For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సొరకాయలోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

|

సొరకాయ అంటే కొంతమందికి నచ్చదనుకుంటా.కాని ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సొరకాయ జ్యూసు ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తుంటారు. సొరకాయ పేరు వినగానే చాలా మందికి నోరూరకపోవచ్చు... ఆ పేరు పెద్దలకు ఎంత ప్రీతిపాత్రమో పిల్లలకు అంత బాధాకరం కావచ్చు... పిల్లలు, యువత పెద్దగా ఇష్టపడకపోవచ్చు... టిఫిన్‌ బాక్సులో ఆ కూర పెడితే పిల్లలు శిక్షగా భావించవచ్చు... కానీ... సొరకాయ చేసే మేలు ఇంతింతకాదు. ఆ కూరగాయ వల్ల ఆరోగ్యానికి వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. చక్కటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి సొరకాయ చాలా బాగా సహకరిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

పసుసురంగుతో కలసిన ఆకుపచ్చరంగులో ఈ కాయ ఉంటుంది. లోపల తెల్లటి గట్టిపదార్థం, అందులో స్పాంజ్‌లాంటి పదార్థంలో తెల్లటి గింజలు ఉంటాయి. ఇదీ... ఈ కూరగాయ స్వరూపం. సంప్రదాయబద్ధమైన వైద్య చికిత్సలో సొరకాయను ఎక్కువగా వాడతారు. సొరకాయను ఏ వ్యాధులకు ఏ రూపంలో వాడతారో, సొరకాయ ఎన్ని రకాలుగా మన ఆరోగ్యానికి దోహదం చేస్తుందో, సొరకాయలో ఉండే ఉత్తమ గుణాలు ఏమిటో చూద్దాం.

కాల్షియం, పాస్పరస్‌, విటమిన్ - సి, బి.కాంప్లెక్క్ష్ , సొరకాయలో లబిస్తాయి . సొరకాయలో పీచు పదార్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది , సులువుగా జీర్ణమవుతుంది .డయూరెటిక్ గా పనిజేస్తుంది . ముత్రనాళాల జబ్బులకు ఇది మంచిది . పచ్చిసొరకాయ రసం దాహార్తిని అరికడుతుంది , అలసటను తగ్గిస్తుంది. సొరకాయలో పీచు పదార్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇనుము, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా సొరకాయ తినడం వల్ల శరీరానికి సమకూరుతాయి. తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తినేవారికి సొరకాయ చక్కటి అదనపు ఆహారంగా పనికివస్తుంది. సొరకాయను ఏ వ్యాధులకు ఏ రూపంలో వాడతారో, సొరకాయ ఎన్ని రకాలుగా మన ఆరోగ్యానికి దోహదం చేస్తుందో తెలుసుకుందాం...

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

జీర్ణశక్తికి బాగా సహాయపడుతుంది: ఈ సొరకాయలో 92శాతం నీరు ఉండటం వల్ల, తిన్న ఆహానం మరింత శక్తివంతంగా తేలికగా జీర్ణం అవ్వడానికి బాగా సహాయపడుతుంది. ఈ వెజిటేబుల్ ను మీ భోజనంతో పాటు తీసుకోవడం వల్ల, జీర్ణ క్రియ మరింత వేగవంతం అవుతుంది.

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

డయాబెటిస్: సొరకాయలో పీచు పదార్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బి.పి., మదుమేహ వ్యాధిగ్రస్తురకు సొరకాయ మంచి ఆహారం అని అందరూ ఒప్పుకుంటారు. ఎవరైతే మధుమేహంతో బాధపడుతున్నారో, వారు సొరకాయను తిని, శరీరంలోని ఇన్సులిన్ లెవల్స్ ను సమతుల్యంగా ఉంచుకోండి.

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

టెంపరేచర్: మీకు ఉన్నట్లుండి శరీరంలో ఉష్ణోగ్రత అధికం అవుతున్నట్లైతే, అలాగే సెడన్ గా తిరిగి చల్లదనం పొందితే, దీనికి కారణం మీ శరీరంలో ప్లే(havoc)తగ్గిపోవడమే. ఈ ఉష్ణోగ్రతను రెగ్యులేట్ చేసుకోవడానికి, ఈ బాటిల్ గార్డ్, సొరకాయను తీసుకుంటే మంచిది. ఇది మీ శరీరంలో ఉష్ణోగ్రతను క్రమబద్దం చేస్తుంది.

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

బరువు తగ్గిస్తుందిం వండినా, రసం రూపంలో తీసుకున్నా సరే సొరకాయ అన్ని రకాలుగా ఆరోగ్యానికి ఆలంబనగా ఉంటుంది. ఉన్న బరువు కాపాడుకోవాలన్నా, తగ్గాలనుకున్నవారికి సొరకాయ ఎంతగానో సహాయపడుతుంది. సొరకాయ, శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది . ఈ గ్రీన్ వెజిటేబుల్ శరీరంలోని కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది. కాబట్టి బాటిగార్డ్ ను జ్యూస్ లా తయారుచేసి, త్రాగి బరువు తగ్గించుకోండి.

