For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముల్లంగి తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు..!

|

ముల్లంగి రూట్ వేజిటేబుల్. ఇది భూమిలో పండుతుంది కాబట్టి దీన్ని రూట్ వెజిటేబుల్ అంటారు. ఇది ఎక్కువగా విటర్ సీజన్ లో దొరుకుతుంది. ప్రస్తుత కాలం ఈ వెజిటేబుల్స్ , వెజిటేబుల్స్ మాత్రమే కాదు పండ్లు కూడా సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటున్నాయి. ఎందుకంటే ఆ పంట పండే సీజన్ కాకపోయినా, ప్రతి సీజన్ లో పండించేంతగా అగ్రికల్చర్ బాగా అభివద్ది చెందింది. ఈ ముల్లంగి (రాడిష్)యొక్క శాస్త్రీయనామం ‘రఫనస్ సటివస్'. ముల్లంగిని ఎక్కువగా సలాడ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో దీని వాడకం ఎక్కువ. సాంబార్, చట్నీ ఇలా వివిధ రకాలుగా వండుకుని తింటారు. ఇది మంచి రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలను ఎక్కువగా కలిగిస్తుంది.

ముల్లంగిని చాలా మంది ఆహారానికి దూరంగా పెట్టేస్తారు. ఎందుకంటే గురించి సరైన అవగాహన లేకపోవడమే అందుకు ముఖ్య కారణం. కానీ నిజానికి ముల్లంగిలో మేలు చేసే ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

ముల్లంగి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ముల్లంగి అంటే మూతి ముడుచుకుంటే ఎట్లా...?

జాండిస్(కామెర్ల)నుండి కాపాడుతుంది: ముల్లంగిని తినడం వల్ల లివర్ మరియు కడుపును మంచి కండీషన్ లో పెడుతుంది. అంతే కాదు, శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఇంకా ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్ ను సప్లై చేస్తుంది. ముల్లంగి ఆకులను మరియు బ్లాక్ రాడిష్ ను జాండిస్ నివారణకు ఉపయోగిస్తారు.

ముల్లంగి అంటే మూతి ముడుచుకుంటే ఎట్లా...?

పైల్స్(మెలలు)నివారణకు: ముల్లంగి శరీరంలోని విషాలను బయటకు నెట్టేసే గుణాలు చాలా ఉన్నాయి. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పైల్స్ నివారణకు బాగా సహాయపడుతుంది. పైల్స్ అధికంగా కాకుండా అడ్డుకుంటుంది. ముల్లంగి జ్యూస్ మన జీర్ణక్రియకు బాగా సహాయపడి పైల్స్ రాకుండా అడ్డుపడుతుంది.

ముల్లంగి అంటే మూతి ముడుచుకుంటే ఎట్లా...?

మూత్ర సంబంధిత వ్యాధులను కంట్రోల్ చేస్తుంది: ముల్లంగిలో ఉండే డ్యూరెటిక్, ఇది శరీరంలో యూరిన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో ఏర్పడే మలినాలను తొలగించడానికి, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి మరియు యూరినేటింగ్ సమయంలో ఏర్పడే బర్నింగ్ సెన్షేషన్ వంటి వాటికి నివారిణిగా పనిచేస్తుంది. ముల్లంగిని తరచూ ఆహారంతో తీసుకోవడం వల్ల శరీరంలో మలినాలను బయటకు పంపడానికి సహాయపడే కిడ్నీలు మరియు యూరినరీ సిస్టమ్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది.

ముల్లంగి అంటే మూతి ముడుచుకుంటే ఎట్లా...?

బరువు నియంత్రణ: బరువు తగ్గాలనుకొనే వారికి ముల్లంగి చాలా ఉపయోగకరం. ముల్లంగిలో జీర్ణక్రియ సక్రమంగా జరిగి విరేచనము సాఫీగా జరిగేందుకు ఉపయోగపడే పీచుపదార్థం మరియు కార్బోహైడ్రేట్స్ తో కలిగిన నీరును కలిగి ఉంటుంది. అందువల్ల బరువు పెరుగేందుకు సహకరించదు. ముల్లంగి క్యాలరీలు పెంచ కుండానే ఆకలిని సంత్రుప్తి పరుస్తుంది.

ముల్లంగి అంటే మూతి ముడుచుకుంటే ఎట్లా...?

క్యాన్సర్ నివారిణి: ముల్లంగిన మన డైలీ డయట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ (కోలన్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్, కిడ్నీ కాన్సర్, మరియు ఓరల్ క్యాన్సర్ )లను రాకుండా కాపాడుతుంది. ముల్లంగిలో శరీరాన్ని డిటాక్సిఫైచేయడానికి, విటమిన్ సి, ఫోలిక్ యాసిడి మరియు యాంతోసినిన్ వల్ల యాంటిక్యాన్సర్ ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి.

ముల్లంగి అంటే మూతి ముడుచుకుంటే ఎట్లా...?

