For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఆహారాలు తీసుకొంటే ఖచ్చితంగా మీ నుండి ‘చెమటలు’ బలాదూర్..!

|

చెమట పట్టడం ప్రతివారికి సర్వసాధారణం. మనుషుల ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిం చడానికి చెమట గ్రంథులు ఉపయోగపడతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి ఇవి ఉపకరిస్తాయి. ఒంటినిండా చెమట గ్రంథులు మనుషులకు ఉంటాయి. చెమటకు మూలం: చెమట ఎక్రైన్ (స్వెట్) గ్లాండ్స్ నుంచి ఉత్పత్తి అవుతుంది. మనిషి చర్మం మీద చెమట గ్రంథుల సంఖ్య అన్నది పుట్టినప్పుడే నిర్ణయమవుతుంది. పుట్టిన తరవాత కొత్తగా ఎక్రైన్ గ్లాండ్స్ అభివృద్ధి చెందవు. అయితే పుట్టాక రెండేళ్ల వయసు వచ్చేవరకు ఇవి పూర్తిస్థాయిలో పనిచేయవు. ఎక్రైన్ చెమట గ్రంధులు - పెదవులు, గోళ్లు, చెవి బయటి భాగం మినహా మిగతా శరీరమంతా వ్యాపించి ఉంటాయి.

చెమట పట్టడం మానవులలో ఒక విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. అయితే పురుషుల స్వేదంలో కామ ప్రకోపాన్ని అధికం చేసే లక్షణాలున్నట్లుగా కనుగొన్నారు. చర్మం మీది చెమట ఆవిరిగా మారినప్పుడు శరీరం చల్లబడుతుంది. ఉష్ణ ప్రదేశాలలో శరీర వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ చెమట పడుతుంది. చెమట మానసిక ఒత్తిడి వలన ఎక్కువౌతుంది. చల్లని వాతావరణంలో తక్కువగా ఉంటుంది. స్వేద గ్రంధులు తక్కువగా ఉండే కుక్క వంటి కొన్ని జంతువులలో ఇలాంటి ఉష్ణోగ్రత నియంత్రణ నాలుక మరియు నోటి గ్రంధుల ద్వారా జరుగుతుంది. చెమట కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా ఏర్పడుతుంది. తల, చంకలు మరియు ముఖంలో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రదేశాలలో చెమట పడుతుంది. స్నానం చేసిన కొద్దిసేపటికే చెమటపడుతుంది.

ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి చెమట పోస్తుంది. కొంతమందికి మరింత ఎక్కువగా పోస్తుంది. మరికొంత మందికి చాలా తక్కువగా చెమట పడుతుంది. శారీరక శ్రమ చేసేవారికి ఎక్కువగా చెమట పడుతుంది. ఈ చెమటతోబాటు శరీరంనుంచి అనాయాసంగా అమోనియా, ప్రొటీన్లు, కొవ్వు, ఆమ్ల లవణాలుకూడా శరీరంలోంచి బయటకు వచ్చేస్తాయి. చెమటతో చర్మం తేమగా వుంటుంది. ఎండకు, ఎక్కువ వేడికి చర్మం ఎండిపోకుండా ఉండేందుకు చెమట పోస్తుంది.

చెమట పట్టడం అనేది చెడ్డేమీ కాదు. ఇది శరీరానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. కాని చెమటతోబాటు దుర్గంధం రావడం కాస్త ఇబ్బందికరమైన విషయం. ఇలాంటి సమస్య అతి కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. చెమట ఎండిపోయిన తర్వాత చర్మం నుంచి యూరియా లేక్ ఉప్పులాంటి కారకాలు అధికంగా స్రవించి రోగ కారకాలను ఆకర్షిస్తాయి. ఇవే దుర్గంధానికి మూల కారణమవుతాయి.

