For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేప నూనెతో లాభనష్టాలు తెలుసుకోండి..!

|

అవిసెగింజల మాత్రలు, చేప నూనె రెండింటి లోను ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3 పరిశోధన సంస్ధ నిర్వహించిన పరిశోధన ప్రకారం, ఈ ఆమ్లాలు ఆరోగ్యకరమైన చర్మాన్ని, కేశాల్ని, గోళ్ళని అందిస్తాయి. సరైన మెదడు పనితీరుకు కూడా ఇది అవసరం, ఒత్తిడి చికిత్సకి ఒమేగా-3 లు సమర్ధవంతంగా పని చేస్తాయి. అవిసెగింజల మాత్రలలోని ఒమేగా-3 లు మొక్కల నుండి తయారవుతాయి, కాగా చేప నూనె - పేరుకు తగ్గట్టు - జంతు మూలాల నుండి కొవ్వు ఆమ్లాలు తయారవుతాయి. ఫలితంగా, ఈ పదార్ధాల వల్ల కొన్ని లాభాలూ ఉంటాయి, నష్టాలూ ఉంటాయి.

ప్రయోజనాలు

అవిశగింజల మాత్రలు, చేప నూనెలో వుండే ఒమేగా-3లు రక్తంలోని ట్రైగ్లిసరైడ్ స్థాయిని తగ్గించటంతో పాటు గుండె పోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అథెర్ స్క్లేరోటిక్ ప్లేక్ పెరుగుదల ను తగ్గించడానికి, అధిక రక్తపోటు నిర్వహణకు, కీళ్ళ నొప్పుల వల్ల బిగుసుకుపోయే కీళ్ళ ను౦చి ఉపశమనానికి కూడా సహాయపడుతుంది. అల్జీమర్ వ్యాధితో, మధుమేహంతో, కాన్సర్ లేదా హైపర్ ఆక్టివిటీ లోపంతో బాధపడే వారు ఈ ఒమేగా-3 వాడడం వల్ల లాభం పొందవచ్చని ఒమేగా-3 పరిశోధన సంస్థ వారు పేర్కొన్నారు.

ఏ ఎల్ ఏ, ఇ పి ఏ, డి హెచ్ ఏ

ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్(ఏ ఎల్ ఏ) అనేది అవిశే విత్తనంలో కనిపించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లం. ఈ కొవ్వు కాలేయం లోపల ఎకోసపెంటానాయిక్ యాసిడ్ (ఇ పి ఏ)గా, తరువాత డేకోసహేక్సానోయిక్ యాసిడ్ (డి హెచ్ ఏ)గా మార్చబడుతుంది ఈ రెండు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలూ ఆరోగ్యానికి, శ్రేయస్సుకి కీలకమైనవి. అయితే, ఆరోగ్య జాతీయ సంస్థ వారు ఇటీవల నిర్వహించిన పరిశోధన ప్రకారం ఈ మార్పిడి ఇంతకు ముందు విశ్వసి౦చిన దాని కన్నా తక్కువ సమర్ధంగా వుందనేది గమనించవలసిన ముఖ్యవిషయం. ఆహారంలో ఇ పి ఏ, డి హెచ్ ఏ కంటే ఏ ఎల్ ఏ లో తక్కువ వనరుగా ఉంటుందని అధ్యయనంలో నిర్ధారించారు. చేప నూనె ఇ పి ఏ, డి హెచ్ ఏ కి సహజ మూలం. చేప నూనె వాడితే శరీరం ఈ కొవ్వు ఆమ్లాల ప్రయోజనాలు పూర్తిగా అందుకుంటుంది, ఎందుకంటే దీనికి మార్పిడి అవసరం వుండదు.

Fish Oil

పాదరసంతో కాలుష్యం

సముద్రాలలో చాలా చేపలు పాదరసంతో కలుషితమై ఉంటాయి. పాదరసం నాడీ వ్యవస్థను కలుషితం చేస్తుంది - కాలేయ సమస్యల నుంచి మెదడు పనిచేయక పోవడం దాకా అన్నిటినీ కలుగచేస్తుంది. మీరు చేప నూనెలను ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు వనరుగా ఎంచుకుంటే, మీ సప్లిమెంట్ లో పాదరసం వుండే ప్రమాదం పొంచి వుంది. మరో వైపు అవిశ గింజల మాత్రలలో పాదరసం వుండదు.

దుష్ప్రభావాలు

దీనిని అధిక మోతాదులో తీసుకు౦టే, ఒమేగా-3 రక్తస్రావ౦ పెరిగేలా చేస్తుంది. ఫలితంగా, రక్తం పలుచన చేసే మందులతో పాటు ఈ పదార్ధం తీసుకునేటప్పుడు జాగ్రత్త పాటించాలి. పైగా చేప నూనె నోటిలో దుర్వాసన కలిగించే అవకాశం వుంది.

ప్రత్యామ్నాయాలు

చేప నూనె, అవిశ గి౦జల మాత్రలకు వాటి వాటి లోపాలు వున్నాయి. వీటికి మంచి ప్రత్యామ్నాయం బంగారు రంగు ఆల్గే. ఈ ఆల్గే ను సముద్రం నుంచి తీయడం కాకుండా, విడిగా సాగు చేస్తారు, దాని వల్ల, దీంట్లో చేప నూనె లో లాగా పాదరసం వుండే ప్రమాదం లేదు. కొన్ని సంస్థలు యి పి ఎ, డి హెచ్ ఎ రెండూ పుష్కలంగా వుండే బంగారు రంగు ఆల్గే ను అందిస్తాయి; దీని వల్ల ఇది అవిశ గింజల మాత్రల కన్నా మంచిది - ఎందుకంటే శరీరం ఈ రెండు విలువైన ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అందుకోవడానికి ఎ ఎల్ ఎ మార్పిడి చేయక్కరలేదు.

English summary

Flaxseed Tablets Vs. Fish Oil | చేప నూనెతో లాభ..నష్టాలు....!

Flaxseed tablets and fish oil are both rich in omega-3 fatty acids. According to research conducted by the Omega-3 Research Institute, these acids promote healthy skin, hair and nails. They are also essential for proper brain functioning, and supplementation with omega-3s has been used to effectively treat depression.
Desktop Bottom Promotion