For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుతుక్రమ(పీరియడ్స్)సమయంలో తినాల్సిన ఉత్తమ ఆహారాలు

|

నెలకోసారి ఆడవారికొచ్చేదే రుతుస్రావం(పీరియడ్స్). దీనినే మెన్సెస్‌ అనీ, బహిష్టు అనీ, రుతుక్రమం (పీరియడ్స్)అనీ అంటుంటారు. స్త్రీ గర్భంతో వున్నా, బాలింతగా వున్నా, మరీ తక్కువ బరువుతో బలహీనంగా వున్నా రుతుస్రావం కాదు. క్రమం తప్పకుండా రుతుస్రావం అయితే ఆ స్త్రీ ఆరోగ్యాన్నీ, గర్భదారణాసామర్థ్యాన్నీ కలిగివుందని అర్థం. నిజానికి గర్భధారణకి, రుతుస్రావానికి సంబంధం వుంది. రుతుస్రావం అయితేనే స్త్రీ గర్భవతి కాగలుగుతుంది. ఆడపిల్ల మొట్టమొదటి సారిగా రుతుస్రావం కావటాన్ని రజస్వల అంటారు. రుతుక్రమం సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి మీరు హెల్తీ డైట్ ను అనుసరించాలి. ఈ రుతుక్రమ సమయంలో మీరు చాలా అలసటగా, చీరాకుగా మరియు ఉదరం ఉబ్బుకొని ఉండటం వంటివి చాలా సాధరణ సమస్యలు. అదే సమయంలో మీకు కొన్ని ఆహారాల మీద మనస్సు మళ్ళు, ఏదైన ఫ్రై చేసినవి లేదా, పొటాటో చిప్స్ వంటివి తినాలనిపిస్తుంది. ఇటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల మీశరీరంలో అదనపు క్యాలరీలు చేరడంతో పాటు, ముందు ఉన్నదానికి కంటే మరింత వరస్ట్ గా తయారువుతారు. మీరు నెలసరి క్రమం తప్పకుండా, రెగ్యులర్ గా వస్తుంటే మీరు సరైన మంచి పోషకాహారంను తీసుకోవల్సి ఉంటుంది.

మహిళల్లో ప్రతి నెలా వచ్చే రుతుక్రమ సమయంలో తలనొప్పి, వెన్నునొప్పి వస్తుంది. నిద్ర సరిగా పట్టదు. ముఖం పైన మొటిమలు వస్తాయి. దిగాలుగా, చికాకుగా అనిపిస్తుంది. రొమ్ములు బరువుగా అయి, చిన్నపాటి ఒత్తిడికే నొప్పిగా అనిపిస్తుంది. ఆకలి పెరగడం, ఇవన్నీ శరీరంలో ఏర్పడే అనేక మార్పుల వల్ల జరగుతాయి. రుతుక్రమ సమయంలో ఒక్కసారిగా జీవనశైలి మారుతుంది. కాబట్టి ఈ సమయంలో మహిళలకు తగినంత విశ్రాంతి మరియు వ్యాయామం అవసం. ప్రతి నెలా వచ్చే ఈ రుతుక్రమ సమయంలో ఫిట్ గా ఉండటం చాలా అవసరం.

మహిళలలు రుతుక్రమ సమయంలో శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడంతో పాటు, కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. ఈ ఆహారాలు రుతుక్రమాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇంకా రుతుక్రమంలో వచ్చే అనేక అసౌకర్య సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి, ఈ సమస్యలన్నింటిని ఎదుర్కోవడానికి రుతుక్రమ సమయంలో మంచి పోషకాహారంను తీసుకోవాలి. ఆ ఆహారాలేంటో ఈ క్రింది లిస్ట్ ద్వారా తెలుసుకోండి...

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

రుతుక్రమం(పీరియడ్) సమయంలో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా అవసరం. ఆకు కూరలు మీరు రెగ్యులర్ డైట్ లో మొదటి ఎంపిక. పీరియడ్స్ సమయంలో మీ శరీరానికి తగినంత ఐరన అవసరం అవుతుంది. కాబట్టి, గ్రీన్ లీఫ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అయితే, మోతాదుకు మించి తీసుకోవకూడదు. మోతాదు మించితే, కడుపు ఉబ్బరానికి కారణం అవుతుంది.

