారాలు:

స్కిన్ డిటాక్స్ చేయడానికి సిట్రస్ ఫుడ్స్ చాలా మంచిది. కాబట్టి సిట్రస్ పండ్లు తీసుకోవడంతో పాటు వాటి రసాలను తరచూ తాగుతుండాలి . ప్రతి రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల ఇటు ఆరోగ్యానికి, అటు చర్మాన్నికి రెండింటికి మంచిది. ఇది తాగలేనప్పుడు తాజా ఆరెంజ్ జ్యూస్ తీసుకోవచ్చు.

10. నీరు ఎక్కువగా తాగాలి:

10. నీరు ఎక్కువగా తాగాలి:

వయస్సు పెరిగే కొద్ది, మీ చర్మం పొడిబారడం మొదలవుతుంది. ముందులాగే మీ చర్మంలో ఆయిల్ ఉత్పత్తి కావడం లేదని గమనించవచ్చు. కాబట్టి చర్మంకు తగినంత తేమను అంధించి, హైడ్రేషన్ లో ఉంచుకోండానికి తగినన్ని నీళ్ళు తాగాలి. అంతే కాదు నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్(వ్యర్థాలను తొలగించుకోవచ్చు.

English summary

Anti-Ageing Diet Tips To Follow

Ageing is inevitable. You cannot avoid or keep your age under control. But you can definitely keep the signs of ageing under control if you want to. Even if the age metre keeps ticking on, you can still look young. Do you want to know the secret of looking younger than your age? Then, read on.
Story first published: Monday, October 28, 2013, 18:09 [IST]
Desktop Bottom Promotion