For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భయంకర వ్యాధుల నిరోవారణకు వండర్ ఫ్రూట్ !

|

లిచీ : సమ్మర్ దొరికే స్పెషల్ ఫ్రూట్ ఇది. ఇందులో ప్రోటీన్, విటమిన్స్, ఫ్యాట్, సిట్రిక్ యాసిడ్స్, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. జ్యూసీగా, తియ్యగా ఉంటుంది. సోప్‌బెర్రీ కుటుంబానికి చెందిన లీచీ తరగతిలోని ఒక ఒంటరి వృక్షజాతి. ఉష్ణమండల మరియు ఉపోష్ణమండల ప్రాంతాల్లో పెరిగే ఈ ఫల వృక్షం జన్మస్థలం చైనా అయినప్పటికీ, ప్రస్తుతం దీన్ని ప్రపచంలోని అనేక ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. దీని తాజా ఫలం "సుగంధ పరిమళ" సువాసన ఉన్న ఒక "సున్నితమైన, తెల్లటి కండ కలిగిన ఫలం", ఈ ఫలాన్ని నిల్వచేసిన సమయంలో సువాసన కోల్పోతుంది కాబట్టి చాలావరకు దీన్ని తాజాగా ఉన్నప్పుడే తింటుంటారు.

లీచీకి సంబంధించి ప్రతి 100 గ్రాముల ఫలంలో సరాసరిగా 72 మి.గ్రా విటమన్ C ఉంటుంది. సరాసరిగా తొమ్మిది లీచీ ఫలాలను తీసుకుంటే పెద్దవారికి సిఫార్సు చేయబడిన రోజువారీ విటమిన్ C అవసరం నెరవేరినట్టే. ఇక ఒక కప్పుడు లీచీ ఫలాల ద్వారా ఇతర ఖనిజ లవణాల రూపంలో, 2000 క్యాలరీ డైట్, 14%DV రాగి, 9%DV ఫాస్పరస్, మరియు 6%DV పొటాషియం లాంటివి కూడా లభిస్తాయి. చీలలో సంతృప్తకర కొవ్వు మరియు సోడియం తక్కువగా ఉండడంతో పాటు కొలెస్ట్రాల్ రహితంగా ఉంటాయి. లీచీలలోని శక్తి రూపం చాలావరకు పిండిపదార్థం(చక్కెర) రూపంలో ఉంటుంది. పాలీఫెనాల్‌లను అధికంగా కలిగి ఉండే లీచీలు ద్రాక్షతో పోలిస్తే 15% ఎక్కువ పాలీఫెనాల్‌ను కలిగి ఉండడం వల్ల సాధారణంగా వీటిని పాలీఫెనాల్ అత్యధికంగా కలిగిన ఫలాలుగా పిలుస్తుంటారు.

లీచీ అద్భుతమైన రుచి మరియు సువాసన మాత్రమే కాదు, లీచీ పండ్లలో హెల్త్ బెనిఫిట్స్, న్యూట్రీషియన్ బెనిఫిట్స్ కూడా అధికమే. న్యూట్రీషన్స్ పుష్కలంగా ఉండే వండర్ ఫ్రూట్. ఈ జ్యూసీ ఫ్రూట్ లో ఉండే ఐరన్ మరియు కాపర్ శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ను పెంపొంధించడంలో బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ ను నిరోధించే పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీయాక్సిడెంట్స్ శరీరానికి హానీ కలిగించే ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు ఇందులో ఉండే ఒలిగోనల్ వయస్సు మీదపడకుండా కాపాడుతుంది ఇంకా చర్మం నుండి డార్క్ స్పాట్స్ ను నిరోధిస్తుంది. కాబట్టి చర్మ మీద ఉన్న నల్ల మచ్చలు, మరియు నల్లటి చాలరను పారదోలుతుంది. కాబట్టి లీచీ పండు అలాగే తినడం కానీ లేదా ఫేస్ ప్యాక్ గా ఉపయోగించడం కానీ చేయవచ్చు. మరి ఈ వండర్ ఫ్రూట్ వల్ల మరికొన్ని ఆశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలేంటో ఒకసారి చూద్దాం...

లీచీ హెల్త్ బెనిఫిట్స్:

భయంకర వ్యాధులకు భరోసా..లీచీ ఫ్రూట్..!

