For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ రకాలుగా బాధించే కడుపునొప్పి నివారణ చిట్కాలు..!

|

కడుపు నొప్పి (Abdominal pain/stomach pain)కడుపునొప్పి అంటే పొట్ట భాగంలో ఏదో ఒక చోట నొప్పి రావటంగా చెబుతారు. కొన్ని సార్లు నొప్పి వచ్చిన చోటనే ఉండి పోవచ్చు. మరికొన్ని సార్లు ఈ నొప్పి మిగిలిన ప్రాంతాలకు వ్యాపించవచ్చు. నొప్పి ఎటువెైపు నుంచి ఎటు వెైపుకి వెళుతోంది అన్నది కూడా ముఖ్యమే. వాస్తవానికి మానవ జీర్ణ వ్యవస్థలో అనేక భాగాలు ఉన్నాయి. ప్రాథమిక ఆహార వాహికలో భాగంగా జీర్ణాశయం లేక కడుపు, ఆంత్రమూలం, చిన్న పేగు, పెద్ద పేగు అనే భాగాలతో పాటు కాలేయం, క్లోమం అనే అనుబంధ గ్రంథులు ఉంటాయి. వీటిలో వాపు వచ్చినా, ఇన్‌ ఫెక్షన్‌ సోకినా, రక్త ప్రసారానికి అంతరాయం ఏర్పడినా కడుపు నొప్పి అనిపిస్తుంది. సరిగ్గా జీర్ణాశయం లేక కడుపు దగ్గరే నొప్పి వస్తోందా లేక ఇతర ప్రాంతాల నుంచి అటూ ఇటూ వ్యాపిస్తోందా అన్నది కూడా ముఖ్యమే.

ఏదో ఒక సందర్భంలో వచ్చి పోతే దాన్ని మామూలు నొప్పి గా భావించవచ్చు. కానీ, తరచు నొప్పి వస్తుండటం, నొప్పి వచ్చినప్పుడు ఎక్కువసేపు ఉండటం, నొప్పి తీవ్రంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం దీని గురించి ఆలోచించాల్సిందే. కడుపు నొప్పి రక రకాల కారణాలతో తలెత్తవచ్చు. చాలాసార్లు ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం వలన ఈ నొప్పి తలెత్తుతుంది. లేదా ఎక్కువ ఆహారం తీసుకొన్నప్పుడు జీర్ణం అయ్యే క్రమంలో ఒడిదుడుకులు ఏర్పడి నొప్పి రావచ్చును. ఇది సాధారణమైన విషయం. అంటే కాస్తంత దూరం నడవటం, లేదా సోడా వంటివి తీసుకోవటం వంటి చర్యలతో ఈ పరిస్థితిలో మార్పు తీసుకొని రావచ్చును. అంత మాత్రాన అన్ని నొప్పులు ఈ బాపతే అనుకోకూడదు.

కడుపునొప్పిని సాధారణమైన విషయంగా అంచనా వేస్తుంటారు. ఇది అన్ని విధాలా సరెైన అంచనా కానే కాదు. కొన్ని సార్లు కడుపు నొప్పిని క్లిష్టమైన సమస్యగానే గుర్తించాలి. ఈ నొప్పితో పాటు ఇతర లక్షణాలు కలిసి ఉన్పప్పుడు తీవ్రతను తెలుసుకోవాల్సి ఉంటుంది. జ్వరం, ఆహారం తీసుకోలేక పోవటం, విరోచనం కాకపోవటం, వాంతులు, రక్తపు వాంతులు, విరోచనంలో రక్తం పడటం, శ్వాస కష్టంగా ఉండటం, నొప్పి తీవ్రంగా విస్తరించటం, కడుపుని తాకితే నొప్పి ఎక్కువగా ఉండటం, గతంలో ఏదెైనా గాయం తగిలిన తర్వాత చోటు చేసుకొనే నొప్పి, ఎక్కువ కాలం నొప్పి ఉండటం వంటివి ముఖ్యమైన అంశాలుగా చె బుతారు.

