For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇది గడ్డి కాదు..సర్వరోగ నివారణకు దివ్వ ఔషదం..!

|

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న తపన అధికం కావడంతో పాటుగా అందుకు సహజసిద్ధ ఉత్పత్తులను వాడాలన్న ఆకాంక్ష కూడా సమాజంలో పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా వివిధ రకాల సహజ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. గోధుమ గడ్డి లాంటి వాటి వాడకం అధికమవుతోంది.

గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని. దీనిని అనేక రోగాలకు నివారిణిగా ఉపయోగిస్తారు. ఒక గ్లాసు రసంలో 'ఎ' విటమిన్‌, బి కాంప్లెక్స, సి,ఇ,కె విటమిన్లు, కాల్షియం, ఐరన్‌,మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సెలీనియమ్‌,సోడియం, సల్ఫర్‌, కోబాల్ట్‌, జింక, క్లోరోఫిల్‌ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్‌ ఉండదు. ఒకగ్లాసులోనే 17 ఎమినో యాసిడ్స్‌ ఫైబర్‌ ఎంజైమ్స్‌ ఉంటాయంటే ఇది ఎంత ఆరోగ్యానికి ఎంత ఉపయోగకారో తెలుస్తుంది. దీనిని కేవలం గడ్డి రసం అని తీసిపారేయలేము. గోధుమ మొలకలను న్యూట్రిషనల్‌ రిజర్వాయర్‌గా పౌష్టికాహార నిపుణులు గుర్తిం చారు. గోధుమ గడ్డి ప్రయోజనాలను దిగు వన ఉదహరిస్తున్నాము.

సర్వ రోగ నివారిణి గోధుమ గడ్డి...!

అధిక రక్తపోటు నివారిణి: తీవ్ర హృద్రోగ సమస్యలకు లేత గోధుమ ఆకుల పౌడర్ దివ్యౌషదం. లోపాన్ని నివారిస్తుంది. గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు. జీర్ణకోశం లోని కొలెస్ట్రాల్‌ను ఇది కడిగేస్తుంది.

సర్వ రోగ నివారిణి గోధుమ గడ్డి...!

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: జీవకణాల్లో నిల్వ ఉండే ఉప్పునీరు, రసాయనాలు, లోహ సంబంధాలు, మత్తు పదార్థాలు, వ్యర్థాలను బయటకు పంపించి రోగనిరోధక శక్తి పెంచుతుంది. ముఖ్యంగా క్యాన్సర్‌ రోగులకు గోధుమ గడ్డి రసం తాగడం వలన వారిలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కుదుటపడుతుంది.

సర్వ రోగ నివారిణి గోధుమ గడ్డి...!

శక్తి ప్రదాయిని/నూతనోత్తేజం కలిగిస్తుంది: గోధుమ గడ్డి రసంలో ప్రొటీన్లు, ఎంజైమ్స్‌, విటమిన్లు, మినరల్స్‌ ఉన్న కారణాన ఈ రసాన్ని సేవించిన వారికి శక్తిని చేకూరుస్తుంది. గోధుమ గడ్డిలో క్లోరోఫిల్‌ ఉండటం వలన బ్యాక్టీరియాను నివారించి శరీరానికి నూతనో త్తేజం కలిగిస్తుంది.

సర్వ రోగ నివారిణి గోధుమ గడ్డి...!

బరువు తగ్గించడానికి: గోధుమ గడ్డి పెంపకం ఖర్చుతో కూడిన పని కాదు. కొవ్వు శాతాన్ని కరిగించి అధిక బరు వును, పొట్టను తగ్గిస్తుంది. ఇది శరీరంలోని మెటబాలిజంను సరిచేస్తుంది.

సర్వ రోగ నివారిణి గోధుమ గడ్డి...!

క్యాన్సర్‌ నివారిణి: గోధుమ గడ్డి రసంలో యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైటో న్యూట్రియంట్స్‌,బీటా కెరోటిన్‌, బయో ఫ్లావో నాయిడ్‌, బి,సి,ఇ విటమిన్ల కారణాన క్యా న్సర్‌ కణాలను నశింపచేస్తుంది. రోగ నివారణా శక్తిని పెంచి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది.

సర్వ రోగ నివారిణి గోధుమ గడ్డి...!

మధుమేహానికి: ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

సర్వ రోగ నివారిణి గోధుమ గడ్డి...!

చర్మ రక్షణ: ఒక గ్లాసు రసాన్ని సేవిస్తే చర్మం పై ముడుతలు రావు. ముడుతలు మటుమాయ మవడమే కాక చర్మం కాంతివంతంగా, ప్రకాశ వంతంగా ఉంటుంది. కన్నుల కింద నల్లటి వల యాలూ, మచ్చలూ రాకుండా నిరోధిస్తుంది. నేడు కాస్మటిక పరిశ్రమ గోధుమగడ్డి రసాన్ని వారిఉత్పత్తులలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి టానికగా పని చేస్తుంది. రోజూ ఆహారంలో గోధుమ గడ్డి రసాన్ని ఒక పోషక పదార్థంగా ఉపయోగించవచ్చు: ఈ రసాన్ని ఆరెంజ్‌, యాపిల్‌, ఫైనాఫిల్‌, లెమన్‌ తది తర జ్యూస్‌లతో కలిపి తాగవచ్చు. గోధుమ గడ్డి పొడిని కూడా పోషక పదార్థంగా వాడవచ్చును.

సర్వ రోగ నివారిణి గోధుమ గడ్డి...!

కేశ సంరక్షణకు: గోధుమ ఆకుల పౌడర్‌ ఆహారంగా తీసుకున్నట్లయితే, జుత్తు రాలడం, తెల్లబడడం తగ్గుతుంది.

సర్వ రోగ నివారిణి గోధుమ గడ్డి...!

థైరాయిడ్: థైరాయిడ్‌ సమస్యను పోగొడుతుంది.

సర్వ రోగ నివారిణి గోధుమ గడ్డి...!

రుతు సమస్యకు: రుతు సమస్యలను తగ్గిస్తుంది.

సర్వ రోగ నివారిణి గోధుమ గడ్డి...!

మలబద్దకం: గోధుమ ఆకుల పౌడర్‌ వాడినట్లయితే మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు.

సర్వ రోగ నివారిణి గోధుమ గడ్డి...!

ఎసిడిటి/గ్యాస్ట్రిక్: ఎసిడిటీని తగ్గిస్తుంది. గ్యాస్ట్రబుల్ను పోగోడుతుంది. కొవ్వు శాతాన్ని కరిగించి అధికబరువును, పొట్టను తగ్గిస్తుంది.

English summary

Health Benefits Of Drinking Wheat-Grass Juice | సర్వ రోగ నివారిణి గోధుమ గడ్డి...!

Wheat-grass is slowly catching up with the other power foods which are known for their health benefits. Many people are now inculcating the habit of including wheat-grass juice in their daily diet in order to boost their overall health and immune-system. Wheat-grass is basically the young grass of the wheat plant.
Desktop Bottom Promotion