For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోటి దుర్వాసనకు గల ఆశ్చర్యకరమైన కారణాలు..!

|

నోటి దుర్వాసన అనేది ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటువంటి చాలా బాధాకరమైన విషయం. ఈ సమస్య వల్ల మీరు నలుగురితో సంతోషం గడపలేరు? మరియు నలుగురిలో హాపీగా నవ్వలేరు? అంతే కాదు మీతో ఉండే వారు మీ మీద జోకులేయడం కూడా మొదలు పెట్టేయవచ్చు. మనం ఎల్లప్పుడు నోటిదుర్వాసనకు కారణం నాలుమీద ఫలకం(పాచీ), కావిటీస్ మరియు పంటి గాయం వంటివే నోటి దుర్వాసనకు కారణం అని ఆలోచిస్తుంటాం. అయితే నోటి దుర్వాసనకు కొన్ని ఆశ్చర్యకరమైన మరియు మనకు తెలియని కొన్ని కారణాలున్నాయి. మీరు నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతూ..వివిధరకాల చిట్కాలతో పోరాడుతూ మరియు అది వదిలించుకోవలేకపోతున్నారు . అటువంటప్పుడు నోటి దుర్వాసనకు మరేదైన మీకు తెలియని వింత కారణాలు కోసం ఆలోచించాలి.

నోటి దుర్వాసనకు కొన్ని మెడికల్ కారణాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, లివర్ సమస్యల వల్ల కూడా మీ నోరు దుర్వాసన రావడానికి కారణం కావచ్చు . ఇంకా మూత్రపిండాలు పాడైపోవడం వల్ల (కిడ్నీఫెయిల్యూర్) వల్ల కూడా మీ నోరు చేపల వాసన వస్తుంటుంది. నోటి దుర్వాసనకు ఇతర కారణాలు వివిధ రకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు, థ్రోట్ ఇన్ఫెక్షన్ (గొంతు ఇన్ఫెక్షన్)తో కూడా మీ నోటి దుర్వాసనకు ఒక ప్రత్యేకమైన కారణం కావచ్చు...

నోటిదుర్వాసనకు మరికొన్ని కారణాలు మీరు తీసుకొనే ఆహారం మరియు అలవాట్లు వెనుక దాగి ఉన్నాయి. ఉదాహరణకు. ఒవరైతే నిద్రించే సమయంలో నోరు తెరుచుకుని నిద్రపోతారో అటువంటి వారిలో కూడా నోటి దుర్వాసన సమస్య ఉంటుంది. అలాగే ఎవరైతే ఎక్కువ మద్యపానం తాగుతారో అటువంటి వ్యక్తులు కూడా ఈ నోటి దుర్వాసన సమస్యను ఎదుర్కొంటారు.

నోటి దుర్వాసనకు ఇటువంటివి మరెన్నో కారణాలు ఉన్నాయి...వాటిని ఒకసారి పరిశీలించండి....

బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయడం(బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం): ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనేది మీ కడుపుకు లేదా మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు మీ నోటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి పెంచడానికి సహాయపడుతుంది. మరియు నోటి దుర్వాసనకు కారణం అయ్యే మీ నాలుక మీద ఉండే బ్యాక్టీరియాను క్లియర్ చేస్తుంది.

లివర్ ప్రాబ్లమ్స్(కాలేయ సమస్యలు): కాలేయానికి సంబంధించిన ఫ్యాటీ లివర్ లేదా కామెర్లు వంటి కాలేయ సమస్యలు కూడా మీ నోటి దుర్వాసనకు కారణం కావచ్చు. క్రొవ్వు జీవక్రియల బాధత్య కాలేయానిదే. ఎప్పడైతే ఈ బాద్యత కాలేయ వహించదో అప్పడు నోటిలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దాంతో నోటి దుర్వాసనకు కారణం అవుతుంది.

