Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
స్త్రీలలో ఈ సమస్యలకు మందు కొబ్బరి బొండాం....
కొబ్బరి నీళ్ళు(కొబ్బరి బోండాం)ఆరోగ్యానికి చాలా మంచిదని అందిరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ కొబ్బరి నీళ్ళు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. మరియు శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవికాలంలో మనల్ని ఈ కొబ్బరి నీరు రిఫ్రెష్ చేయడమే కాకుండా, వివిధ రకాల ఆరోగ్యాలకు ఉపయోగపడుతుంది. అందరికి అందుబాటులో ఉండే మధురమైన లేత కొబ్బరిబొండం నీటిలో అనేక ఔషధ విలువలు ఉన్నాయి. కొబ్బరి నీటిని ఏ కాలంలో అయినా అందరూ తాగవచ్చు. వేసవిలో మాత్రమే కాదు ఏ కాలంలోనైనా తాగే పానీయాలలో ముఖ్యమైనవి, ఆరోగ్యాన్నిచ్చేవి కొబ్బరి నీళ్ళు. అందరికి అందుబాటులో ఉండే మధురమైన లేత కొబ్బరిబొండం నీటిలో అనేక ఔషధ విలువలు ఉన్నాయి. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా వేసవిలో మాత్రం రోజుకు ఒక కొబ్బరి బొండం తాగితే వేసవి రుగ్మతల నుంచి రక్షణ లభిస్తుంది.
బ్బరి నీళ్ళలో దివ్య ఔషధాలు ఉన్నాయి. దాహం తీర్చడమే గాక ఇందులో ఉండే మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. అంతేగాకుండా కొబ్బరి నీళ్లలో శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంది. వాత, పిత్త గుణాలను హరిస్తాయి. లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ గాను, క్రొవ్వులు అస్సలుండవు,చెక్కెర పరమితం గాను ఉండును. కొబ్బరి నీటిలో ఉండే పొటాసియం గుండె జబ్బులకు మంచిది, వేసవి కాలములో శరీరాన్ని చల్లబరుస్తుంది, వేసవిలో చెమట కాయలు, వేడి కురుపులు, అమ్మవారు జబ్బు పొక్కులు తగ్గేందుకు కొబ్బరినీతిని లేపనంగావాడాలి. కొన్ని రకల పొట్టపురుగులు కొబ్బరి నీటివల్ల చనిపోతాయి, ముత్రసంభందమైన జబ్బులలోను, కిడ్నీ రాళ్ళు సమస్యలలో ఇది మంచి మందుగా పనిచేస్తుంది. మినెరల్ పాయిజన్ కేసులలో పాయిజన్ ని క్లియర్ చేస్తుంది. కొబ్బరి రక్త శుద్ధిలో కొబ్బరి నీళ్ళ పాత్ర ఆమోఘం ఒక్క మాటలో చెప్పాలంటే కొబ్బరి నీరు గ్లాసు పాలకంటే కూడా పుష్టికరం.
ముఖ్యంగా కొబ్బరి నీళ్ళు మహిళలకు చాలా ఆశ్చర్యకరమైన ఆరోగ్యపు విలువను ఇస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మహిళలు సంతానోత్పత్తికోసం కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగుతుంటారు. ఇంకా మహిళలకు ఈ కొబ్బరి నీళ్ళలో తల్లిపాలలో ఉండే లారిక్ యాసిడ్ లాంటి సుగునాలన్నీ కూడా కలగలిసి ఉన్నాయి. అంతే కాంకుడా ఇంకా కొన్ని మహిళలకు మంచి ఆరోగ్యాన్ని ఏవిధంగా కలిగిస్తుందో ఒక సారి చూద్దాం...

1. హెల్తీ ప్రెగ్నెన్సీ డ్రింక్: గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యకమైన టానిక్. మహిళలు గర్భం ధరించకు ముందు ధరించిన తర్వాత ఈ కొబ్బరి నీళ్ళత్రాగడం వల్ల శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. ఇందులోని ఎలెక్ట్రోలైట్స్, క్లోరైడ్స్, కాల్షియం, పొటాషియం, సోడియం, రెబోఫ్లోవియా వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య కరమై పోషకాంశాలు కొబ్బరినీళ్ళలో దొరుకుతాయి.
2. యూరిన్ ఇన్ఫెక్షన్: చాలా మంది మహిళలు తరచుగా ఈ సమస్యకు గురి అవుతుంటారు. ఈ కొబ్బనీరు త్రాగడం వల్ల యూటీఐలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాబట్టి ఒక రోజుకి రెండు కొబ్బరి బోండాలు తీసుకోడం మంచిది.
3. డీహైడ్రేషన్: కొబ్బరి బొండం నీటిలో పొటాసియం ఎక్కువగా ఉంటుంది. శరీరములో నీటి లేమిని (Dehydration)కరక్ట్ చేస్తుంది. ఆరోగ్య పరంగా జీర్ణకోశ బాధల తో బాధపడే చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి ఆహారము, విరోచనాలు అయినపుడు ఓరల్ రి-హైద్రాషన్ గా ఉపయోగపడుతుంది,
4. బరువు తగ్గిస్తుంది: ఇదో మరో అద్భుతమైన ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్. ఇది మహిళలకు మాత్రమే కాదు పురుషులకు కూడా మంచిదే. కొబ్బరి నీటిలో లోక్యాలరీస్ కలిగి ఉండి, శరీరంలోని విషాలను బయటకు నెట్టివేస్తుంది. జీవక్రియను క్రమం చేసి రక్తనాళాలకు ఆక్సిజెన్ ను అందిస్తుంది.
5. వైజనల్ బర్నింగ్ అరికడుతుంది: డీహైడ్రేష్ లేదా వైజనల్ ఇన్ఫెక్షన్ వంటివి వైజినల్ బర్నింగ్ కారణం అవుతుంది. అందు వల్ల కొబ్బరి బోండాం త్రాగడం వల్ల తక్షణ ఉపశమనం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











