For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేడిపండులో చూడు..మేలైన ఆరోగ్య గుణగణాలు!

|

సీజన్‌లో దొరికే ఏ పండు అయినా మంచిదే! కాని అంజీర్ పండు అన్నిటికంటే భిన్నమైనది. ఇది పోషకాలగని. బజార్లలో తోపుడుబండ్ల మీద కనిపించే అంజీర్ పండ్లు ఇప్పుడు అందుబాటు ధరలోనే దొరుకుతున్నాయి. అంజీర్‌తో విటమిన్-ఎ, బి1, బి2, కాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియంతోపాటు క్లోరిన్ లభిస్తాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్‌, పాలిఫినోల్స్‌ను కూడా వీటిల్లో ఉంటాయి. రోజు 35 గ్రాముల ఎండిన అంజీరు పండు పౌడ రును తీసుకుంటే, ప్లాస్మాలో, యాంటీ ఆక్సిడెంట్‌ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఇందులోకాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది అంజీర్‌ పండులో మాత్రమే. కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది.

అత్తిపండునే హిందీలో అంజీర్‌ అని ఇంగ్లీష్‌లో పిగ్‌ అనీ పిలుస్తారు. ఆకర్షణీయమైన రంగూ రూపంగానీ, ఆహా అనిపించే రుచిగానీ అంజీర్‌కు లేవు. అందుకే అవి మార్కెట్లో కనిపించినా పెద్దగా పట్టించుకోం. డ్రైఫ్రూట్స్‌ డబ్బాలోనూ అది తప్ప మిగిలినవన్నీ ఖాళీ చేస్తాం. రూపం నచ్చకోలేక నిండా గింజల వల్లో చాలామంది వీటిని ఇష్టపడరు. కానీ ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. పాలు కలిపి చేసే జ్యూస్‌కి అంజీర్‌ని (ఎండుదయినా, పండుదయినా సరే) మించిన కాంబినేషన్‌ మరొకటి లేదు. అద్భుతమైన రుచితోపాటు పోషకవిలువలూ అందుతాయి.

మర్రి, మేడిపండ్ల కుటుంబానికి చెందిన అంజీర్‌చే ఆదిమమానవుడు మొదటిసారిగా రుచి చూశాడట. ఈ పండును క్లియోపాత్రా ఎంతో ఇష్టపడేదట. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే డ్రైఫ్రూట్‌ రూపంలోనే అంజీర్‌ వాడకం ఎక్కువ. కేకులు, స్వీట్లు మిల్క్‌ షేకుల్లో ఎక్కువగా వాడతారు.అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ దీన్ని ఔషధ ఫలంగా వాడతారు. ఇందులో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఏ వ్యాధితో బాధపడుతున్న వాళ్లయినా అంజీర్‌ను ఎండురూపంలో గానీ, పండుగా గానీ తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. శరీరానికి అవసరమైన శక్తిని వేగంగా అందిస్తాయి. జ్వరం వచ్చి తగ్గిన వెంటనే రెండు అంజీర్‌లు తింటే నోటికి రుచి, ఒంటికి శక్తి రెండూ వస్తాయి. వ్యాధుల్ని నిరోధించడమే కాదు, నివారించేందుకూ దోహదపడతాయి. శారీరక, మానసిక సమస్యల్ని తగ్గిస్తాయి. క్యాన్సర్‌ తరహా గడ్డల నివారణకి కూడా ఇవి మందుగా పనిచేస్తాయి. వీటితో పాటు మరికొన్ని గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది మరి అవేంటో ఒక సారి చూద్దాం...

మలబద్ధకం:

మలబద్ధకం:

అత్తిపండ్లలో అధిక మొత్తాల్లో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది. అలాగే దీనిపైన గట్టి తోలు ఉంటుంది. వీటివల్ల, వీటిని మలబద్ధకంలో వాడవచ్చు. అత్తిపండ్లలో ఉండే చిన్నచిన్న గింజలు పేగుల్లోపలి గోడలను సున్నితంగా ఉత్తేజ పరుస్తాయి. ఫలితంగా పేగుల కదలికలు పెరిగి మలం సజావుగా కిందవైపుకు ప్రయాణిస్తుంది. అలాగే పేగులను శుభ్రంగా ఉంచుతుంది.

అర్శమొలలు:

అర్శమొలలు:

అత్తిపండ్లు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి కనుక వీటిని మూలవ్యాధితో బాధపడేవారు వాడుకోవచ్చు. ఒక ఎనామిల్ పాత్రను వేడి నీళ్లతో శుభ్రపరిచి చన్నీళ్లు తీసుకొని మూడునాలుగు ఎండు- అత్తిపండ్లను రాత్రంతా నానేయాలి. ఉదయం పూట నాని ఉబ్బిన పండ్లను తినాలి. ఇలాగే మళ్లీ రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. ఇలా రెండుమూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేస్తే మూలవ్యాధి తగ్గుతుంది. మలనిర్హరణ సమయంలో ముక్కాల్సిన అవసరం రాదు. మూలవ్యాధి తీవ్రంగా ఉన్న వారిలో కొంతమందికి పెద్ద పేగు జారే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వారికీ ఇది బాగా పనిచేస్తుంది.