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

లివర్: లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలంటే బాటిల్ గార్డ్(సొరకాయను)ఆహార రూపంలో తీసుకోవాలి. ఈ గ్రీన్ వెజిటేబుల్ కాలేయంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది . అన్ని రకాల కాలేయ సమస్యలను నివారిస్తుంది.

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కిడ్నీ: కిడ్నీ సమస్యలున్నవారు, ఆల్రెడీ మీరు డయాలసిస్ చేసుకంటున్నట్లేతే, ఈ గ్రీన్ బాటిల్ గార్డ్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే. డయాలసిస్ చేసుకొనే వారిలో ఇది మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ గా ఉంచతుంది.

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

డయేరియా: డయేరియాతో బాధపడుతున్నారా?బాటిగార్డ్(సొరకాయ)అన్ని రకాల కడుపు సంబంధిత సమస్యలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. సొరకాయను ముక్కలుగా చేసి, జ్యూస్ చేసి, చిటికెడు ఉప్పు వేసి, మూడురోజులు తీసుకొన్నట్లైతే, కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా త్వరగా తగ్గిపోతుంది.

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

నిద్రలేమి: నిద్రలేమి సమస్య?ఈ సమస్యతో బాధపడుతున్నట్లైతే, ఈ గ్రీన్ వెజిటేబుల్ ను డిన్నర్ లో తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది నిద్రలేమి వారికి చక్కగా నిద్రపట్టేలా చేస్తుంది. ఉడికించి లేదా జ్యూస్, చేసి తీసుకోవచ్చు.

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

మలబద్దకం: పీచు పదార్థం ప్రధానంగా ఉండడం వల్ల సొరకాయ, అజీర్ణానికి చక్కటి ఔషధంగా పని చేస్తుంది. మలబద్ధకం, మొలలు వంటి అనేక రకాల

రోగాలను సొరకాయ నివారిస్తుంది.

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

యూరినరీ ఇన్ఫెక్షన్ మరియు మూత్ర సంబంధ వ్యాధులకు దివ్యౌషధం : ప్రతిరోజు తినే ఆహారంతో పాటు ఒక గ్లాసు సొరకాయ రసంలో ఒక చెంచా నిమ్మరసం కలిపి తాగితే ఎంతో మంచిది. మూత్రంలో యాసిడ్‌ అధికంగా ఉన్న కారణంగా మూత్రనాళంలో ఉండే మంటను ఇది తగ్గిస్తుంది. అయితే వైద్యుని పర్యవేక్షణ మాత్రం మరువకూడదు.

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

బాలనెరుపుకు నివారణ మార్గం : ఆయుర్వేదం ఏం చెబుతోందంటే... ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు సొరకాయ రసం తాగినట్లయితే జుట్టు చిన్నవయసులోనే నెరవకుండా కాపాడుతుంది.

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

చర్మ సంరక్షణకారకం : శరీరం పొడిబారకుండా, నిగనిగ మెరవడానికి సొరకాయ సహాయపడుతుంది. మీ చర్మం అంతర్గతంగా పరిశుభ్రపడడానికి ప్రకృతి సిద్ధంగా లభించే ఔషధంగా సొరకాయను వాడవచ్చు. అనేక రకాల చర్మ సంబంధమైన రుగ్మతల నుంచి సొరకాయ కాపాడుతుంది. శరీరంపై వచ్చే మచ్చలను తొలగించడానికి కూడా సొరకాయ దోహదపడుతుంది.

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

శక్తికి మరో పేరు : తీవ్రమైన అతిసార, మధుమేహం, కొవ్వు అధికంగా ఉన్న, వేయించిన పదార్థాలు తినడం వల్ల సంభవించే విపరీతమైన దాహానికి మంచి విరుగుడుగా సొరకాయ పనిచేస్తుంది. శరీరం అధిక మోతాదులో సోడియం నష్టపోకుండా చూస్తుంది. అలసటపాలు కాకుండా కాపాడుతుంది.

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

చల్లదనం కాయ నైజం : సొరకాయ నిలువెల్లా నీరు నిండి ఉండడం వల్ల ఆహార పదార్థంగా వండి తిన్నప్పుడు సులభంగా త్వరగా అరిగిపోతుంది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. వేసవికాలంలో ఉదయం పూట ఒక గ్లాసు సొరకాయ రసం తాగడం వల్ల వడదెబ్బనుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ పని చేయడానికి అయినా వైద్యుల సలహా తీసుకోవడం చాలా అవసరం.

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కొత్త ఉత్సాహాన్ని..బలాన్ని అంధించే సొరకాయ

కాబట్టి సాధ్యమైనంతవరకు ఎక్కువగా మనం తినే ఆహారంలో సొరకాయ ఒక భాగంగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. వంటకంగా తినడానికి ఈ కాయకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. రసం రూపంలో తీసుకోవాలంటే మాత్రం వైద్యుని సలహా తప్పని సరిగా తీసుకోవాలి.

English summary

Bottle Gourd Benefits For Health

When it comes to our veggies, parents always advice us on eating green vegetables as it contains a lot of proteins. One of these green vegetables which we would like to advice you upon is the bottle gourd.
Desktop Bottom Promotion