For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పైల్స్ నివారణకు వంటింటి వస్తువులే ఉత్తమ పరిష్కారం.!

|

తెల్లారుతుందంటేనే భయం. అసలు తెల్లవారితే టాయిలెట్‌కు వెళ్లాలికదా అని రాత్రి నుంచే భయం. ప్రతి ఉదయం ఒక బ్యాడ్ మార్నింగ్. ముళ్ల మీద కూర్చుంటున్న ఫీలింగ్. మొలల బాధ అనుభవిస్తే తప్ప తెలియదు. ‘అక్కడి' నుంచి రక్తస్రావం అవుతుంటే కలిగే భీతి వేరు... వైద్యపరిభాషలో హిమరాయిడ్స్ అని పిలిచే పైల్స్‌తో జనాభాలో 50 శాతంమంది బాధపడుతున్నారు. మలద్వారం వద్ద ఉండే కణజాలంలో రక్తనాళాలు చాలా ఎక్కువ. కొందరిలో ఈ రక్తనాళాలు వ్యాకోచించినట్లుగా అయి ఉబ్బి బుడిపెలా మారతాయి. కొందరిలో ఇవి మల ద్వారం నుంచి బయటకు వచ్చేసి బాధిస్తాయి. పైల్స్ లేదా హెమరాయిడ్స్ అనే ఆ బుడిపెలు ఒరుసుకుపోవడం వల్ల ఒక్కోసారి రక్తస్రావం అవుతుంది. మరి కొందరిలో అవి మలద్వారం వద్ద తీవ్రమైన దురద, నొప్పితో బాధిస్తుంటాయి.

హెమరాయిడ్స్ లేదా పైల్స్ అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధరణమైన అనారోగ్యపు సమస్యగా మారింది. అందుకు కారణం ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు వల్ల అనేక రకాలైన అనారోగ్యాల భారీన పడుతున్నారు. అధిక బరువు, తలనొప్పి, బ్యాక్ పెయిన్ వంటి సాధారణ సమస్యలతో పాటు మరొకటి పైల్స్. సాధారణంగా ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాదే అయినప్పటికి.. జీవన శైలిలో మార్పుల వల్ల పైల్స్ ఏర్పడుతున్నాయి. హెమరాయిడ్స్‌ని సామాన్య పరిభాషలో పైల్స్ అంటారు. మనం తెలుగులో వీటిని మొలలు అని అంటాం. ఇది సర్వసాధారణమైన సమస్య. కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారికి తరచుగా వచ్చే సమప్య పైల్స్‌. అందుకు కారణం సరియైనా ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి వాటితోనే ఈ సమస్య ఏర్పడుతుంది. నీరు తక్కువగా త్రాగడం, మద్యం అతిగా సేవించుటం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు అతిగా తినడం, మాంసాహరం తరుచుగా తినటం- వీటన్నింటి వలన పైల్స్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

లక్షణాలు: మల విసర్జన సాఫీగా జరుగదు. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, మంట వుంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతుంది. మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి మంట రెండు గంటల వరకు ఉంటుంది. విరోచనం కాకపోవడం వీరికి బాధ కలిగిస్తుంది. సుఖ విరోచనం కాకపోవడంతో చిరాకుగా కోపంగా ఉంటారు. మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్‌) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి. ఒకసారి వస్తే చాలాకాలంపాటు వేధించే సమస్య ఇది. ముఖ్యంగా జీవనశైలి, ఆహారం, కూర్చుని చేసే ఉద్యోగం- ఈ వ్యాధికి కారణం అవుతాయి. మనుషులు చురుకుగా ఉండలేరు. ఎక్కడికంటే అక్కడికి ప్రయాణాలు చేయలేరు. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. లేదా అప్పుడప్పుడే ఈ సమస్య మొదలవుతున్నా లేదా ఈ సమస్య రాకుండా నివారించాలన్నా కొన్ని బెస్ట్ నేచురల్ రెమడీస్ ను ఉన్నాయి. వాటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య ను నుండి బయటపడవచ్చు.

జీలకర్ర: కొద్దిగా జీలకర్ర తీసుకొని రోస్ట్ చేయలి. తర్వాత రోస్ట్ చేయని జీలకర్రను ఒక టేబుల్ స్పూన్ తీసుకొని, ఈ రెండింటిని మిక్స్, చేసి పౌడర్ చేయాలి. ఇలా మెత్తగా తయారు చేసుకొన్న పౌడర్ ను ప్రతి రోజు ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగాలి.

మజ్జిగ: ఒక గ్లాస్ మజ్జిగ లేదా లస్సీ తీసుకొని, దానికి ఒక 1/4tspయాలకుల పొడిని మిక్స్ చేసి, చిటికెడు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి తాగాలి. పైల్స్ తగ్గించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

అరటిపండు: ఒక కప్పు పాలలో ఒక అరటి పండును ముక్కలుగా చేసి ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని ఒక రోజులో కనీసం మూడు సార్లు త్రాగాలి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో అరటిపండు బాగా సహకరిస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక బెస్ట్ హోం రెమడీ.

జ్యూస్: క్యారెట్ మరియు బీట్ రూట్ నుండి చిక్కగా ఉడికించి తీసిన రాసాన్ని చల్లారినిచ్చి వాపు ఉన్న సిరలు మీద అప్లై చేయడం వల్ల ఉపశమనం కలిగిస్తుంది మరియు వాపు వల్ల వచ్చే నొప్పిని నివారిస్తుంది.