ఉబ్బసం:

ఉబ్బసం:

కొంతమందికి శ్వాస మార్గాల్లో కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవటం కష్టమవుతుంది. ఇలాంటివారు అత్తిపండ్లను వాడితే కఫం తెగి శ్వాస ధారాళంగా ఆడుతుంది. అలుపు, అలసటలు తగ్గి శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి.

శృంగారానురక్తి తగ్గటం:

శృంగారానురక్తి తగ్గటం:

అత్తిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి. వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

అధిక బ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారికి ఇది ఫర్ ఫెక్ట్ ఫ్రూట్. హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవారు, వారి రెగ్యులర్ డైట్ లో పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలిని సూచిస్తుంటారు. అజీర పండులో పొటాషియం మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హైపర్ టెన్షన్ ను కంట్రోల్ చేస్తుంది .

నోటిలో పుండ్లు:

నోటిలో పుండ్లు:

అత్తిపండ్లనుంచీ కారే పాల మాదిరి నిర్యాసాన్ని స్థానికంగా ప్రయోగించాలి.

శరీరంలో వేడి:

శరీరంలో వేడి:

బాగా పండిన తాజా అత్తిపండ్లను 2- 3 తీసుకొని మిశ్రీతో కలపాలి. వీటిని రాత్రంతా పొగమంచులో ఆరుబయట ఉంచాలి. ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. దీనిని 15రోజులపాటు చేయాలి.

బలహీనత:

బలహీనత:

చాలామందికి శారీరక బలహీనతవల్ల నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు అత్తిపండ్లను తీసుకుంటే హితకరంగా ఉంటుంది.

నిద్రలేమి సమస్యను నివారిస్తుంది:

నిద్రలేమి సమస్యను నివారిస్తుంది:

ఇందులోని ట్రిప్టోఫాన్‌ హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. అందుకే నిద్రలేమితో బాధపడేవాళ్లు రోజూ రాత్రిపూట రెండు, మూడు అత్తిపండ్లు తిని పాలు తాగితే మంచి నిద్రపడుతుంది.

గుండె వ్యాధుల నివారణ:

గుండె వ్యాధుల నివారణ:

ఎండు పండ్లలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల్ల హృద్రోగ నివారణకీ తోడ్పడతాయి. ఎండు అంజీరాలలో ఫెనాల్, ఒమేగ3 మరియు ఒమెగ6 ఫ్యాటీ ఆసిడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల గుండె జబ్బుల రిస్క్ నుండి బయట పడవచ్చు.

షుగరు పేషెంట్లకు దివ్యౌషధం:-

షుగరు పేషెంట్లకు దివ్యౌషధం:-

అంజీర ఆకులు మరియు పండ్లు షుగరు పేషెంట్లకు అల్పాహారం క్రింద వాడుకొవచ్చు. ఫిగ్స్ ఆకులు ఇన్సులిన్ మోతాదును క్రమబద్ధీకరించుటలో వీటి పాత్ర అధికం. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చెయ్యడంలో ఆకుల పాత్ర అధికం. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చెయ్యగల పొటాషియం ఆకులలో లభిస్తుంది.

కొలోన్ కాన్సర్:-

కొలోన్ కాన్సర్:-

ఇందులో లభ్యమయ్యే పీచుపదర్ధం వలన హానికారక టాక్సిన్స్ ను వ్యర్ధ పదార్ధాలుగా బయటకు పంపివేయబడతాయి. దీనివలన ప్రేగులలో ఏర్పడే కొలోన్ కాన్సర్ ను నియంత్రించవచ్చు.

ఎముకలు పటిష్టం:-

ఎముకలు పటిష్టం:-

ఎముకల బలానికి అవసరమయ్యే కాల్షియం అంజీరలో అధిక మోతాదులో ఉంది.

లో కొలెస్ట్రాల్:-

లో కొలెస్ట్రాల్:-

అంజీరలో ఉండే పీచుపదార్ధం పెక్టిన్ వలన మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

బరువును తగ్గిస్తుంది:

బరువును తగ్గిస్తుంది:

బరువు తగ్గడంలో పీచుపదార్థాలు చేసే మేలు అంతాఇంతా కాదు. అంజీర్‌లో అలాంటి పీచు ఎక్కువ. పేవుల్లోని గోడలకు అంటుకున్న వ్యర్థపదార్థాల్ని పీచుపదార్థం శుభ్రం చేస్తుంది. బరవుతగ్గడం తేలికవుతుంది.

English summary

Health Benefits of Figs

Figs or anjeer is a fruit that everyone must eat. They are seasonal fruits that are found in Western parts of Asia. However, dried figs are always available in the market near you. Figs belongs to the mulberry family.
 
Story first published: Thursday, December 5, 2013, 15:46 [IST]
Desktop Bottom Promotion