మౌత్ అల్సర్(నోటి పూత): నోటిపూత వల్ల పళ్ళు పుచ్చిపోవడం, మరియు నోట్లో గాయాలేర్పడటం జరుగుతుంది . నోటి అల్సర్ వల్ల గాయాలేర్పడ్డ ప్రదేశం నుండి రక్తం లేదా చీము రావడం జరగవచ్చు. ఇలా తరుచూ బాధిస్తుంటే కనుక ఇది నోటి దుర్వాసనకు దారితీస్తుంది.

చిగుళ్ళ నుండి రక్తస్రావం: మీకు చిగుళ్ళు నుండి రక్తస్రావం జరుగుతుంటే అప్పుడు అది నోట్లో పేరుకుని ఉండిపోవడం వల్ల మీ శ్వాస చెడుగా ఉంటుంది. అదే నోటి దుర్వాసనకు కారణం అవుతుంది.

థ్రోట్ ఇన్ఫెక్షన్(గొంతు నొప్పి) : ఎప్పుడైతో గొంతు నొప్పి, జులబు వంటి సమస్యలతో బాధపడుతుంటారో అప్పుడు కొన్నిబ్యాక్టీరియాలు శ్వాసవాహిక యొక్క కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో మ్యూకస్ ఫ్యూయల్ స్మెల్ వస్తుంది.

కిడ్నీ ఫెయిల్యూర్: మూత్రపిండాలు పాడైతే..నోటిదుర్వాసనకు ఇది ఒక ప్రధాన మెడికల్ రీజన్. ఇది మీ నోటిని చేపల వాసన వచ్చేలా చేస్తుంది.

డైట్: మీరు కనుక అధిక ప్రోటీనులున్న ఆహారాలు తీసుకుంటున్నట్లైతే అవి ఖచ్చితంగా నోటి దుర్వాసనకు కారణం అవుతాయి. ఎందుకంటే వాటిలో ఉండే అమినోయాసిడ్స్ నోటిలో బ్యాక్టీరియా ఏర్పటు చేస్తుంది.

మద్యపానం సేవించటం: అధికంగా మద్యపానం సేవించడం వల్ల సేలవెరీ గ్లాండ్స్ పొడిబారడం జరుగుతుంది. ఈ గ్రంధులు నోటి దుర్వాసనకు కారణం అయ్యే నోటిలోని బ్యాక్టీరియాను శుభ్రపరచడానికి క్లియర్ చేయడానికి సహాయపడుతాయి. కాబట్టి తగినంత సలివ గ్రంథులు లోపిస్తే తప్పకుండా నోటి దుర్వాసన పాలు కావాల్సి ఉంటుంది.

నిద్రభంగిమ: నిద్రపోయేటప్పుడు బోర్లా పడుకోవడం వల్ల వారు ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవడం కష్టం అవుతుంది. అటువంటి సమయంలో ఎక్కువగా నోటి ద్వారా శ్వాస పీల్చుకోవడం జరుగుతుంది. అందువల్ల నోటిలో లాలాజలం లేకుండా ఎండిపోవడం వల్ల నోటి దుర్వసనకు కారణం అవుతుంది.

మందులు: కొన్ని మందులు నోటిని పొడిబారిలే చేస్తాయి. అంటే నోట్లో తేమ లేకుండా చేస్తాయి. పెయిన్ కిల్లర్స్, యాంటీడిప్రెజెంట్స్ మరియు మూత్రస్రావం కూడా మీ నోరు పొడిబారేలా చేస్తుంది. నోట్లో లాలాజలం లేకపోవడంతో నోటి దుర్వాసన పెరగుతుంది.

English summary

Causes Of Bad Breath That Will Surprise You | నోటి దుర్వాసనకు గల ఆశ్చర్యకరమైన కారణాలు..!

Mouth odour is an embarrassing problem. It can cause a great deal of social stigma and make you the butt of many jokes. We always think about the obvious causes of bad breath like plaque, cavities and tooth infection. However, bad breath has many causes that are surprising and hidden. If you are battling with mouth odour and you are unable to get rid of of it inspite of trying everything, then you should consider thinking for some strange causes of bad breath.