చాలా వరకూ కడుపు నొప్పి రావడానికి కారణం తెలుసుకొన్నట్లైతే చాలా సులభంగా తగ్గించుకోవచ్చు . మీకు ఆబ్డోమినల్ పెయిన్ లేదా కడుపు నొప్పి లేదా ఇతర అసౌకర్యమైన కడుపు నొప్పిని చాలా సులభంగా నివారించుకోవచ్చు. మీరు తెలుసుకునేందుకు కొన్ని రకాల కడుపు నొప్పుులు మరియు వాటిని నివారించుకొనే చిట్కాలు కొన్ని మీకోసం...

వివిధ రకాల కడుపు నొప్పులు..నివారణ చిట్కాలు..!

యాసిడ్ రిఫ్లెక్స్: యాసిడ్ రిఫ్లెక్స్ అనేది మీరు స్టొమక్ యాసిడ్స్ (కడుపు ఆమ్లాలతో స్పందించలేనప్పుడు)ఇది ఏర్పడుతుంది. మీరు చాలా సమయం వరకూ ఏమి తీసుకోకపోవడం వల్ల కడుపులో యాసిడ్ ఎంజైమ్స్ లు చాలా బలమైనవిగా మారుతాయి. అటువంటి సమయంలో మీరు తీసుకొనే ఆహారం వల్ల కూడా యాసిడ్ రిఫ్లెక్స్ మరింత పెరుగుతుంది. యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గించుకోవాలంటే చల్లటి పాలు తాగడం ఉత్తమమైన మార్గం.

వివిధ రకాల కడుపు నొప్పులు..నివారణ చిట్కాలు..!

గ్యాస్ తో నిండిన కడుపు: గ్యాస్ అంటే ఏం లేదు. కొంత గాలితో కడుపు నిండి ఉంటుంది. ఈ గాలి మీరు అధికంగా ఫైబర్ ఫుడ్స్(క్యాబేజ్) తీసుకొనే సమయంలో ఉత్పన్న అవుతాయి. మీ కడుపు నొప్పిగా అనిపించడంలో గుండెల్లో మంటగా అనిపించడం వల్ల గ్యాస్ కు కారణం అవుతుంది. కాబట్టి ఈ సమస్య నుండి బయటపడాలంటే పవన్ముక్తాసనం చేయడం మేలు. ఈ యోగాసనం వల్ల తక్షణ ఉపశమనం అంధిస్తుంది.

వివిధ రకాల కడుపు నొప్పులు..నివారణ చిట్కాలు..!

గ్యాస్ట్రిక్ అల్సర్: మీరు తీసుకొనే భోజనం టైమ్ కు తీసుకోకపోయినా, యాసిడ్ ఎంజైమ్స్ కడుపు నొప్పికి దారితీస్తాయి. దాంతో కడుపులో మంటగా అనిపిస్తుంది. దీన్ని పెక్టిక్ అల్సర్ అని కూడా అంటారు. ఇది మెడిసిన్ ద్వారా నయం చేసుకోవచ్చు. అయితే ఇది ఎప్పుడు ఇలాగే కొనసాగించడం మంచి పద్దతి కాదు కాబట్టి మీ ఆహారం తీసుకొనే సమయం రెగ్యులర్ గా ఒకే సమయం ఎంపికతో పాటు..ప్రతి రెండు గంటకొకసారి ఏదోఒకటి తినడం అలవాటు చేసుకోండి.

వివిధ రకాల కడుపు నొప్పులు..నివారణ చిట్కాలు..!

అజీర్ణం: అజీర్ణం అనేది చాలా సాధారణమైన క్యూరబుల్ స్టొమక్ ప్రాబ్లమ్. మీరు అధికంగా భోజనం తిన్నా లేదా కారంగా ఉన్నా ఆహారం తిన్నా..మీ కడుపు జీర్ణక్రియ సహకరించకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో జల్ జీర(బ్లాక్ సాల్ట్ తో తయారు చేసిన జీలకర్ర నీరు)త్రాగడం వల్ల అతి సులభంగా జీర్ణం అవుతుంది.

వివిధ రకాల కడుపు నొప్పులు..నివారణ చిట్కాలు..!