స్కిన్ డిజార్డర్ ను నివారిస్తుంది: ముల్లంగిలో ఉండే విటమిన్ సి, ఫాస్పరస్, జింక్ మరియు విటమిన్ బి కాప్లెక్స్ వంటివి పుష్కలంగా ఉండటం వల్ల చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముల్లంగిని మంచి మాయిశ్చరైజర్ గా ఉపయోగిస్తారు. క్లెన్సర్ గాను మరియు ఫేస్ ప్యాక్ గాను ఉపయోగించడం వల్ల చర్మాన్ని సున్నితంగా..అందంగా మార్చుతుంది. చర్మానికి ముల్లంగిని ఉపయోగించడం వల్ల అధనపు ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాదు ఇది చర్మం పై పడ్డ, రాషెస్ ను, పొడిబారడాన్ని, చర్మపగుళ్లు మొదలగునవి నివారిస్తుంది.

ముల్లంగి అంటే మూతి ముడుచుకుంటే ఎట్లా...?

బొల్లి, తెల్లమచ్చలు(లుకోడెర్మాను) నివారిస్తుంది: ముల్లంగి డిటాక్సిఫైయింగ్ మరియు యాంటి కార్సినోజెనిక్ నేచర్ వల్ల ల్యూకుడెర్మాను నివారించే గుణాలు ఇందులో ఉన్నాయి. ముల్లంగి విత్తనాల నుండి తయారు చేసిన పౌడర్ ను లేదా వెనిగర్ ను ఉపయోగించి, పట్టించడం వల్ల లుకోడెర్మాను నివారించగులుగుతాం. చర్మ మీద ఏర్పడ్డ తెల్ల మచ్చలు ముల్లంగి విత్తనాలను పొడిచేసి వెనిగర్‌ లో లేదా అల్లంరసం, ఆవు మూత్రంలో కలిపి తెల్లగా ఉన్నచోట రాసినట్లయితే తగ్గిపోతాయి. ముల్లంగిని ఆహారంగా తీసుకున్నా తెల్లమచ్చలు తగ్గిపోతాయి.

ముల్లంగి అంటే మూతి ముడుచుకుంటే ఎట్లా...?

కిడ్నీ సమస్యల నివారణకు: మూత్రపిండాల వ్యాధుతలను నియంత్రిస్తుంది. ఎందుకంటే దీనిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలో విషాలను తొలగించడానికి రక్తాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. మూత్రపిండాలు సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతుంది. కాబట్టి మన డైలీ డయట్ లో ముల్లంగిని చేర్చుకోవడం చాలా అవసరం.

ముల్లంగి అంటే మూతి ముడుచుకుంటే ఎట్లా...?

క్రిమికీటకనాశకారినిగా: ముల్లంగిలో ఉండే యాంటీప్యూరిటిక్ గుణాలు క్రిమికీటకసంహరిణిగా పనిచేస్తుంది. తేనెటీగలు, కందిరీగలు మొదలగునవి కుట్టినప్పుడు నొప్పి మరియు వాపు ఉన్న ప్రదేశంలో ముల్లంగి రసాన్ని అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

ముల్లంగి అంటే మూతి ముడుచుకుంటే ఎట్లా...?

జ్వరాన్ని కంట్రోల్ చేస్తుంది: ముల్లంగి బాడీ టెంపరేచర్ ను తగ్గిస్తుంది. అందకు కారణం అయ్యే వాటిని నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముల్లంగి రసంలో కొద్దిగా బ్లాక్ సాల్ట్ కలిపి త్రాగడం వల్ల జ్వరానికి కారణం అయ్యే లక్షణాలతో పోరాడి, జ్వరాన్ని తగ్గిస్తుంది.

ముల్లంగి అంటే మూతి ముడుచుకుంటే ఎట్లా...?

రెస్పరేటర్ ప్రాబ్లెమ్స్(శ్వాససంబంధ)సమస్యలు: ముల్లంగి శ్వాససంబంధిత సమస్యలను నిరిస్తుంది. ముఖ్యంగా ముక్కు, గొంతు, శ్వాసనాళం మరియు ఊపిరితిత్తు సంబంధించిన సమస్యలు, దగ్గు, అలెర్జీ మరియు కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను నివారిస్తుంది. శ్వాసనాలం బాగా పనిచేసేలా చేస్తుంది.

ముల్లంగి అంటే మూతి ముడుచుకుంటే ఎట్లా...?

లివర్ మరయు గాల్ బ్లాడర్ కు చాలా మంచిది: ముల్లంగి లివర్ కు రక్షణ కల్పిస్తుంది. గాల్ బ్లాడర్ కు సంబంధించి సమస్యలను నివారించి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.

ఇతర ఉపయోగాలు: ముల్లంగి ఇంకా చెడు శ్వాసను నివారస్తుంది, జీవక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది, తలనొప్పి మరియు ఎసిడిటిని తొలగిస్తుంది. గొంతునొప్పిని నివారిస్తుంది. ముల్లంగి ఆకలిని వృద్ధి చేస్తుంది. అలాగే నోటిశ్వాసను తాజాగా ఉంచుతుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. కడుపులో మంట, తలనొప్పి, దగ్గుని తగ్గిస్తుంది.

English summary

Health benefits of eating Radishes | ముల్లంగి అంటే మూతి ముడుచుకుంటే ఎట్లా...?

Radish is a root vegetable which is mainly available in winters. Nowadays, this vegetable or any other vegetable, fruit is available throughout the year because of the development of agriculture. The scientific name of radish is “Raphanus sativus”. Radish forms an important part of salad. Radish is not only good in taste, but is also very beneficial for our health.
Story first published: Monday, February 18, 2013, 13:17 [IST]
Desktop Bottom Promotion