For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాన్సిల్స్ కు తక్షణ ఉపశమనం కలిగించే ఆహారపానీయాలు....!

|

టాన్సిల్స్ అనేది గొంతులో ఇన్ఫెక్షన్ కలగడం. టాన్సిల్స్‌ గొంతులో రెండు వైపులా ఉండి, శరీరానికి రక్షక కవచంలా పనిచేస్తాయి. బయట నుండి వచ్చే దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిములను, కాలుష్యకారక పదార్థాలను శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ టాన్సిల్స్ సమస్య పెద్దల్లో కంటే పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో చాలా మంది చిన్న పిల్లలు ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఈ టాన్సిల్స్ శోషరస కణజాలానికి ఇరువైపులా చిన్న గడ్డల్లా ఉంటాయి. టాన్సిల్స్‌ సైజు పెరిగి వాపు రావడం వల్ల గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్షన్‌ కారక క్రిములు ఎక్కువ కావడం వల్ల టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌ కు గురై గొంతునొప్పి మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరిపోకపోవడం వల్ల కూడా టాన్సిల్స్‌ సమస్య మొదలవుతుంది.

టాన్సిల్స్ ఉన్న వారి లక్షణాలు ఎలా ఉంటాయి? గొంతు భాగంలో టాన్సిల్స్‌ వాపు ఎర్రగా కనిపిస్తుంది. దాంతో గొంతు నొప్పి, చెవినొప్పి, తలనొప్పి, జలుబుతో కూడిన జ్వరం, ఆహారం మింగడం, నీళ్ళు త్రాగడానికి, గాలిపీల్చడానికి, బాగా మాట్లాడటానికి కష్టమౌతుంది. ఒక్కో సందర్భంలో నోరు బొంగురుపోతుంది. గొంతు తడిఆరిపోతుంది. గొంతు ఎర్రబారుతుంది. నోరు దుర్వాసన వస్తుంది. నీరసం, చికాకు వంటి లక్షణలు ఎక్కువగా కనిపిస్తాయి.

టాన్సిల్ ఉన్నప్పడు సరైన జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా నయం అవుతుంది. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు కొన్ని మృదువైన ఆహారాలను ఉదాహరణకు పాస్తా, అన్నం, పెరుగు, పుడ్డింగ్ వంటివి నోట్లో మ్రింగడానికి చాలా సులభం అవుతుంది. కొన్ని రకాల సిట్రస్ పండ్లు, కొన్ని చల్లని లేదా పుల్లని పండ్లు మరియు స్నాక్స్ తినడం వల్ల గొంతు నొప్పి మరింత తీవ్రం కావడమే కాక, గొంతులోపల దురదగా అనిపిస్తుంది. కాబట్టి, మీరుటాన్సిల్స్ సమస్యతో బాధపడుతున్నట్లైతే, మీరు ఖచ్చితంగా సరైనటువంటి న్యూట్రిషియన్ ఆహారం తీసుకోవడం వల్ల మ్రింగడానికి మాత్రమే కాకుండా థ్రోట్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.

మంచి ఆహారం తీసుకోవడంతో పాటు కొన్ని పానీయాలు కూడా గొంతు ఇన్ఫెక్షన్ ను నయం చేస్తాయి. హెల్తీ ప్లూయిడ్స్(ఆరోగ్యకరమైన పానీయాలు)గోరువెచ్చని నీళ్ళు ల్లో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె మిక్స్ చేసి త్రాగవచ్చు. ఇవి బ్యాక్టీరియాను నాశనం చేయడమే కాకుండా గొంతునొప్పిని నివారిస్తుంది. గొంతులో దురుద, గొంతుగరగర, చికాకు నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా, డీహైడ్రేషన్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. టాన్సిల్స్ ఉన్నప్పుడు ద్రవాలు లేదా పానియాలు త్రాగడం లేదా మింగడం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటప్పుడు కొద్దిగి గోరువెచ్చని నీటిని మరియు ఇతర హెల్తీ లిక్విడ్స్ ను త్రాగవచ్చు. వేడినీళ్ళు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. గొంతునొప్పి, చికాకును తొలగించి ఉపశమనాన్ని అందిస్తుంది. టాన్సిల్స్ సహజనివారణకు సహాయపడే కొన్ని ఆరోగ్యవంతమైన ఆహారాలు మరియు పానీయాలు మీకోసం.....

టాన్సిల్స్..గొంతు ఇన్ఫెక్షన్ కు నివారణోపాయలు..

ఉడికించిన అన్నం: ఉడికించిన అన్నం మెత్తగా ఉండటమే కాకుండా మ్రింగడానికి సులభంగా ఉంటుంది. స్పైసీ రైస్ ప్రిపేర్ చేయడం కంటే ప్లెయిన్ రైస్ తినడం మంచిది. మరీ ప్లెయిన్ గా తినడం ఎలా అనుకొంటే టాన్సిల్స్ నివారణకు ఉపయోగపడే మసాలా దినుసులు(చెక్క, లవంగం వంటివి)కలుపుకోవచ్చు.

టాన్సిల్స్..గొంతు ఇన్ఫెక్షన్ కు నివారణోపాయలు..