లూజ్ మోషన్: లూజ్ మోషన్ ఎటువంటి సందర్భంలో ఏర్పడవచ్చంటే మీరు ఎప్పుడైతే సరిగా వండని ఆహారాలు తీసుకొన్నప్పుడు లేదా చెడిన ఆహారాలు తిన్నప్పుడు లేదా నిల్వ ఉంచిన ఆహారాలు తిన్నప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. దాంతో పలు మార్లు మీరు బాత్ రూమ్ కు వెళ్ళాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో పచ్చి అరటిపండు తినడం వల్ల మీ బౌల్ మూమెంట్ టైట్ చేస్తుంది. ఇంకా మీరు ఓఆర్ఎస్ లేదా సాల్ట్ సుగర్ వాటర్ మిక్స్ చేసి తాగవచ్చు.

వివిధ రకాల కడుపు నొప్పులు..నివారణ చిట్కాలు..!

మలబద్ధకం: అధిక ప్రోటీనులు మరియు కార్బోహైడ్రేట్స్ ను ఉన్నఆహారాలను తీసుకొన్నప్పుడు, పీచు అతి తక్కువగా ఉన్నఆహారాలను తిన్నప్పుడు మలబద్దకానికి దారితీస్తుంది. దాంతో మీకు ప్రతి రోజూ విసర్జించడానికి కష్టకావచ్చు. మలం పాస్ కాదు. దాంతో ఇది మీ ఆకలి చంపుతుంది. కడుపునొప్పికి దారితీస్తుంది. మలబద్దకం ఉన్నవారు పాలు మరియు బొప్పాయిను తరచూ తింటుండా

వివిధ రకాల కడుపు నొప్పులు..నివారణ చిట్కాలు..!

చక్కర పడకపోవడం: కొంత మంది వయోజనుల్లో పాలను జీర్ణం చేసుకోలేని ఎంజైమ్ లు ఉండవు. దాన్నే లాక్టోజ్ అని పిలుస్తారు. కాబట్టి పాలు మరియు పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల అజీర్ణానికి గురిచేస్తుంది. కాబట్టి మీరు చేయగలిగిందల్లా మీరు డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండటమే.

వివిధ రకాల కడుపు నొప్పులు..నివారణ చిట్కాలు..!

నులిపురుగులు: కొన్ని సందర్భాల్లో నులిపురుగులు అనారోగ్యకరమైన ఆహారం లేదా ఇన్ఫెక్టెడ్ ఆహారాలు తిన్నప్పుడు కడుపులో ఈ నులిపురుగులు ఏర్పడుతాయి. నిజానికి మాంసాహారం సరిగా వండకుండా లేదా నిల్వచేయకుండా తీసుకుంటే నులిపురుగులు ఏర్పడుతాయి. కడుపులో పురుగులు ఉండటం వల్ల కడుపు నొప్పికి కారణం కావచ్చు . కాబట్టి అందుకు డీవార్మింగ్ మందులను ఉపయోగించాలి.

వివిధ రకాల కడుపు నొప్పులు..నివారణ చిట్కాలు..!

చీకాకుపెట్టే పేగు వ్యాధి: ఎప్పుడతై మీరు దీర్ఘకాలం అజీర్ణంతో మరియు కడుపునొప్పితో బాధపడుతుంటారో అప్పుడు అది మీకు చికాకు పెట్టే పేగు వ్యాధి కలిగిఉన్నట్లు గుర్తించాలి. ఇటువంటి సమయంలో మీ జీర్ణశక్తి గణనీయంగా తగ్గిపోతుంది. ఇది అంత సులభంగా నయం కాదు కాబట్టి మీరు తీసుకొనే ఆహారంతో జాగ్రత్తగా ఉండాలి.

English summary

Common Stomach Problems n Their Cure | వివిధ రకాలుగా బాధించే కడుపునొప్పి నివారణ చిట్కాలు..!

In fact when we want to take a leave for no reason at all, we call in sick saying that we have an upset stomach. It is such a common stomach problem that even your boss wouldn't suspect that you are bunking work.
Story first published: Thursday, May 9, 2013, 15:34 [IST]
Desktop Bottom Promotion