బేకింగ్ సోడా: వాపుతో బాధపడుతుంటే కనుక, అప్పుడు పైల్స్ కు బేకింగ్ సోడా ఉత్తమ పరిష్కారం. పైల్స్ వల్ల వాపు ఏర్పడ్డ వాపు సిరలు మీద బేకింగ్ సోడాను అప్లై చేయడం వల్ల ఇన్ల్ఫమేషన్ ను తగ్గిస్తుంది.

కాకరకాయ: పైల్ నివారించడంలో ఇది ఒక బెస్ట్ నేచురల్ హోం రెమెడీ. కారకాయ చెట్టు ఆకులను పైల్స్ నివారణకు ఉపయోగించవచ్చు. కాకరకాయ రసాన్ని తాగడం వల్ల కూడా పైల్స్ ను నివారించవచ్చు. అలాగే కాకరకాయ చెట్టు ఆకులను మెత్తగా రుబ్బి, ఆ రసాన్ని వాపు ఉన్న చోటో మర్దన చేస్తే వాపు, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

వేపాకు మరియు గోధుమ గడ్డి: కొన్ని సందర్బాల్లో, పైల్స్ తో బాధపడుతన్న వారికి, గోధుమగడ్డి మరియు వేపాకు చాలా సింపుల్ హోం రెమెడీ. వేపాకును, మరియు గోధుమ గడ్డిని ఒక కప్పు నీళ్ళలో ఉడికించాలి. ఈ ఉడికించిన రసాన్ని పైల్స్ తో బాధపడుతున్న వారు తాగడం వల్ల పైల్స్ ను నివారించడంతో పాటు జీర్ణాశయంలోని వ్యర్థాలను సులభంగా తొలగిస్తుంది.

బెర్రీస్: పైల్స్ ను నివారించడంలో బెర్రీస్ అద్భుతంగా పనిచేస్తాయి. బౌల్ మూమెంట్ సాఫీగా జరిగేలా చేస్తాయి. బెర్రీస్ పైల్స్ ను నివారించడంతో పాటు, ఇన్ఫ్లమేషన్ కు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లోకి బ్లాక్ బెర్రీస్, చెర్రీస్ మరియు ద్రాక్ష వంటి ఆహారాలను చేర్చుకోవడం ఉత్తమ పరిష్కార మార్గం.

అల్లం: అల్లంను, నిమ్మరసం, పుదీనా మరియు తేనె అన్నింటినీ కలిపి, ఒక గ్లాస్ నీళ్ళు పోసి కషాయంలా తయారు చేయాలి. మొలల నివారిణకు ఇది ఒక ప్రభావంతంమైన హోం రెమడీ. ఇది మీ జీవక్రియను కూల్ గా ఉంచి మరియు టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

ముల్లంగి: ముల్లంగి రసం : పైల్స్ కు ఒక గ్లాసు ముల్లంగి రసం చాలా అద్భుతంగా చేస్తుంది. ముందుగా 1/4కప్పుతో ప్రారంభించి, రోజు రోజుకూ అరకప్పు రసంను పెంచుకుంటూ పోవాలి.

నీరు నీరు: పైల్స్ తగ్గాలంటే, నీరు అధికంగా తీసుకోండి. 8 నుండి 10 గ్లాసుల నీరు ప్రతిరోజూ తాగండి. తాజా పండ్ల రసాలు, వెజిటబుల్ సూప్ మొదలైనవి పైల్స్ నివారణకు సహకరిస్తాయి. ప్రతి రోజూ శరీరానికి సరిపడా నీళ్ళు త్రాగడం వల్ల బౌల్ మూమెంట్ సరిగా ఉంటుంది. శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

డైట్: పైల్స్ నివారణకై పీచు అధికంగా వుండే ఆహారం తీసుకోండి. ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. తాజా దొరికే గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్ తరచూ ఆహారంలో తప్పని సరిగా వుండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, తాజాపళ్లు, పీచుపదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. పాలిష్ చేయని తృణధాన్యాలతో వండిన పదార్థాలను తీసుకోవాలి. ద్రవాహారం, మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. క్రమబద్ధంగా ఒకేవేళలో మలవిసర్జనకు వెళ్లేలా అలవాటు చేసుకోవాలి. తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం చేయాలి. ఈ జాగ్రత్తలతో కొద్దిపాటి తీవ్రత ఉన్న మొలలను నివారించుకోవచ్చు. కాని నొప్పి తీవ్రతరమై, రక్తస్రావం అవుతుంటే దానికి నిర్దిష్టమైన చికిత్స అవసరం.

అంజీర పండు: అంజీర పండు రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే మలబద్ధకం పోయి పైల్స్ వ్యాధి నయమైపోతుంది.

పసుపు: పసుపుల అనేక వైద్య లక్షణాలు కలిగి ఉంది. మీరు సహజంగా పైల్స్ ను నివారించాలనుకుంటే పసుపుకొమ్మ లేదా పసుపును నీటిలో వేసి ఆ నీటిని బాగా తాగాలి.

దానిమ్మ: హెమరాయిడ్స్ కు మరో చక్కటి హోరెమడీ ఎర్రని పండ్ల తొక్క బాగా సహాయపడుతుంది. కొన్ని నీళ్ళలో దానిమ్మ తొక్కను వేసి బాగా ఉడికించి, వడగట్టి రోజుకు ఒకటి రెండు సార్లు తాగుతుండాలి

English summary

Best Natural Remedy For Piles

Cushions of tissue in the anal canal which are full of blood vessels, supporting tissue, muscle and elastic fibres are called haemorrhoids. When these haemorrhoids become inflamed, they are called piles. Piles differ in sizes and can occur either inside the anus or outside the anus.