For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్ఞాపకశక్తిని పెంచుకోవాలా..? అయితే ఇలా చేయండి...!

|

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన విధానంలో మన పని సమయాలు, పద్ధతులు మారిపోతున్నాయి. ఆహార అలవాట్లూ సరేసరి. వ్యాయామం చేసేదీ అంతంత మాత్రమే. ఇక నిద్ర తగ్గిపోవటం గురించి చెప్పాల్సిన పనేలేదు. అర్ధరాత్రుల వరకూ మేల్కొని టీవీలు చూడటం, ఫేస్ బుక్ లు, ట్విటర్ చాటింగులు, ఫ్రెండ్స్ తో కలిసి పబ్బులు, బార్లు, ఇలా ఒకటా రెండా... పొద్దున నిద్ర మొహంతోనే లేచి ఆఫీసులకు పరుగెత్తటం పరిపాటయిపోయింది. ఇలాంటివన్నీ మన మెదడుపై ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గిపోవటంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే జ్ఞాపకశక్తిని తిరిగి పెంపొందించుకోవచ్చు. ఏకాగ్రతతో వేగంగా పనిచేయొచ్చు.

జ్ఞాపకశక్తికి ఆధారం మన మెదడు. మేధావికైనా, సామాన్యడికైనా ఉండే మెదడు 1450 గ్రాములు. మెదడును వినియోగించుకునే విధానం మీదే వ్యక్తి ప్రతిభ, జ్ఞాపకశక్తి ఆధారపడి ఉంటుంది. మెదడు నుండి శరీరంలోని వివిధ అవయవాలకు నాడులు కలుపబడి ఉంటాయి. ఇవన్నీ ఒకదానితో మరొకటి సుమారు 20 వేల అనుసంధానాలు కలిగి ఉంటాయి.పెద్ద టెలిఫోన్‌ ఎక్చేంజిలో వైర్ల నెట్‌వర్క్‌ మాదిరిగా మెదడు పనిచేస్తుంది. అందుకే కోట్లాది సమాచార యూనిట్లను ఏకకాలంలో గ్రహించి, విశ్లేషించగలుగుతుంది. సెరిబ్రం, తలామస్‌, లింబిక్‌ సిస్టం, రేటికులార్‌ సిస్టంలు జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడు భాగాలు. మన పరీక్షలు చాలా వరకూ జ్ఞాపకశక్తిని పరీక్షించేవే !

అందుకే చదివిన విషయాలను గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం. ఎంత కష్టపడి చదివినా నాకసలు గుర్తుండదు.. అంటూ బాధపడే విద్యార్థుల సంఖ్య తక్కువేమి కాదు. నాలుక మీదే ఉంటుంది.. బయటికి రాదు అని ఇంకొంత మంది అనటం చూస్తుంటాం. కొన్ని శాస్త్రీయ సూత్రాలను సాధన చేస్తే ఏ విద్యార్థికైనా జ్ఞాపకశక్తి అద్భుతంగా మెరుగవుతుంది. చదివిన విషయాలను తేలిగ్గా మరచిపోవడం వల్ల పోటీ ప్రపంచంలో చాలా వెనకబడాల్సి వస్తుంది. జ్ఞాపకశక్తి లోపానికి కింది మూడింటిలో ఏదో ఒక కారణం కావొచ్చు.1. సమాచారాన్ని స్పష్టంగా మనసుపై ముద్రించకపోవడం. 2. మనసుపై ముంద్రించిన సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరచకపోవడం. 3. ఆ భద్రపరచిన సమాచారాన్ని సరిగ్గా వెలికితీయలేకపోవడం.

జ్ఞాపకశక్తి వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. హెరిడిటరీ గా వస్తుంది. మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల హార్మోనుల అసమతుల్యత వల్ల జ్ఞాకపశక్తి తగ్గే అవకాశం ఉన్నది. అందుకే ఉన్న జ్ఞాపకశక్తిని పోగొట్టుకోకుండా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ఆహారాన్ని తీసుకోవాలి. అందుకు జింక్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దాంతో పాటు వైటమిన్-బి6, విటమిన్ బి12, యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం కూడా అవసరం. ఈ విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ప్రధానంగా లంబిచే కొన్ని ఆహారాలు తెలుసుకుందాం.....

చేపలు: చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అదే విధంగా జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. డిప్రెషన్ తో పోరాడుతుంది. మెదడు ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్స్ చాలా అవసరం. ఇది బ్రెయిన్ సెల్ ఫంక్షన్ ను పెంచుతుంది.

హేర్బల్ టీ: గ్రీన్ టీ లో ఉన్న ఫిలోఫినాల్స్, పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది. అంతే కాకుండా గ్రీన్ టీ త్రాగడం వల్ల వివిధ రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంతే కాదు ఇది మెమరీ మరియు మానసిక చురుకుదనాన్ని పెంచుతుంది. మెదడు వృద్ధాప్యం నెమ్మదిస్తుంది.