కొంతమందికి అత్యధిక చెమట వచ్చినా కూడా దుర్వాసన రాదు. కాని కొంతమందిలో చెమట తక్కువగా వచ్చినా కూడా దుర్గంధం భరించరానంతగా వుంటుంది. దీనినుండి బయట పడటం ఏమంత కష్టం కాదు. అధిక చెమటను తగ్గించుకోవడానికి కొన్ని మంచి మార్గాలున్నాయి. మీ ఫుడ్ లిస్ట్ లో కొన్ని ఆహారాలను మార్పు చేసుకోవడం వల్ల అది సాధ్యం అవుతుంది. జీర్ణవ్యవస్థ మరియు నాడీ వ్యవస్థ రెండూ చెమటకు అనుసందానమై ఉన్నాయి. అధిక చెమటను తగ్గించుకోవడానికి లేదా కంట్రోల్ చేసుకోవడానికి మీరు తీసుకొనే డైట్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి కొన్ని ప్రధానమైన ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవాలి. అలాగే అధిక చెమటకు కారణం అయ్యే కొన్నిముఖ్యమైన ఆహారాలు(కాఫీ, కోలా డ్రింక్స్, బ్లాక్ టీ, చాక్లెట్స్, గార్లిక్, ఉల్లిపాయలు, స్పైసీ ఫుడ్స్)వంటి వాటికి దూరంగా ఉండాలి. మరి ఈ సమ్మర్ సీజన్ లో మీ శరీరంలో అధిక చెమటను పట్టకుండా చేసే కొన్ని ఆహారాలు...

సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా...!

నీళ్ళు: నీళ్ళను ఎక్కువగా త్రాగడం వల్ల, శరీరం హైడ్రేట్ లో ఉంటుంది. నీళ్ళు ఎక్కువగా త్రాగడం వల్ల చెమట పట్టడాన్ని తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. మీశరీరం ఎప్పుడైతే హైడ్రేషన్ క్రమంగా జరుగుతుంటుందో అప్పుడు తప్పనిసరిగా శరీరం వేడెక్కదు..దాంతో శరీరంలో చెమట పట్టడానికి అవకాశం లేదు.

సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా...!

పెరుగు: శరీరంలో చెమట తగ్గించడానికి ఉపయోగపడే క్యాల్షియం పెరుగులో పుష్కలంగా ఉంది. క్యాల్షియం టెంపరేచర్ రెగ్యులేటర్ లాగా పనిచేస్తుంది. కొన్ని ప్రత్యేకమైన ఆహారాల్లో..డైరీ ప్రొడక్ట్స్, బాదాం, బేక్డ్ బీన్స్, మరియు వెన్న తీసిన పాలల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంది కాబట్టి వీటి తీసుకోవడం చాలా అవసరం.

సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా...!

ఆలివ్ ఆయిల్: తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి, ఎప్పుడైతే ఎక్కువగా కష్టపడుతుందో, అది అధిక చెమటకు దారితీస్తుంది. ఆలివ్ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు ఇది అతి సులభంగా జీర్ణం అవుతుంది. కాబట్టి మీ వంటకాల్లో ఆలివ్ ఆయిల్ ను చేర్చుకోవడం చాలా ఆరోగ్యకరం.

సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా...!

తృణధాన్యాలు: శరీరంలోని వివిధ జీవక్రియలు క్రమంగా.. సాధారణంగా జరగాలంటే అందుకు బి కాంప్లెక్స్ విటమిన్స్ చాలా అవసర. అంతే కాదు కొన్ని విటమిన్ బి రిచ్ ఫుడ్స్ బ్రెడ్స్, చేపలు, గుడ్డు, నట్స్, మాంసం మరియు వెజిటేబుల్స్ కూడా ప్రధానంగా మీడైలీ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా...!

ఓట్ మీల్: ఓట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అంతే కాదు ఫ్యాట్ చాలా తక్కువ. ఇవి చాలా త్వరగా జీర్ణం అవుతాయి. దాంతో మీ శరీరఆరోగ్యం మొత్తం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా...!

పెప్పర్ మింట్: పెప్పర్ మింట్ లేదా పెప్పర్ మింట్ జ్యూస్ చెమటను నిరోధించడానికి సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను క్రమంగా పనిచేసేలా చేసి శరీరానికి కావల్సినంత కూలింగ్ ను అందిస్తుంది.దాంతో చెమట పట్టడానికి ఆస్కారం ఉండదు.

సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా...!

టమోటో: టమోటో జ్యూస్ లో చాలా రకాల విటమినులు మరియు మినిరల్స్ (పొటాషియం, మాంగనీస్) వంటి వాటిని పుష్కలంగా ఉన్నాయని కనుగొనబడింది. కాబట్టి ప్రతి రోజూ పచ్చిటమోటో తినండి లేదా జ్యూస్ చేసుకొని త్రాగండి దాంతో అధిక చెమటను తగ్గించుకోవచ్చు.

సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా...!

బాదాం: బాదాంలో మెగ్నీషియం అధిక శాతంలో కలిగి ఉండి. ఇది జీర్ణవ్యవస్థకు బాగా సహాయపడుతుంది మరియు వ్యాధినిరోధకతను పెంచడానికి సహాయపడుతుంది. బాదాం మాత్రమే కాదు, గుమ్మడి, ఆకుకూరలు మరియు సోయా బీన్స్ వంటి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ కూడా అధిక చెమటను తగ్గించడాని బాగా సహాయపడుతాయి.

సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా...!

సేజ్: ఇది నాడీ వ్యవస్థ తద్వారా చెమట యొక్క ఉత్పత్తిని నియంత్రించడానికి సహాయపడుతుంది. కొన్ని రోజుల పాటు సేజ్ టీ రెండు కప్పు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఒక గణనీయమైన మార్పను మీరు గమనిస్తారు.

సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా...!

వాటర్ మెలోన్: వాటర్ మెలో తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో అధిక శాతంలో ఫైబర్ మరియు నీటి శాతం ఉంది. ఇటువంటి పండ్లును తినడం వల్ల జీర్ణం అవ్వడానికి చాలా సులభం మరియు వీటిలో ఉండే నీటి శాతం మీ శరీరాన్ని హైడ్రేట్ లో ఉంచుతంది. వాటర్ మెలోన్ లో ఉండే విటమిన్ బి మెటబాలిక్ ఫంక్షన్ క్రమంగా ఉండేందుకు సహాయపడుతుంది.

సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా...!

కరివేపాకు: కరివేపాకు రెబ్బలను రోజువారి ఆహారంలో భాగం చేస్తే మీ చెమట సమస్య మటుమాయమవుతుంది. వివిధ రకాల కూరల్లో కరివేపాకును భాగం చేస్తే ఆరగిస్తే శరీర భాగాల ఉల్లాసంగా ఉంటాయి. కరివేపాకులో దాగి ఉన్న పోషక తత్వాలు శరీర వేడిని తగ్గించటంతో పాటు, చెమట తద్వారా వ్యాపించే దుర్వాసన నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా...!

వైట్ మీట్: ఇది మీకు తెలిసే ఉంటుంది. రెడ్ మీట్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో చెమటతో కూడిన దుర్వాసన పెరుగుతుంది. మరి దీన్ని అడ్డుకోవడానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం ఉంది. రెడ్ మీట్ కు బదులు వైట్ మీట్ (చికెన్ లేదా టర్కీ)ను తీసుకోవడం వల్ల మీరే వ్యత్యాసాన్ని గమనించవచ్చు.

సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా...!

రా వెజిటేబుల్స్: పచ్చికూరలు తినడం వల్ల విటమిన్ ఎ మరియు విటమిన్ బిలు శరీరం నుండి వచ్చే దుర్వాసనను దూరం చేయడానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం చాలా మంచిది.

సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా...!

హెర్బల్ టీ: చెమట వల్ల శరీరం నుండి వచ్చే దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్టీరియాను తొలగించడానికి, ఈ హెర్బల్ టీ అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టీ మీరు సాధారణంగా ప్రతి రోజూ తీసుకొనే టీ కి బదులుగా హేర్బల్ టీకి ప్రాధాన్య ఇవ్వడం వల్ల అధిక చెమట దాంతో వచ్చే దుర్వాసనను అరికట్టవంచ్చు.

సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా...!

గ్రీన్ హెర్బ్స్/కొత్తిమీర: పార్స్లే, కొత్తిమీర, బాసిల్ మరియు పుదీనా ఆకులు చెడు వాసన పారద్రోలేటటువంటి సాధారణ ఆహారాలు. కాబట్టి వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

English summary

Foods To Reduce Excessive Sweating | సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా...!

Sweating is a normal and essential process to regulate the body temperature and excrete waste through the skin. Sweating is controlled by the sweat glands. There are two types of sweat glands. The eccrine glands are those that are found all over your body and apocrine gland are those that are found mainly in your hair follicles.
Story first published: Tuesday, March 19, 2013, 17:52 [IST]
Desktop Bottom Promotion