చేపలు:

చేపలు:

రుతుక్రమ సమయంలో సాల్మన్ మరియు తున వంటి రెండు రకాల చేపలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ రెండు రకాల చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రుతుక్రమ సమయంలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కండరాలు విశ్రాంతి చెండానికి సహాయపడుతాయి.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

ఈ ముదురు వర్ణపు అరటి పండులో పొటాషియం మరియు విటమిన్ 6 పుష్కలంగా ఉంటుంది. ఇవి రెండు కూడా పీరియడ్స్ సమయంలో మహిళలకు చాలా అవసరం. పీరియడ్స్ సమయంలో అరటి పండ్లు తినడం వల్ల బౌల్ మూమెంట్ కూడా క్రమబద్దం చేస్తుంది.

నీళ్ళు:

నీళ్ళు:

రుతుక్రమ సమయంలో మహిళలు ఒక రోజుకు 5లీటర్ల నీళ్ళు త్రాగడం చాలా ముఖ్యం. అవసరం. రుతుక్రమ సమయంలో మహిళలలు శరీరం నుండి ఎక్కువ నీరును కోల్పోతారు . రుతుక్రమ సమయంలో డీహైడ్రేషన్ ప్రధాన సాధారణ సమస్యకు కారణం అవుతుంది. అందువల్ల ఈ పీరియడ్స్ సమయంలో తగినంత నీరు త్రాగడం చాలా అవసరం.

రెడ్ మీట్:

రెడ్ మీట్:

పీరియడ్ సమయంలో రెడ్ మీట్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే రెడ్ మీట్ లో ఐరెన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. మీరు లీన్ రెడ్ మీట్ ను తీసుకోవడం, సలాడ్స్ రూపంలో తీసుకోవడం వల్ల, మీలో ఎనర్జీనీ పెంచడంతో పాటు, మీ మెనుస్ట్రువల్ ఫ్లోను రెగ్యులేట్ చేస్తుంది.

లెగ్యూమ్స్:

లెగ్యూమ్స్:

మీరు వెజిటేరియన్ అయితే, మీ రెగ్యులర్ డైట్ లో ఎక్కువ లెగ్యుమ్స్ ను చేర్చుకోవాలి. రుతుక్రమ సమయంలో బీన్స్ ను తీసుకోవడం వల్ల మీ శరీరానికి అవసరం అయ్యే ఐరన్ పుష్కలంగా లభ్యం అవుతుంది. ఇది శరీరం సమతుల్యంగా ఉంచడానికి సహయపడుతుంది.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

ప్రతి మహిళకు చాక్లెట్స్ తినడం మంటే మహా ఇష్టం. రుతుక్రమ సమయంలో మహిళలు చాక్లెట్స్ ను ఎందుకు తినాలంటే, ఇందులో మెగ్నీషియం ఉన్నందున మీ రుతుక్రమ సమయాన్ని రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది .

నట్స్:

నట్స్:

మీ రుతుక్రమ సమయంలో నట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. పీరియడ్స్ సమయంలో తగినంత ఎనర్జీని ఇచ్చే వాటిలో బాదం మరియు వాల్ నట్స్ ప్రధానమైనవి. ఉప్పు ఎక్కువగా ఉన్న పిస్తాలను తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ఉప్పు ఉన్న నట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో నీరు కోల్పోవడానికి దారితీస్తుంది.

నువ్వులు:

నువ్వులు:

రుతుక్రమ సమయంలో ధనియాలు ఒక ఉత్తమం ఆహారం. వీటిలో అధిక శాతంలో ఐరన్ ఉంటుంది. కాబట్టి, పీరియడ్స్ సమయంలో వీటిని ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. అలాగే మీరు రుతుక్రమాన్ని రెగ్యులేట్ చేయడానికి ఇవి బాగా సహాయపడుతాయి.

పండ్లు:

పండ్లు:

రుతుక్రమ సమయంలో పండ్లు తీసుకోవడం చాలా ఆరోగ్యమైనది. ప్లమ్స్, బెర్రీస్, డ్రైడ్ ఫిగ్స్ మరియు వాటర్ మెలో వంటి తాజా పండ్లను తీసుకోవడం వల్ల మీ రుతుక్రమ సమస్యలను నివారించుకోవచ్చు . ఇది రక్తప్రసరణకు మరియు రుతుక్రమ తిమ్మెరలు తగ్గించడానికి సహాయపడుతాయి.

English summary

Foods To Consume During Period

The reason why chocolate is a good food to consume during your period is because it contains magnesium, a nutrient that gets depleted whilst on your cycle
Desktop Bottom Promotion