బెర్రీస్: బెర్రీస్ లో మెదడు కణాలకు ఉపయోగపడే క్వార్సిటిన్ అధికంగా ఉండి కణాలు సరైన మార్గంలో పని చేయడానికి సహాయపడుతుంది. బెర్రీస్ లో ఇంకా ఆన్థోసైనిన్ తో పాటు మెమరీ లాస్ ను ఏర్పడకుండా అడ్డుకొనే ఫోటోకెమికల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. రాస్బెరీ, బ్లూ బెర్రీ, ఆపిల్స్ వంటివి మెదడుకు చాలా మంచి ఆహారాలు.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: ఇవి మెమరీ పవర్ ను పెంచడానికి ఎక్కువ జ్ఞాపకశక్తి, ఎక్కువ కాలం నిలిచి ఉండేందుకు సహాయపడుతాయి. కూరగాయలు, ఆకుకూరలు, ఆకుకూరలు, బ్రొకోలీ, కాలీఫ్లవర్ మరియు మొలకెత్తిన విత్తనాలు వంటివి మెదడుకు కావల్సిన శక్తి ఇవ్వడమే కాకుండా అందుకు ఉపయోగపడే విటమిన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండి మొత్తం శరీర వ్యవస్థకు సహాయపడుతాయి.

తేనె: తేనెలో ఉన్న ఔషధగుణాల గురించి మనకు తెలిసిందే. తేనె మెమరీని పెంచడంలో చాలా సహాయపడుతుంది. ఒక చెంచా తేనె ను ప్రతి రోజు ఉదయం తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాదు... జ్ఞాపకశక్తి పెంపొందించుకోవడానికి బాగా సహాయపడుతుంది.

నట్స్: నట్స్, ముఖ్యంగా ఎండిన ఫలాలల్లో అధికంగా విటమిన్ ఇ మరియు బి6 ఉండి మెంటల్ ఎనర్జీకి ఉపయోగపడుతుంది. గుప్పెడు బాదం, పిస్తాలను ప్రతి రోజూ తినడం వల్ల మెమరీ పవర్ ను పెంచుకోవడమే కాదు, మన పూర్తి ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది.

డైరీ ప్రొడక్ట్స్: డైరీ ప్రోడక్ట్స్ క్యాల్షియం అధికంగా ఉంటుంది. క్యాల్షియం అధికంగా ఉండే పాలు, చీజ్, బట్టర్ మరియు పెరుగు ఇవి మెదడు కణపోషణకు చాలా బాగా సహాయపడుతాయి. ప్రత్యేకంగా పెరుగులో అమినో ఆసిడ్స్ కలిగి ఉంటాయి. ఇవి మెమరీ పెంచడానికి బాగా సహాయపడుతాయి.

నీళ్ళు: మన మెదడు దాదాపు మూడువంతుల నీరు కలిగి ఉంటుంది. కాబట్టి నీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది. మెదడులో కర్టిసోల్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఇది మనం మెదడులోకి పంపించే సమాచారాన్ని నిల్వచేసేందుకు సహాయపడుతుంది.

రెడ్ వైన్: ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమే.. అయితే రెడ్ వైన్ తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మెమరీ పెరుగుతుంది. రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మెదుడు రక్త ప్రసరణ బాగా జరిగి అల్జీమర్స్ నుండి బయటపడేలా చేస్తుంది. ఈ రెడ్ వైన్ బ్రెయిన్ కు మాత్రమే కాదు గుండెకు కూడా మంచిదే.

రోస్మెరీ: రోస్మెరీని మనం తినే సలాడ్స్ లో ఉపయోగించడమే కాదు, జ్ఞాపకశక్తి పెంపొందించడం కోసం కూడా ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ మూలిక మెదడు అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. దీని వాసన కూడా మెదడుకు సానుకూలా ప్రభావం కలిగి ఉంటుంది.

మాంసాహారం: మాంసాహారంలో జింక్ అధికంగా ఉంటుంది. మాంసాహారం, సీ ఫుడ్, గుడ్లు, పాలలో ఉంటుంది. మాంసాహారం తీసుకోని వారు జింక్ కోసం పాలపై ఆధారపడవచ్చు. ఇవి మెమరీ పవర్ ను పెంచడంలో సహాయపడుతాయి.

క్యాలిక్యులేటర్ వినియోగం: చిన్నచిన్న లెక్కల కోసం మీ బుద్ది శక్తిని ఉపయోగించండి. క్యాలిక్యులేటర్ ను ఉపయోగించడం మానేయండి. లెక్కలు వేయడం, మనస్సులోనే క్యాలిక్యులేట్ చేయడం వల్ల మెమరీ పవర్ పెంచుకోవచ్చు.

చెస్: చదరం ఆట ఆడటం వల్ల మెదడుకు పని పెట్టడం వల్ల మెదడు ఆలోచన శక్తి పెరిగి మెమరీ పవర్ పెరుగుతుంది. కాబట్టి చెస్, మరియు అక్షరాలు నింపే పట్టికలు వంటివి ఆడుతుంటే మెమరీ పవర్ పెరగుుతుంది. మతిమరుపు తగ్గుతుంది.

English summary

Best Foods To Increase Memory | జ్ఞాపకశక్తి(మెమరీ పవర్)పెంచే బెస్ట్ ఫుడ్స్...!

The advent of technology in our lives has done more of bad than good. The memory storage in our phones, the facilities of getting all the information at one click has let down our memories. Apart from that the daily stress that we go through and the sedentary lifestyle has added to the woes to our memory. On the other hand a bad memory is termed to be a serious handicap, especially when it affects our daily life. This not only lets our confidence down but also our performance at work.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more