For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HIV యొక్క ప్రారంభ సంకేతాలు

By Lakshmi Perumalla
|

HIV ని హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ అని పిలుస్తారు. ఇది అత్యంత అంటుకొను వ్యాధి మరియు రోగనిరోధక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఈ ఘోరమైన వ్యాధి వచ్చినప్పుడు మీరు ప్రారంభ చికిత్స పొందవచ్చు. కాబట్టి దీని గురించి సాధారణ లక్షణాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. కొన్ని సంక్రమణ ప్రారంభ సంకేతాలను అందిస్తుంది. అప్పుడు నిర్ధారణ సులభం అవుతుంది. HIV పరీక్షించే విధానం ఇబ్బంది మరియు కఠినముగా ఉంటుంది. అయితే నేడు HIV పరీక్షలకు అనేక మార్గాలు ఉన్నాయి.

HIV ని గుర్తించడానికి ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ సెంటర్ లో తగిన సదుపాయాలు ఉన్నాయి. HIV చికిత్స మరియు రోగుల రికార్డులను రహస్యంగా నిర్వహిస్తారు. ప్రారంభ చికిత్స AIDS తీవ్రత మరియు సంక్రమణ పురోగతి నివారించేందుకు అవసరం. HIV సంకేతాలు వ్యాధి దశ మరియు దాని తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. సోకిన వ్యక్తి యొక్క శరీరం ద్రవాలమార్పిడి ద్వారా ఇతరులకు వ్యాధి సంక్రమిస్తుంది. దీనికి చికిత్స చేయడం చాలా ముఖ్యం.

HIV

HIV సంకేతాలు అనేక సంవత్సరాలు సుషుప్తిలో ఉండి తర్వాత మాత్రమే బయటకు వస్తాయి. మీకు HIV ఉందని సందేహం ఉంటే కనుక వెంటనే సరైన స్పెషలిస్ట్ తో మాట్లాడి పరీక్ష చేయించుకోవటం మంచిది. ప్రపంచ ఎయిడ్స్ డే ను HIV గురించి ప్రజలలో చికిత్స మరియు కారణాల గురించి అవగాహన పెంచడానికి అంతర్జాతీయ స్థాయిలో జరుపుతున్నారు. ఇక్కడ మీరు గమనించవలసిన కొన్ని HIV సంకేతాలు ఉన్నాయి.

1. మీరు బరువు అదనపు కిలోలు కోల్పోతే

మీ బరువులో ఆకస్మిక మార్పులు మరియు మీరు వేగంగా సాధారణ బరువు కంటే వేగంగా కోల్పోవడం కనుగొంటే మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఇది HIV సంకేతాలలో ఒకటి కావచ్చు. మీరు బరువు నష్టాన్ని సైతం వ్యాధి సంకేతంగా పరిగణించవచ్చు.మీ నిరోధక వ్యవస్థ దారుణంగా ఉందని అర్థం.

2. మీకు నిరంతరాయంగా దగ్గు ఉంటే

పొడి దగ్గు కూడా HIV సంకేతాలలో ఒకటి.మీరు దుమ్ము అలెర్జీ అని పొరబడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వ్యాపించే సమయంలో మీకు లక్షణాలు మరీ తీవ్రంగా ఉన్నాయేమో గమనించండి.

3. మీ గోర్లు తెలియచేస్తాయి

HIV సంక్రమణకు మీ గోర్ల మార్పులు కారణం కావచ్చు. HIV సంకేతాలు అసహజంగా ఉండవచ్చు. కానీ జాగ్రత్తలు తీసుకోవాలి.మీ గోర్లు విభజన లేదా రంగు పాలిపోయి ఉండవచ్చు. మీకు వీటిలో ఏమైనా ఉంటే ముందు నిర్ధారణకు చూడండి.

4. మీకు అలసట తాకినట్లయితే

మీకు రోజులో ఎక్కువ సమయం నీరసం మరియు అలసటతో కూడిన అనుభూతి ప్రారంభంమైతే అది HIV సంకేతాలలో ఒకటి కావచ్చు. అప్పుడు మీరు జాగ్రత్త వహించండి.అలసట మీ ప్రారంభ సంకేతం మరియు మీ సంక్రమణ తరువాత సంకేతం కూడా కావచ్చు.

5. అబ్బా ఓహ్!

మీరు కండరము మరియు కీళ్ళ నొప్పితో ఎక్కువ భాదతో అరుస్తూ ఉంటే,అప్పుడు HIV కోసం పరీక్ష చేయించుకోవాలి. ఇది HIV సంకేతాలలో ఒకటి కావచ్చు. ప్రతి సంవత్సరం వరల్డ్ ఎయిడ్స్ డే రోజున HIV తో ప్రభావితమైన ప్రజల యొక్క మొత్తం నిజాలు మరియు సంఖ్యలను వెలుపలకు తీసుకువస్తుంది.

6. తల నొప్పి

తలనొప్పి జీవితంలో ఒక భాగంగా మారింది. కానీ ఇది HIV సంకేతం కావచ్చు. అందువల్ల గమనించండి. ఇది ప్రారంభ చిహ్నాలలో ఒకటి. అంతేకాక తరచుగా ఎఆర్ఎస్ గా వ్యవహరించబడుతుంది.

7. మీ చర్మాన్ని గమనించండి

చర్మం మీద బొబ్బలు రావటం అనేది సర్వసాధారణం. అయితే వ్యాధి ప్రారంభంలో లేదా తరువాత దశలలో కూడా ఏర్పడవచ్చు.అక్కడ మీ చర్మంపై దురద ప్రాంతాల్లో ఉండవచ్చు. కాబట్టి మీ చర్మంను సన్నిహితంగా పరిశీలించండి.

ప్రతి సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్ డే ను డిసెంబర్ 1 న జరుపుకుంటారు.ప్రపంచ ఎయిడ్స్ డే 2013 యొక్క థీమ్ "జీరో పొందడం: జీరో న్యూ HIV అంటువ్యాధులు" అని ఉంది. ప్రతి సంవత్సరం ప్రజలలో అవగాహన సృష్టించడానికి ప్రచారాలు నిర్వహిస్తారు. HIV అంటువ్యాధులకు వ్యతిరేకంగా ప్రచారం సమర్ధవంతంగా చేయడానికి వస్తువులు మరియు సాంకేతిక డేటా విడుదల కూడా ఉన్నాయి. HIV అంటువ్యాధుల గురించి తెలుసుకొని దానిని అడ్డుకునేందుకు ప్రయత్నిద్దాము.

English summary

Early signs of HIV

HIV, also known as Human Immuno Deficiency Virus is a highly contagious disease, that could affect the immune system. When it comes to the deadly infection, it is a must to know the common symptoms, so that you can get it treated at the earliest.
Story first published: Saturday, November 30, 2013, 20:27 [IST]
Desktop Bottom Promotion