గుండె సమస్యలను తగ్గిస్తుంది: లిచీ పండ్లలో గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే పాలిపినాల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే బీటాకెరోటిన్ మరియు ఓలిగోనల్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

భయంకర వ్యాధులకు భరోసా..లీచీ ఫ్రూట్..!

క్యాన్సర్ సెల్స్ ను చంపేస్తుంది: హెల్త్ బెనిఫిట్స్ లో లీచీ వల్ల మరో అద్భుత ప్రయోజనం.ఇది పెద్దప్రేగు కాన్సర్ కు కారణం అయ్యే క్యాన్సర్ కణాలు మరియు కణితులు ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. లీచీలో ఉండే పాలిఫినాల్స్ క్యాన్సర్ వ్యాధులను అరికట్టడంలో బాగా పనిచేస్తాయి.

భయంకర వ్యాధులకు భరోసా..లీచీ ఫ్రూట్..!

జలుబు మరియు గొంతునొప్పిని నివారిస్తుంది. జలుబు మరియు గొంతునొప్పితో బాధపడుతన్నారా?అయితే ఈ జ్యూసీ ఫ్రూట్ తినడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

భయంకర వ్యాధులకు భరోసా..లీచీ ఫ్రూట్..!

ఆస్తమా నుండి రక్షణ కల్పిస్తుంది: లీచీ ప్రాణాంతకమైన క్రానిక్ శ్వాస సంబంధమైన వ్యాధులు, ఉబ్బసం నుండి రక్షిస్తుంది. కాబట్టి, ఈ సీజన్ లో దొరికే ఈ పండును తినడానికి నిర్ధారించుకోండి.

భయంకర వ్యాధులకు భరోసా..లీచీ ఫ్రూట్..!

వయస్సు మీద పడకుండా నీరోధిస్తుంది: లీచీ లో మంచి జీర్ణశక్తిని కలిగి ఉంటుంది. ఇంకా మలబద్దకాన్ని నిరోధిస్తుంది. మరియు శరీరం నుండి ఫ్రీరాడికల్స్ ను బయటకు తొలగిస్తుంది. ఇది స్కిన్ డ్యామేజ్ కాకుండా నిరోధిస్తుంది మరియు వృద్ధాప్యం యొక్క ప్రారంభ సంకేతాలకు తగ్గిస్తుంది.

భయంకర వ్యాధులకు భరోసా..లీచీ ఫ్రూట్..!

బరువును తగ్గిస్తుంది: ఇది మరో అద్భుతమైన ప్రయోజనం. లీచీలను తినడం వల్ల ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉండి బరువు తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

భయంకర వ్యాధులకు భరోసా..లీచీ ఫ్రూట్..!

తీపి తినాలనే కోరికను కంట్రోల్ చేస్తుంది : ఈ తాజా మరియు జ్యూసీ ఫ్రూట్ ను తినడం వల్ల స్వీట్ తినాలనే కోరికను తగ్గిస్తుంది.

భయంకర వ్యాధులకు భరోసా..లీచీ ఫ్రూట్..!

వ్యాధినిరోధక వ్యవస్థ సౌలభ్యాన్ని కలిగిస్తుంది: లీచీలో ఉండే అధిక న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ (సి విటమిన్)వల్ల రోగనిరోధక వ్యవస్థ సౌలభ్యం.

భయంకర వ్యాధులకు భరోసా..లీచీ ఫ్రూట్..!

మలబద్ధకాన్ని నిరోధిస్తుంది: లీచీలను తరుచూ తీసుకోవడం వల్ల మలబద్దకంను నిరోధిస్తుంది.

భయంకర వ్యాధులకు భరోసా..లీచీ ఫ్రూట్..!

విర్యావర్తకమైన మందు: తాజా, జ్యూసీ ఫ్రూట్ ను తినడం వల్ల సెక్స్ లైఫ్ ను పెంచుతుంది.

English summary

Health Benefits Of Juicy Lychees

Summer is upon us and monsoon is knocking the door for most of the cities. It is thus the best time to have the seasonal fruit, lychee. The juicy and pulpy tropical fruit is widely available in the market. We often have this fruit when the monsoon comes in.
Desktop Bottom Promotion