పాస్తా: గొంతునొప్పితో బాధపడేవారికి ఉడికించిన పాస్తా చాలా మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. గొంతు నొప్పి, గొంతగరగర, గొంతు వాపును నివారిస్తుంది. ముఖ్యంగా చాలా మృదువుగా ఉండటం వల్ల మ్రింగడానికి చాలా సులభం అవుతుంది.

టాన్సిల్స్..గొంతు ఇన్ఫెక్షన్ కు నివారణోపాయలు..

ఉడికించిన ఆకుకూర: ఉడికించిన గ్రీన్ ఫీలీవెజిటెబుల్స్, ఆకుకూరలు వంటివి థ్రోట్ ఇన్ఫెక్షన్ నివారించడానికి సహాయపడుతాయి. ఆకుకూరలు బాగా ఉడికించి ఆరసంలో పెప్పర్ పౌడర్ వేసి గోరువెచ్చగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు గొంతునొప్పిని నివారిస్తుంది.

టాన్సిల్స్..గొంతు ఇన్ఫెక్షన్ కు నివారణోపాయలు..

బంగాళదుంప: గొంతు నొప్పి నివారణకు ప్రభావితం చేసే వాటిలో ఇది మరొక హెల్తీ ఫుడ్. బంగాళదుంపలను బాగా ఉడికించి పొట్టు తీసి, గరిటతో మెత్తగా చిదమాలి. లేదా చేస్తో మెత్తగా కలుపుకోవచ్చు.

టాన్సిల్స్..గొంతు ఇన్ఫెక్షన్ కు నివారణోపాయలు..

అల్లం: అల్లం ఆరోగ్యానికి ప్రభావితం చేయడమే. కాక టాన్సిల్స్ తగ్గించడానికి, గొంతు ఇన్ఫెక్షన్ కు ఇదొక మంచి హోమ్ రెమడీ. గొంతునొప్పికి తక్షణ ఉపశమనం పొందడానికి కొద్దిగా తేనెలో అల్లపౌడర్ లేదా అల్లం చూర్ణాన్ని కలుపుకొని సేవించవచ్చు. ఇంకా అల్లం పొడి దగ్గును నివారిస్తుంది.

టాన్సిల్స్..గొంతు ఇన్ఫెక్షన్ కు నివారణోపాయలు..

తేనె: టాన్సిల్స్ తగ్గించడానికి తేనెను అలాగే తినవచ్చు. లేదా తేనెలో కొంచెం బ్లాక్ పెప్పర్ మిక్స్ చేసి తీసుకోవచ్చు. థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఇదొక మంచి హోమ్ రెమడీ. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ ప్లమేటరీ గుణాలు కలిగి ఉండి, తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది.

టాన్సిల్స్..గొంతు ఇన్ఫెక్షన్ కు నివారణోపాయలు..

జింజర్ లైమ్: థ్రోట్ ఇన్ఫెక్షన్ ను డీల్ చేయడంలో జింజ్ లైమ్ చాలా ఆరోగ్యకరమైన, ప్రభావితమైన పానీయం.

టాన్సిల్స్..గొంతు ఇన్ఫెక్షన్ కు నివారణోపాయలు..

లెమన్ - తేనె: టాన్సిల్ తగ్గించడానికి మరో బెస్ట్ హోమ్ రెమడీ ఇది. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో, కొన్ని చుక్కల తేనె మరయు, నిమ్మరసాన్ని మిక్స్ చేసి త్రాగాలి.

టాన్సిల్స్..గొంతు ఇన్ఫెక్షన్ కు నివారణోపాయలు..

స్కాంబుల్డ్ ఎగ్స్: ఇది చాలా మృదువైన ఆహారం. ఇది మ్రింగడానికి చాలా సులభం. మరియు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

టాన్సిల్స్..గొంతు ఇన్ఫెక్షన్ కు నివారణోపాయలు..

ఇడ్లీ: ప్లెయిన్ గా ఉన్న ఇడ్లీ చాలా ఆరోగ్యకరం. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు మెత్తగా ఉండే ప్లెయిన్ ఇడ్లీని తినవచ్చు. సాంబార్, చట్నీ వంటివి వాడకపోవడమే మంచిది.

టాన్సిల్స్..గొంతు ఇన్ఫెక్షన్ కు నివారణోపాయలు..

పెరుగు: గొంతునొప్పి, టాన్సిల్స్ ఉన్నప్పుడు చాలా మంది పెరుగు తినకూడదుని చెబుతుంటారు. పెరుగు సాఫ్ట్ పుడ్ మ్రింగడానికి చాలా సులభంగా ఉంటుంది. గొంతునొప్పి మరియు దురద, గొంతు వాపు వంటివి నివారించడానికి అతి చల్లగా ఉండే పెరుగును తీసుకోకూడదు.

English summary

Foods n Drinks To Cure Tonsillitis | టాన్సిల్స్..గొంతు ఇన్ఫెక్షన్ కు నివారణోపాయలు..

Tonsillitis is a throat infection that occurs on the tonsil. Tonsils are two masses of lymph tissue that are located on each side of the throat. These tonsils prevents the respiratory organ from infections. However, tonsils can very easily get infected. Tonsillitis is often accompanied with sore throat, swollen tonsils, throat pain, itchiness, ear ache, fever and cold chills. These throat problems makes it difficult to eat and drink.
Story first published: Friday, February 8, 2013, 15:36 [IST]
Desktop Bottom Promotion